
11/06/2025
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సోదర సోదరీమణులకు, పెద్దలకు నమస్కారం....
*************************************
మెగామైండ్స్ వెబ్‌సైట్ ని గత పదేళ్లగా ఇష్టం తో, శ్రద్ధాభక్తులతో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ కోటి మందికి పైగా మన వెబ్‌సైట్ ని సందర్శించారు. రోజూ ఐదువేల మంది వీక్షిస్రున్నారు. నెలకు రెండు లక్షల మంది పైబడి వీక్షిస్తున్నారు.
పోయిన సంవత్సరం అత్యధికంగా ఒకే రోజు 60 వేల మంది యోగా దినోత్సవం రోజు వీక్షించడం జరిగింది. ఈ సారి కూడా ఒక లక్ష్యం తో జూన్ 21 యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మన విశాఖపట్నం లో నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కనీసం ఆరు యోగాసనాలైనా నేర్పాలనే సంకల్పంతో మెగామైండ్స్ నుండి సుమారు యాబై ఆసనాలు పైబడి తెలుగు మరుయు English లలో వెబ్‌సైట్ ద్వారా యోగా ఆసనాలు ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాము.
ఈ సారి జూన్ 21 కి ఒక లక్షమందికి పైగా మన వెబ్‌సైట్ ని వీక్షించాలని ఆశిస్తున్నాము. దీనిలో భాగంగా రోజూ మన వెబ్‌సైట్ కనీసం ఒకసారైనా సందర్శించి యోగా దినోత్సవం కు సంబంధిత ఆసనాలు, ప్రాణాయామం, యమ నియమాలు ఇలా అష్టాంగ యోగ ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు.
మీ అందరికీ మా విన్నపం ఒక్కటే మెగామైండ్స్ ని ఇక నుండి రోజూ ఒక్కసారైనా వీక్షించండి.
దేశం కోసం మన ఆరోగ్యం కోసం మెగామైండ్స్ ని సందర్శించండి...
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఆరోగ్య భారత్ సమర్థవంతమైన భారత్ గా ఎదుగుతుంది.
తప్పక వీక్షించండి...
www.megaminsaindia.in
ధన్యవాదాలు... మీ రాజశేఖర్ మెగామైండ్స్.