
01/08/2025
కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన 'మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం' హామీ ఈ ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో అమలు కాబోతోంది. ఈ పథకానికి 'స్త్రీశక్తి' అని పేరు పెట్టారు. ఇందు కోసం మహిళలకు జారీ చేసే 'జీరో ఫేర్ టికెట్' పై 'స్త్రీశక్తి' అని ముద్రించి ఉంటుంది. ఛార్జీ ఎంత? ప్రభుత్వ రాయితీ ఎంత అనే వివరాలు కూడా ఉంటాయి.
ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్ లో మార్పులు కూడా చేసారు. జీరో ఫేర్ టికెట్లు జారీ చేయడంపై అన్ని బస్ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి శిక్షణ మొదలైంది.