Nandyal Today

  • Home
  • Nandyal Today

Nandyal Today Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nandyal Today, Media/News Company, .

పత్రికా ప్రకటననంద్యాల జిల్లా    05 జూన్, 2026జిల్లాలో గంజాయి నియంతరణపై ప్రత్యక నిఘా….జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో విస్తృ...
05/06/2026

పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా
05 జూన్, 2026

జిల్లాలో గంజాయి నియంతరణపై ప్రత్యక నిఘా….

జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు...

5 నెలల్లో 8 కేసులు, 23 మంది అరెస్ట్, 23.193 కేజీల గంజాయి సీజ్.. .

యువత భవిష్యత్తును నాశనం చేస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.

నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ సునీల్ షొరాణ్, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా విస్తృత తనిఖీలు చేపడుతున్నామని,పాతనేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం ద్వారా ఈ ఏడాది జనవరి నెల నుండి మే నెల వరకు (గడిచిన ఐదు నెలల్లో) సాధించిన పురోగతిని ఆయన వెల్లడించారు.

స్కూల్ ,కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

గంజాయిని అణచివేయడంతో పాటు, యువత దీని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలోని వివిధ కళాశాలల్లో,ముఖ్యమైన ప్రాంతాలలో విద్యార్థులకు,ప్రజలకు గంజాయి మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

జనవరి నుండి మే నెల వరకు (గడిచిన ఐదు నెలల్లో) జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఎస్పీ గారు వెల్లడించారు:

నమోదైన కేసులు: 08

అరెస్ట్ అయిన నిందితులు:-
23 మంది.

స్వాధీనం చేసుకున్న గంజాయి: 23.193 కేజీలు

ఎస్పీ గారి హెచ్చరిక

"గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, లేదా యువతను వ్యసనాల వైపు పురికొల్పినా ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తాం. గంజాయి రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడానికి కూడా వెనకాడం అన్నారు.యువత చెడు అలవాట్లకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని,జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని,సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు స్పష్టం చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల

వ్యాపారులకు మంచి సువర్ణ అవకాశం... టెక్కే వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాలకు వేలం పాటలు..ఈ నెల 9 న  10 దుకాణాలు,ఒక గోడౌన్ క...
04/06/2026

వ్యాపారులకు మంచి సువర్ణ అవకాశం... టెక్కే వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాలకు వేలం పాటలు..ఈ నెల 9 న 10 దుకాణాలు,ఒక గోడౌన్ కు వేలం పాటలు...పట్టణ నడిబొడ్డులో దుకాణాలు...వ్యాపారులు సద్వినియోగం చేసుకోండి.

నంద్యాల పట్టణం టెక్కే వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన 10 దుకాణాలు,ఒక గోడౌన్ కు ఈ నెల 9 న వేలం పాటలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుంటుపల్లి హరి బాబు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 20 దుకాణాలు ఉన్నాయి.ప్రస్తుతం ఆ దుకాణాల్లో ఉన్న వారి గడువు ముగిసింది.ఈ నేపధ్యంలో 1 దుకాణం నుంచి 10 వ దుకాణం ,ఒక గోడౌన్ ఈ నెల 9 వేలం పాటలు వేస్తున్నారు.వేలంపాటలో పాల్గొనే వారు కమిటీ కార్యాలయంలో వెయ్యి రూపాయలు కట్టి అప్లికేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు.వేలం పాటలో పాల్గొనే వారు దరావస్తు సొమ్ము 5 వేలు చెల్లించి వేలం పాల్గొనాలని అన్నారు.వేలం పాటలో దుకాణం రాని పక్షంలో కట్టిన డబ్బు వరం లో తిరిగి ఇస్తామని పేర్కొంటున్నారు.వ్యాపారులకు మంచి సువర్ణావకాశం.ప్రధాన సెంటర్లో ఉండడంతో వ్యాపారాలు బాగా జరుగుతాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.పట్టణ,గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎవరైనా వేలం పాటల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

నంద్యాల ప్రజలకు శుభవార్త – ఉత్తర భారత ప్రయాణాలకు ప్రత్యేక రైలు సౌకర్యంనంద్యాల ప్రతినిధి. మే 31.  (నంది పత్రిక ):నంద్యాల ...
31/05/2026

నంద్యాల ప్రజలకు శుభవార్త – ఉత్తర భారత ప్రయాణాలకు ప్రత్యేక రైలు సౌకర్యం

నంద్యాల ప్రతినిధి. మే 31. (నంది పత్రిక ):నంద్యాల ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఒక ముఖ్యమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దానాపూర్ – బెంగళూరు (సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్) – దానాపూర్ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు (ట్రైన్ .03251/03252) ను రేపటి నుండి 45 రోజుల పాటు ప్రతిరోజూ నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.ఈ ప్రత్యేక రైలు 01 జూన్ 2026 నుండి 15 జూలై 2026 వరకు దానాపూర్ నుండి, అలాగే 03 జూన్ 2026 నుండి 17 జూలై 2026 వరకు బెంగళూరు నుండి నడుస్తుంది.
ఈ రైలు నంద్యాల (నంద్యాల) రైల్వే స్టేషన్‌లో ఆగడం నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప ప్రయోజనంగా నిలుస్తుంది.నంద్యాలలో రైలు సమయాలు: • 03251 దానాపూర్ – బెంగళూరు ప్రత్యేక రైలు.నంద్యాల చేరిక : ఉదయం 04:38 గంటలకు
నంద్యాల బయలుదేరు : ఉదయం 04:40 గంటలకు
• 03252 బెంగళూరు – దానాపూర్ ప్రత్యేక రైలు
నంద్యాల చేరిక : ఉదయం 08:30 గంటలకు.నంద్యాల బయలుదేరు : ఉదయం 08:32 గంటలకు.నంద్యాల ప్రజలకు ఈ రైలు ఎందుకు ఎంతో ఉపయోగకరం?ఇప్పటివరకు నంద్యాల నుండి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకు నేరుగా లేదా సులభ కనెక్షన్లతో ప్రయాణించే అవకాశాలు పరిమితంగా ఉండేవి. ఈ ప్రత్యేక రైలు ప్రారంభంతో ఉత్తర భారత యాత్రలు మరింత సులభం కానున్నాయి.ఈ రైలు ద్వారా ప్రయాణికులు క్రింది ముఖ్య ప్రాంతాలకు చేరుకోవచ్చు:
• ప్రయాగ్‌రాజ్ (ప్రయాగ్రజ్ / అలహాబాద్ ప్రాంతం)
• పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ (మొఘల్‌సరాయి – డిడియూ )
• పాట్నా – దానాపూర్ ప్రాంతం
• బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
• ఉత్తర భారత రైళ్లకు ముఖ్య జంక్షన్లు.
ప్రత్యేకంగా కాశీ/వారణాసి యాత్రికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రైలు డిడియూ (మొఘల్‌సరాయి జంక్షన్) వరకు వెళ్తుంది. అక్కడి నుండి వారణాసి నగరం చాలా సమీపంలో ఉండడంతో, నంద్యాల ప్రజలు సులభంగా కాశీ విశ్వనాథ్ దర్శనం, గంగాస్నానం, మరియు ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రలు చేయగలరు.అదేవిధంగా:
• కాశీ – వారణాసి
• గయా
• పాట్నా సాహిబ్
• బోధ్ గయా
• అయోధ్య, లక్నో తదితర ప్రాంతాలకు కనెక్టివిటీ పొందే అవకాశాలు పెరుగుతాయి.
ఈ రైలు బెంగళూరు – నంద్యాల – విజయవాడ – నాగపూర్ – జబల్‌పూర్ – ప్రయాగ్‌రాజ్ – దానాపూర్ మార్గంలో నడవడం వల్ల ఉద్యోగ, విద్య, వ్యాపార మరియు వైద్య ప్రయాణాలకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి
ఈ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని నంద్యాల మరియు రాయలసీమ ప్రాంత ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఉత్తర భారత యాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, కుటుంబ మరియు ఉద్యోగ ప్రయాణాలకు ఇది ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది.

పత్రికా ప్రకటననంద్యాల జిల్లా29.05.2026ఆపరేషన్ దండయనఇందులో బాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహిళా మరియు శిశు భద్రత కొరకు ...
29/05/2026

పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా
29.05.2026

ఆపరేషన్ దండయన

ఇందులో బాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహిళా మరియు శిశు భద్రత కొరకు ఆపరేషన్ దండయన ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహి ళలపై జరుగుతున్న నేరాలలో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేవిదంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మరియు మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ (Speed Trial Monitoring) విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహ హింస, పోక్సో కేసుల్లో తదితర నేరస్తులపై నిఘాకు మరియు నేరాల నియంత్రణ కార్యక్రమము లో భాగంగా "ఆపరేషన్ దండాయన" ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమైనది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు మాట్లాడుతూ, "మహిళలపై నేరాల విషయంలో పోలీస్ వైఖరి (Zero tolerance Policy) మరియు Conviction based policing నినాదంతో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్ష లు పడేవిదంగా చేసి ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు " ఆపరేషన్ దండయన " నిరంతరం నంద్యాల జిల్లా లో కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.

మహిళా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి నేరాన్ని ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా శ్రీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ప్రజలకు తెలియజేశారు.

ఆపరేషన్ దండయన ముఖ్య ఉద్దేశాలు
1 . స్పీడ్ ట్రయల్ మానిటరింగ్: మహిళలపై నేరాల్లో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా పకడ్బందీగా అమలు.
2. 60 రోజుల గడువు: మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి.
3. విచారణ పర్యవేక్షణ: తీర్పు కోసం నిలిపిన అన్ని CAW&C [Crime Against Women & Children] కేసులను తుది తీర్పు వెలువడే వరకు క్షుణ్ణంగా పర్యవేక్షించాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని CAW&C కేసులను సమీక్షించి, ఆలస్యానికి గల కారణాలను గుర్తించాలి.
4. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి త్వరిత శిక్షలు పడేవిదంగా చేయడం. సంచలనాత్మక కేసులను గుర్తించి, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేస్తూ త్వరిత విచారణకు తీసుకెళ్లాలి.
6. నేరస్తులపై నిఘా: పునరావృత నేరస్తులు, అనుమానితులపై SOS - సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవడం, వారి పై నిరంతర నిఘా వుంచడము.
7. సాంకేతిక నిఘా: జియోట్యాగింగ్ మరియు 'నైబర్హుడ్ వాచ్' ద్వారా నేరస్తులపై నిఘా వుంచుటకు ప్రజల భాగస్వామ్యంతో నిఘా వుంచడము.
8. బాధితులకు సహాయం: ఎన్జీవోల సహకారంతో కౌన్సెలింగ్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సహకారం తో న్యాయ సహాయం అందించడం, జువెనైల్ జస్టిస్ అధికారులతో సమన్వయం చేయడం.
9. పరివర్తన సదాస్ (సంస్కరణాత్మక కౌన్సెలింగ్): గుర్తించిన నేరస్తులకు ప్రతి శనివారం కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించడం, పునరావృత నేరాలు తగ్గించేందుకు మనోవైద్యులు, సామాజిక కార్యకర్తలు, సమాజ నాయకులను భాగస్వామ్యం చేయడం.

 ఆపరేషన్ దండయన లో బాగంగా నంద్యాల జిల్లా నందు స్పీడ్ ట్రైల్ మానిటరింగ్ ద్వారా ఇప్పటి వరకు 18 కేసులలో నేరస్తుల కు శిక్షలు పడే విదంగా చర్యలు తీసుకోవడం అయినది మరియు విచారణలో వున్న కేసు ల పై ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షలు పడేవిదంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

 పునరావృత నేరస్తులు, అనుమానితులపై జిల్లా వ్యాప్తంగా 182 SOS ( Sexual offender Sheets) తెరవడం జరిగినది మరియు వారిపై నిరంతరం నిఘా వుంచుతూ జియో ట్యాగింగ్ మరియు 'నైబర్హుడ్ వాచ్' ద్వారా వారి నేర ప్రవృత్తి ని నియంత్రించడం జరుగుచున్నది.
 అవసరమైన సందర్భం లలో భాదితులకు భద్రత కల్పిస్తూ, NGO ల సహకారం తో కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం అందించడం జరుగుతుంది.
 నేరస్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు సామాజిక కార్యకర్తలతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం "పరివర్తన సదస్సులు" నిర్వహించడం, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
 ఇటీవల నమోదైన కేసుల్లో వచ్చిన శిక్షల తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో చట్టంపై భయంతో పాటు అవహాహన కల్పించాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
 జిల్లా ఎస్పీ గారి హెచ్చరిక "మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం, ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు 'ఆపరేషన్ దండయన ' కొనసాగుతుంది.”

జిల్లా పోలీసు కార్యాలయం, నంద్యాల.

పత్రికా ప్రకటననంద్యాల జిల్లా26.05.2026​శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలి:​ జిల్లా వ్యాప్తంగా ...
27/05/2026

పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా
26.05.2026

​శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలి:

​ జిల్లా వ్యాప్తంగా గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు.

​ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

​ నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ శ్రీ N. యుగంధర్ బాబు నియామకం (ఫోన్ నెం: 9154980854).

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్ట అమలు మరియు సామాజిక సామరస్యాన్ని పటిష్టం చేయడం కోసం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ జిల్లా ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
​ఈ పండుగ కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించేందుకు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ N. యుగంధర్ బాబు గారిని నోడల్ అధికారిగా నియమించారు. జిల్లాలో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా నోడల్ అధికారి ఫోన్ నెంబర్ 9154980854 కు సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు.

​ పోలీస్ శాఖ జారీ చేసిన ముఖ్యమైన సూచనలు/మార్గదర్శకాలు

​ అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా బక్రీద్ సందర్భంగా పశువులను అక్రమంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నందున జిల్లా సరిహద్దుల్లో, ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి నిఘా ఉంచడం జరిగింది.

​ తనిఖీల తీవ్రతరం: అనుమానాస్పద ప్రదేశాలు, ఖాళీ స్థలాలు, షెడ్లు, ఫారంహౌస్‌లలో అక్రమంగా పశువులను దాచిపెట్టినట్లు సమాచారం వస్తే తక్షణమే తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.

​ గోవధ నిషేధ చట్టాల కఠిన అమలు
గోవధ రాష్ట్ర చట్టాల ప్రకారం గోవధ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన కేసులు నమోదు చేసి తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది.

​ జంతు క్రూరత్వ నిరోధక చట్టాల అమలు:
Animal Welfare Board of India మార్గదర్శకాల ప్రకారం జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, అమానుషంగా రవాణా చేయడం, హింసించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

​ ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు:
ఏవైనా అనుమానాస్పద రవాణా లేదా కార్యకలాపాలు గమనిస్తే ప్రజలు స్వయంగా అడ్డుకోవడం, వాహనాలను ఆపడం చేయరాదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు.

​ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా:
తప్పుడు ప్రచారాలు, వదంతులు, పాత వీడియోలు/ఫోటోలను షేర్ చేస్తూ మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై సైబర్ వింగ్ ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి.

​ సున్నిత ప్రాంతాల్లో బీట్ బందోబస్తు:
జిల్లా వ్యాప్తంగా కమ్యూనల్ సెన్సిటివ్ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్ ప్రాంతాలలో పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘా మరియు బీట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

​ మత పెద్దలతో సమన్వయం:
శాంతియుత వాతావరణం కోసం ఇప్పటికే మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి వారి సహకారాన్ని కోరడం జరిగింది.

​ ముగింపు హెచ్చరిక:
జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించినా, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే విధంగా ప్రవర్తించినా, చట్టాన్ని ఉల్లంఘించినా ఎవరినీ ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు హెచ్చరించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,
నంద్యాల జిల్లా.

Big Breaking NEWSమరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుదేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీ...
25/05/2026

Big Breaking NEWS
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచాయి. పెంచిన ధరలు ఈరోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.

నంద్యాలలో ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ ఆధ్వర్యంలో కీలక సమావేశం బక్రీద్ పండుగను ప్రశాంతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకార...
25/05/2026

నంద్యాలలో ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ ఆధ్వర్యంలో కీలక సమావేశం బక్రీద్ పండుగను ప్రశాంతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుపుకోవాలి సమయపాలనతో నమాజ్, ఆవు వధపై నిషేధాన్ని గౌరవిస్తూ తీర్మానం

నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ నందుగల కుబ్రా మసీదులో నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం మరియు నంద్యాల జమియేతే ఉలేమా హిందూ అధ్యక్షులు అంజాద్ బాషా సిదికి ఆధ్వర్యంలోముఖ్యమైన సమావేశం నిర్వహించారు. రాబోయే పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సంఘం సంఘం ప్రతినిధులు మరియు మత పెద్దలు మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన సమయపాలన పాటించి నిర్ణీత సమయానికి ఈద్గా లేదా మసీదులకు చేరుకుని నమాజ్ ఆచరించాలని కోరారు. నమాజ్ అనంతరం జరిగే పవిత్ర కుర్బానీ (త్యాగం) ప్రక్రియలో కేవలం పొట్టేళ్లను మాత్రమే కుర్బానీగా సమర్పించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను మరియు చట్టాలను గౌరవిస్తూ, బక్రీద్ పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవులను వధించకూడదని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఒకవేళ ప్రభుత్వం ఆవును 'జాతీయ జంతువు'గా ప్రకటిస్తే, తామందరం దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా పెద్దలు ఒక తీర్మానం ద్వారా వెల్లడించారు. కుర్బానీ అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండుగను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం నిర్వాహకులు, జమియేతే ఉలేమా హిందూ ప్రతినిధులు, మౌలానా మహబూబ్ బాషా హఫీస్ అబ్దుల్సలాం సాహెబ్ మౌల్విఅబ్దుల్ రవుఫ్ సాహెబ్ హఫీజ్ అబ్దుల్ రజాక్ అబ్దుల్ రహమాన్ హాఫీజ్ అబ్దుల్ మజీద హాఫీస్ కాజా హాఫీస్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

పత్రికా ప్రకటనఈ నెల 25న ప్రజా సమస్యల పరిష్కార వేదికవేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల ...
24/05/2026

పత్రికా ప్రకటన

ఈ నెల 25న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహణ

నంద్యాల, మే 24 :-

జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తేదీ (సోమవారం)న జిల్లా వ్యాప్తంగా “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గారు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమ సమయాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను నేరుగా సమర్పించడంతో పాటు, meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా, దాఖలు చేసిన అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ స్థాయి కార్యాలయాల్లో అధికారులకు వినతులు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.

డిఐపిఆర్ఓ, నంద్యాల ద్వారా జారీ

భారత దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలు - లీటరు పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంపు - ఇవాళి నుంచే అమల్లో...
23/05/2026

భారత దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలు - లీటరు పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంపు - ఇవాళి నుంచే అమల్లోకి రానున్న పెరిగిన ధరలు - ప్రతి నాలుగు రోజులకూ పెరుగుతున్న ఇంధన ధరలు – ఈ నెలలోనే మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పదవతరగతి ఉత్తీర్ణత సాధించిన ముస్లిం మైనార్టీ విద్యార్థులకు అంజుమన్ సంస్థ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్స్ ధరఖాస్తులు ఆహ్వానం -...
22/05/2026

పదవతరగతి ఉత్తీర్ణత సాధించిన ముస్లిం మైనార్టీ విద్యార్థులకు అంజుమన్ సంస్థ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్స్ ధరఖాస్తులు ఆహ్వానం - ముస్లిం విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోండి - నశ్యం అబ్దుల్ ఖుద్దూస్

గత పదిహెనేళ్ళగా ఇస్తున్నట్లే ఈ విద్యా సంవత్సరం (2025 -26) పదవతరగతి లో ఉత్తీర్ణత సాధించిన నంద్యాల పరిధిలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులకు అంజుమన్ సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికి రూ.3000/- స్కాలర్షిప్ ఇస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సంవత్సరం పదవతరగతి పాస్ అయి, ఉన్నత చదువులకు వెళ్ళబోయే ముస్లిం మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశం వినియోగించు కోవాలని శ్రీ ఖుద్దుస్ కోరారు. అంజుమన్ సంస్ధ ముస్లింల కోసం చేసే సేవలో ఇదొకటని ఆయన అంజుమన్ సేవలు తెలిపారు‌. ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా గల అంజుమన్ సంస్థలో ఉచితంగా లభించే దరాఖాస్తు ఫారంలో పూర్తి వివరాలు నింపి ఆధార్ కార్డు,10వ తరగతి మార్క్ లిస్ట్, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, కళాశాలలో చేరిన ధృవీకరణ పత్రం, రెండు ఫోటోలు జతచేసి జూన్ 20వ తేది లోపు పూర్తి చేసిన దరఖాస్తులను అంజుమన్ సంస్థ లో అందజేయాలన్నారు. స్కాలర్షిప్ పంపిణి తేది తదనంతరం ప్రకటించబడును.
ఎన్.ఏ.ఖుద్దూస్
అధ్యక్షులు
అంజుమన్, నంద్యాల.
9866242724

Address


Alerts

Be the first to know and let us send you an email when Nandyal Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share