MYTV siddipet

  • Home
  • MYTV siddipet

MYTV siddipet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MYTV siddipet, News & Media Website, .

15/07/2025

చారిత్రక సిద్దిపేట పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి సందర్భంగా సదర్ బోనం వేడుకలు జరిగాయి.

సిద్దిపేట జిల్లా పూర్వపు దుబ్బాక మండలం ప్రస్తుతం భూంపల్లి అక్బర్ పేట మండలం చిట్టాపూర్ గ్రామంలో మొనగారి శ్రీనివాస్ మృతి ప...
12/07/2025

సిద్దిపేట జిల్లా పూర్వపు దుబ్బాక మండలం ప్రస్తుతం భూంపల్లి అక్బర్ పేట మండలం చిట్టాపూర్ గ్రామంలో మొనగారి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. అతని పార్టీవ దేహానికి గ్రామ తాజా మాజీ సర్పంచు పోతనక రాజయ్య, మరికొందరు గ్రామ పెద్దలతో కలిసి శనివారం ఉదయం నివాళులర్పించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. శ్రీనివాస్ కుమారులు, శ్రావణ్, రాజేష్, రాకేష్ లు (సిద్దిపేటలోని కోటిలింగేశ్వర ఆలయం వద్ద ఉన్న రాఘవేంద్ర నగర్ వీధి నెంబర్ 5లో) మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్నందున వారితో వారి తండ్రి శ్రీనివాస్ అన్న గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఇటీవల శ్రీనివాస్ అన్న స్వంత ఇల్లు. నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం కూడా కంప్లీట్ చేసుకొని అందరు హ్యాపీ గా ఉంటున్నారు. తీరా ఇప్పుడు శ్రీనన్న ఆకస్మిక మరణం అందరిని తీవ్రమైన బాధకు గురిచేసింది.

10/07/2025

గురుపౌర్ణమి విశిష్టత గురించి బ్రహ్మశ్రీ దేశపతి గంగాధర శర్మ మైటీవీ సిద్దిపేటకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ

07/07/2025
.ఆషాడ మాసం తొలి ఏకాదశి సందర్భంగా రైతు బజారుకు తరలి వచ్చినకూరగాయల కొనుగోలు దారులు సిద్దిపేట జులై 6 : (మైటీవీ సిద్దిపేట ఏడ...
06/07/2025

.ఆషాడ మాసం తొలి ఏకాదశి సందర్భంగా
రైతు బజారుకు తరలి వచ్చిన
కూరగాయల కొనుగోలు దారులు

సిద్దిపేట జులై 6 : (మైటీవీ సిద్దిపేట ఏడిటర్ )

ఆషాడం మాసంలో ఆదివారం నాడు తొలి ఏకాదశి రావడంతో కూరగాయల కొనుగోలు దారులు రైతు బజార్ కు పోటెత్తారు. చారిత్రక పట్టణమైన సిద్దిపేటలోని మెదక్ రోడ్ లో ఉన్న రైతు బజార్లో అన్ని రకాల కూరగాయలు ఒకే చోట లభిస్తుండటముతో పట్టణంతోపాటు సమీప గ్రామాల ప్రజలు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. తొలి ఏకాదశి మహిళలకు అత్యంత పవిత్రమైన రోజుగా నమ్ముతూ ఆ రోజున కూరగాయల భోజనాన్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆషాడశుద్ధ ఏకాదశినే సర్వేషేనాం ఏకాదశి అంటారు. శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచే చాతుర్మాస వ్రతము ప్రారంభమవుతుంది. శ్రీ వైష్ణవ భక్తులు, ఆచార్యులు, జియ్యoగార్లు, త్రిదండి స్వాములు చాతుర్మాస దీక్షలో ఉంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో తిరువేంకటనాధుని అలివేలు మంగ పద్మావతి దేవతలను కొలుస్తారు.ఆరాధిస్తారు. పూజిస్తారు. అందులో భాగంగానే భక్తజనులు కూడా ఈ మాసంలో కూరగాయల వంటలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తమ భక్తి ప్రవత్తులను తెలియజెపుతారు.తత్ఫలితంగానే అనేక రకాల కూరగాయలను వారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

చారిత్రక సిద్దిపేట పట్టణంలోని మోహినిపురలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం నాడు పోటెత్తారు. ఆషాడ మాసం శుద్ధ తొలి ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ స్వామిని చేతులెత్తి మోక్కరు. వైకుంఠ ఏకాదశి పర్వదినం మాదిరిగానే ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి భక్తజనులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు దేవాదాయ శాఖ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ప్రకృతిలో వింతలు విశేషాలు ఎన్నో మనకు కనిపిస్తాయి ఈ వర్షాకాలంలో నేలపైన చెట్ల మొదల వద్ద గుట్టలు, పుట్టల వద్ద ఎరువు మడులు ప...
05/07/2025

ప్రకృతిలో వింతలు విశేషాలు ఎన్నో మనకు కనిపిస్తాయి ఈ వర్షాకాలంలో నేలపైన చెట్ల మొదల వద్ద గుట్టలు, పుట్టల వద్ద ఎరువు మడులు పెంటల వద్ద పశువుల పాకల వద్ద రోడ్ల వెంట బావులు, కాలువల సమీపాన పుట్టగొడుగులు మొలుస్తుంటాయి అటువంటి సుందరమైన దృశ్యం మై టీవీ సిద్దిపేట కంటపడింది దాన్ని కెమెరాలో బంధించడం జరిగింది..
https://youtube.com/shorts/LWe9K0XjWwU?si=ZS3ELct1xDYajjyA

టుడే బెస్ట్ ఫోటో: పుట్టగొడుగులు
05/07/2025

టుడే బెస్ట్ ఫోటో: పుట్టగొడుగులు

Address


Alerts

Be the first to know and let us send you an email when MYTV siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share