Nuzvid voice

Nuzvid voice Follow the page for Voice of Nuzvid people’s and Nuzvid local News updates and Bussiness related i

08/10/2024

సనాతన ధర్మం అనేది సంస్కృత పదం. దీని అర్థం "శాశ్వతమైన విధి" లేదా "శాశ్వతమైన ప్రక్రియ." ఇది సాంప్రదాయకంగా హిందూమతంతో అనుబంధించబడిన ఆధ్యాత్మిక, నైతిక మరియు తాత్విక చట్రాన్ని సూచించే భావన. సనాతన ధర్మం అన్నింటిని ఆవరించే జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది సార్వత్రిక సత్యాలు, విధులు మరియు విలువలను కలిగి ఉంటుంది, ఇది శాశ్వతమైనదిగా పరిగణించబడుతుంది. సమయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తిస్తుంది.

సనాతన ధర్మం యొక్క ముఖ్య భావనలు:
శాశ్వతమైన సూత్రాలు:

సనాతన ధర్మం సత్యం (సత్యం), ధర్మం (ధర్మం), శాంతి (శాంతి), కరుణ (కరుణ), మరియు అహింస (అహింస) వంటి విశ్వవ్యాప్త విలువలను నొక్కి చెబుతుంది. ఈ సూత్రాలు శాశ్వతమైనవిగా పరిగణించబడతమేకా, విశ్వవ్యాప్తంగా నైతిక ప్రవర్తనకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ ధర్మం.

శనాతన ధర్మం లో విధులు:

ధర్మం అనగా కర్తవ్యం , ఇది సనాతన ధర్మానికి ప్రధానమైనది. ఇది వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, సమాజంలో వారి విధులను నెరవేర్చడానికి, ప్రపంచంలోని సామరస్యం మరియు సమతుల్యతకు ఉప్యొగపడుతుంది.

ఆధ్యాత్మిక సాధన మరియు స్వీయ-సాక్షాత్కారం:

సనాతన ధర్మం స్వీయ-సాక్షాత్కారం. దైవంతో మనిషి ఐక్యతను అర్థం చేసుకునే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. ధ్యానం, యోగా, ప్రార్థన మరియు ఆచారాల వంటి అభ్యాసాలు సనాతన ధర్మంలో ఉచ్చ స్తాయికి చేరుకోవటానికి, మనిషి తనలో ప్రశాంతతను పొందటానికి సాధారణ మార్గాలు.

వైవిధ్యానికి గౌరవం:

సనాతన ధర్మం విభిన్నమైన నమ్మకాలను, అభ్యాసాలను స్వీకరించి, వ్యక్తులు వివిధ మార్గాల్లో ఆధ్యాత్మికతను చేరుకోవచ్చని గుర్తించింది. భక్తి (భక్తి), జ్ఞానం (జ్ఞానం) మరియు చర్య (కర్మ) వంటివి సత్యాన్వేషణకు మార్గాలు.

పునర్జన్మ మరియు కర్మ చక్రం:

ఇది పుట్టుక, మరణం మరియు పునర్జన్మ (సంసారం) యొక్క చక్రాలపై నమ్మకాన్ని మరియు కర్మ సిద్దంతాన్ని సమర్థిస్తుంది, ఇక్కడ ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. వ్యక్తులు తమపై మరియు ఇతరులపై వారి చర్యల ప్రభావం గురించి అవగాహనతో వ్యవహరించమని సనాతన ధర్మం చెబుతుంది

ప్రకృతితో సామరస్యం:

సనాతన ధర్మం అన్ని జీవుల పట్ల గౌరవాన్ని బోధిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించాలని నొక్కి చెబుతుంది. ఈ పర్యావరణ అవగాహన పరస్పర అనుసంధాన భావన. సృష్టిలోని అన్ని అంశాలలో దైవం ఉనికిలో ఉందనే నమ్మకాన్ని ప్రభొదిస్తుంది సనాతన ధర్మం

దీనిని "సనాతన" అని ఎందుకు అంటారు:
"సనాతన" అనే పదానికి "శాశ్వతమైనది" లేదా "మార్పు లేనిది" అని అర్ధం, సనాతన ధర్మం యొక్క బోధనలు ఆది,అంతములు లేకుండా శాశ్వతమైనవి అని నమ్ముతారు. అవి చారిత్రక లేదా సాంస్కృతిక మార్పులతో సంబంధం లేకుండా స్థిరంగా ఉండే సహజ క్రమం. ఇవి విశ్వ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి..

సారాంశంలో, సనాతన ధర్మం కేవలం మతపరమైన ఆచారం కాదు; ఇది నైతికంగా జీవించడం, విశ్వంతో మనిషి తన బంధాన్ని అర్థం చేసుకోవడం, అంతిమ సత్యం లేదా జ్ఞానోదయం కోసం దృష్టి సారించిన జీవన విధానమే సనాతన ఢర్మం

08/10/2024

What is Sanathana Dharma ?

Sanatana Dharma is a Sanskrit term meaning "eternal duty" or "eternal order." It is a concept that represents the spiritual, ethical, and philosophical framework traditionally associated with Hinduism. Unlike other terms, which denote religion in a more structured or institutionalized form, Sanatana Dharma reflects an all-encompassing way of life, encompassing universal truths, duties, and values that are considered eternal and applicable to all people, regardless of time and place.

Key Concepts of Sanatana Dharma:
Eternal Principles:

Sanatana Dharma emphasizes universal values like truth (Satya), righteousness (Dharma), peace (Shanti), compassion (Karuna), and non-violence (Ahimsa). These principles are regarded as timeless and apply universally, guiding moral and ethical behavior.
Duties and Dharma:

Dharma, often translated as duty or righteousness, is central to Sanatana Dharma. It encourages individuals to act responsibly, fulfill their duties to society, and contribute to the harmony and balance of the world.
Spiritual Practice and Self-Realization:

Sanatana Dharma promotes a spiritual journey aimed at self-realization and understanding one's unity with the divine. Practices such as meditation, yoga, prayer, and rituals are common paths within Sanatana Dharma for connecting with the higher self and achieving inner peace.
Respect for Diversity:

Sanatana Dharma embraces a diverse range of beliefs and practices, recognizing that individuals may approach spirituality in various ways. This inclusivity allows for multiple paths to truth and understanding, such as devotion (bhakti), knowledge (jnana), and action (karma).
Cycle of Rebirth and Karma:

It upholds the belief in the cycles of birth, death, and rebirth (samsara), and the principle of karma, where every action has a consequence. Individuals are encouraged to act with awareness of the impact of their actions on themselves and others.
Harmony with Nature:

Sanatana Dharma teaches respect for all life forms and emphasizes living in harmony with nature. This ecological awareness aligns with the concept of interconnectedness and the belief that the divine exists in all aspects of creation.
Why It’s Called “Sanatana”:
The term "Sanatana" means "eternal" or "unchanging," signifying that the teachings of Sanatana Dharma are believed to be timeless, without beginning or end. They are understood to be in harmony with the natural order and cosmic laws, which remain constant regardless of historical or cultural changes.

In essence, Sanatana Dharma is not just a religious practice; it is a way of life focused on living ethically, understanding one’s connection with the universe, and seeking the ultimate truth or enlightenment.

22/09/2024

🌟 Join Us in Shaping the Future of Amaravati! 🌟

If you’re passionate about the development of the Amaravati Outer Ring Road and the surrounding areas, we’d love to hear from you! Join our page, share your opinions, and let’s work together to push for progress and development in this region.

Your voice matters—let’s make a difference! 🚧🌍

Feel free to tweak it as needed!

Support the Amaravati Outer Ring Road!
We’ve created this page to share our interest and opinions about the proposed Amaravati Outer Ring Road. Let’s make it happen—follow, share, and spread the word!

31/08/2024
దొంగల పార్టీ దొంగ ప్రచారం
30/11/2023

దొంగల పార్టీ దొంగ ప్రచారం

 #నూజివీడు  #ఎగ్జిబిషన్ వారు  #పాస్  #రిలీజ్ చేశారు 200 Rs only 🥳
02/11/2023

#నూజివీడు #ఎగ్జిబిషన్ వారు #పాస్ #రిలీజ్ చేశారు 200 Rs only 🥳

అయ్యా ఎమ్మెల్యే గారు!చింతలపూడిపోలవరంరాజధానినూజివీడు -విజయవాడ రోడ్డు విస్తరణనూజివీడు లో పారిశ్రామిక వాడనూజివీడు ప్రాంతంలో...
27/10/2023

అయ్యా ఎమ్మెల్యే గారు!
చింతలపూడి
పోలవరం
రాజధాని
నూజివీడు -విజయవాడ రోడ్డు విస్తరణ
నూజివీడు లో పారిశ్రామిక వాడ
నూజివీడు ప్రాంతంలో మామిడి సంరక్షణ
తాగునీటి ఇబ్బంది మూలంగా ప్రజల అనారోగ్యం
కనీసం పాము కాటు కి, కుక్క కాటుకి స్థానిక ఆసుపత్రులలో మందులు లభ్యం కాని పరిస్థితి
అనుమతి లేని రబ్బీసు దోపిడీ
విపరీతం గా పెరిపోయిన నిత్యావసరాలు
రైతు బరోసా కేంద్రాలు ఉన్నా ఆగని దళారుల దోపిడీ
పంచాయితీ నిధుల మళ్ళింపు
చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులలో వేల/లక్షల రూపాయల బిల్లులు
నియోజకవర్గం ఆదాయం, వ్యక్తుల ఆదాయం రూపాయి కూడా పెరగని పరిస్థితి
ఇసుక దోపిడీ
మద్యం దోపిడీ
సహజ వనరుల దోపిడీ
ఆగని ఐఐఐటి విద్యార్దుల ఆత్మ హత్యలు
జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయితీ అవార్డుకి రాష్ట్రం నుంచి ఒక్క పంచాయితీ కూడా ఎంపిక కాని పరిస్థితి
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పధకానికి ఎంపిక చేసిన ఏకైక నియోజకవర్గ గ్రామం తుమ్మగూడెంలో కేవలం 45% పనులు మాత్రమే జరగటం

ఇన్ని నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మీ అసమర్థత, నిష్క్రియాపర్వత్వం, మీరు ఎందుకు ఏ అభివృద్ధి పనీ చేయలేకపోతున్నారో ఒక్కసారైనా విలేకరుల సమావేశం పెట్టి వివరించే సామర్థ్యం ఉందా మీకు
చివరిసారిగా శాసనసభ లో ఏ చర్చలో పాల్గొన్నారు
ఇప్పటివరకు ఎంత మంది మంత్రులను కలిశారు నియోజకవర్గం లో పనులకోసం నిధుల కేటాయింపు కోసం
నియోజకవర్గంలో ఏ సమశ్య గురించి మీరు శాసనసభలో ప్రస్తావించారు
నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక,
మౌళిక సదుపాయాల కల్పన ఇలాంటి వాటి గురించి ఏనాడైనా మీరు మాట్లాడగలరా

ఆకరికి మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా, బిసిలు తమ అభ్యర్థి మీద అభిమానం, అభివృద్ధి మీద అవగాహన ఉండి ఉంటే ఏనాడో మీ రాజకీయ జీవితం సమాప్తమయ్యేది. నియోజకవర్గ ప్రజల అవగాహన లేమి, ప్రత్యర్థుల అనైక్యత మీ పాలిట శ్రీరామ రక్షగా మారి మీరు మూడు సార్లు ఎన్నికయ్యారు కానీ మీలో ప్రజాప్రతినిధి కి కావలసిన ఒక్క సులక్షణమైనా ఉందా సార్!

రికార్డ్ స్థాయిలో నూజివీడు గణనాథని లడ్డు 312116  రూపాయలకి దక్కించుకున్న కాశీ కృష్ణ...నూజివీడు పట్టణానికి చెందిన ప్రముఖ వ...
28/09/2023

రికార్డ్ స్థాయిలో నూజివీడు గణనాథని లడ్డు 312116 రూపాయలకి దక్కించుకున్న కాశీ కృష్ణ...

నూజివీడు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం, శ్రీ హేమ షామిల్ అధినేత కాశీ కృష్ణ దంపతులు ఆర్ఆర్ పేట నందు వేంచేసి ఉన్న విఘ్నేశ్వరుని ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు వేలంపాటలో పాల్గొని రికార్డ్ స్థాయిలో 3 లక్షల 12 వేల 116 రూపాయలకు లడ్డూని సొంతం చేసుకున్నారు..
ఆలయ కమిటీ సభ్యులు తాతినేని దేవేంద్రరావు గారు , మాజీ విఆర్ఓ ప్రభు గారు, పర్వతనేని ప్రసాద్ గారు , గోపి గారు తదితరులు స్వామి వారి లడ్డుని కాశీ కృష్ణ లలిత శ్రీ దంపతులకు అందించారు...
అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలు ఆయురారోగ్యాలతో స్వామివారి కృపతో కాశీ కృష్ణ అన్ని రంగాల విజయం సాధించాలని వేద పండితులు ఆశీర్వాదం

**ప్రాణం కాపాడిన నూజివీడు రూరల్ సిఐ ఆర్ అంకబాబు గారు**నూజివీడు మండలం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు ...
10/05/2023

**ప్రాణం కాపాడిన నూజివీడు రూరల్ సిఐ ఆర్ అంకబాబు గారు**నూజివీడు మండలం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ చివరన ట్రాక్టర్ తోలుతూ ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆపి గ్యాస్ పట్టేయడంతో ఊపిరిఆడక పడి ఉండడం తో అదే సమయంలో అటుగా వెళుతున్న నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యక్తిని ఎక్కించుకొని దగ్గర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ గారి వద్దకు తీసుకుని వెళ్లి ప్రథమ చికిత్స చేయించడంతో ప్రాణాలతో బయటపడిన వెంకటేశ్వరరావు స్పృహ వచ్చిన వెంకటేశ్వరరావు సిఐ గారికి కృతజ్ఞతలు తెలియజేయడమైనది....

50 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన నూజివీడు పట్టణ ఇన్స్పెక్టర్ మూర్తి..నమస్తే ,నూజివీడునూజివీడు పట్...
17/04/2023

50 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన నూజివీడు పట్టణ ఇన్స్పెక్టర్ మూర్తి..

నమస్తే ,నూజివీడు

నూజివీడు పట్టణ ఇన్స్పెక్టర్ మూర్తి రంజాన్ సందర్భంగా తన సొంత ఖర్చులతో సుమారు 50 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.. దీంతో పండుగ ఎలా జరుపుకోవాల అని మనోవేదతో బాధపడుతున్న ఆ కుటుంబాలలో ఆనందం వెళ్లి విరిసింది..పోలీసులో కఠినత్వమే కాదు కారుణ్య హృదయం కూడా ఉందని ఈ సందర్భంగా తెలుస్తుందని సామాజిక వేత్తలు తెలియచేస్తున్నారు

ఏలూరు జిల్లా SPగా మేరీ ప్రశాంతి నియామకం
08/04/2023

ఏలూరు జిల్లా SPగా మేరీ ప్రశాంతి నియామకం

మారిన రాజకీయ వాతావరణంతో విజయవాడ-నూజివీడు-హనుమాన్ జంక్షన్ ల మధ్య భూములకు డిమాండ్. ఈ ప్రాంతంలో భూములు మెట్ట ప్రాంతానికి చె...
04/04/2023

మారిన రాజకీయ వాతావరణంతో విజయవాడ-నూజివీడు-హనుమాన్ జంక్షన్ ల మధ్య భూములకు డిమాండ్. ఈ ప్రాంతంలో భూములు మెట్ట ప్రాంతానికి చెంది నిర్మాణానికి అనుకూలంగా ఉండటం తోటలకు అనుకూలం, విజయవాడ పడమర బైపాస్ కి 10-30 కిలోమీటర్ల దూరంలో ఉండటం నూజివీడు పైగా బందరు/మచిలీపట్నం నుంచి నాగపూర్ కి హైవే ప్రతిపాదనలో ఉండటం, 30% ప్రభుత్వ భూములు ఉండటం, నూతన ప్రారిశ్రామిక వాడలైన మల్లవల్లి, వీరపనేనిగూడెం ఈ ప్రాంతంలోనే ఉందటం, విజయవాడ ఆటో నగర్ ఈ ప్రాంతానికే తరలివచ్చే ప్రతిపాదన ఉండటం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంతర్జాతీయ విమాణాశ్రయం ఇక్కడే ఉండటం లాంటి విషయాలన్నీ ఈ ప్రాంతానికి కలిసివస్తున్నాయి.

ఇది గమనించిన సాప్ట్ వేర్ ఇంజనీర్లు కొందరు జట్ట్లుగా ఏర్పడి ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమి పదుల ఎకరాల్లో కొంటున్నారు. బహుశా వెంచర్ల కోసం అయ్యుంటుంది.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Nuzvid voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nuzvid voice:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share