21/12/2024
ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడింది
ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు
భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది
రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేది
భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి
భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయి, రాష్ట్ర సంపద పెరిగింది
మ్యాన్యువల్ పహాణీల వల్ల రాష్ట్రంలో అనేక వివాదాలు ఏర్పడేవి... ధరణి ఆ సమస్యను తీర్చింది
భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది
దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించింది
గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావు... ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి
తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి అయ్యారు
ధరణికి ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు
భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చాము
ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది... దీని వల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయి
పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే... ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదపవద్దు
మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది
రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి... తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది
రాష్ట్రమంతా ఒకే సారి కాకుండా... దశల వారీగా రీసర్వే చేపట్టాలి
ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాకా... భూధార్ కార్డు ఎందుకు ?
ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి
ఇప్పటికన్నా ప్రభుత్వం నిజాలు చెప్పాలి
ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వ
హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోంది
భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు
భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలి
కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి