28/04/2025
నిరంకుసత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు..!
- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మున్సిపల్ వైస్ చైర్మన్ గా మదార్ సాహెబ్..!
మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ను కౌన్సిల్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌన్సిల్ సమావేశహాలులో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మదార్ సాహెబ్ ను వైస్ చైర్మన్ గా బలపరుస్తూ.. 17 మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వ్యవహరించి, కౌన్సిలర్ల ఆమోదాన్ని ధ్రువీకరించారు. దీంతో మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ గా ఎన్నిక లాంఛనమైంది. అనంతరం జాయింట్ కలెక్టర్, గురజాల ఆర్డీవో మురళి ఆయనకు డిక్లరేషన్ ఫామ్ అందజేశారు. అనంతరం మదార్ సాహెబ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎక్స్అఫీసీయో మెంబర్ గా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి, మదార్ సాహెబ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరంకుసత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు..!
వైసిపి ప్రభుత్వం హయాంలో మాచర్ల మున్సిపాలిటీలో నిరంకుసత్వం రాజ్యమేలిందని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన టిడిపి, బిజెపి, జనసేన నాయకులపై దాడులు, కేసులు పెట్టి మరి 31 వార్డుల్లో 31 మంది వైసిపి నాయకులను కౌన్సిలర్ గా ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 10 నెలల కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.., వైసిపి కౌన్సిలర్లు స్వచ్ఛందంగా వచ్చి టిడిపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. మాచర్ల మున్సిపాలిటీ సర్వతో ముఖాభివృద్ధి సాధించే దిశగా కౌన్సిల్ పనిచేయాలని సూచించారు. పట్టణం అభివృద్ధి చెందితే, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కచ్చితంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుపడి ఉంటారు..!
జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబల హయాం నుంచి జూలకంటి కుటుంబం ప్రజలకు కట్టుబడి ఉంటుందని వైస్ చైర్మన్ మదర్ సాహెబ్ పేర్కొన్నారు. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు వైస్ చైర్మన్ పదవీని కానుకగా ఇచ్చారని తెలిపారు. అనంతరం మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.