20/06/2025
*అన్న క్యాంటీన్ సిబ్బంది వృద్ధుడి తో అనుచిత ప్రవర్తన*
#మూడు ఇడ్లీలు వేసుకున్నావ్ గంట తిన్నావ్, బకెట్లు బకెట్లు సాంబార్ వేసుకున్నావ్?? అని
అవమానిస్తున్న అన్న క్యాంటీన్ సిబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలు, సామాన్యుల ఆకలి తీర్చేందుకు కేవలం 5 రూపాయలకే (సబ్సిడీ తో), ఆహారం అందిస్తున్నది,
మూడు పూటలా ఆహారం అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కొన్నిచోట్ల అన్న క్యాంటీన్ సిబ్బంది పేదలను నిరాశ్రయులను చిన్నచూపు చూస్తున్నారు , ఐదు రూపాయలకే పెడుతున్నాం తింటే తిను లేకపోతే పో అంటున్నారు,
ఒకవేళ ఆహార పదార్ధం సరిగా లేకపోయినా, ప్రభుత్వం నిర్దేశించిన అంత ఆహార పదార్థం అందించకపోయినా, ప్రజలు ఎవరైనా అడిగితే? నువ్వు ఐదు రూపాయలు పెట్టిన దానికి మమల్ని ప్రశ్నిస్తావా? ఎవరు అడగలేదు నువ్వు ఒక్కడివే ఎందుకు అడుగుతున్నావ్ ? అంటూ ప్రజలపై చులకన భావంతో, సామాన్యులను అవమానకరంగా చూస్తున్నారు, పైగా సిబ్బంది ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ప్రజలను బెదిరిస్తున్నారు,
విజయవాడ అయోధ్య నగర్ అన్న క్యాంటీన్ లో నేడు సిబ్బంది *ఒక వృద్ధుడిని మూడు ఇడ్లీలు వేయించుకున్నావు గంట నుంచి తింటున్నావు
అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారు, ఈ విధంగా చాలా చోట్ల అన్న క్యాంటీన్ సిబ్బంది, నిరాశ్రయులతో పేదలతో/ సామాన్యులతో, అనుచితంగా ప్రవర్తిస్తూ* అవమాన పరుస్తున్నారు,
*రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అప్రతిష్ట తెచ్చే విధంగా* ప్రవర్తిస్తున్నారు
ఇటువంటి సిబ్బందిపై తగు చర్యలు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాము
వెంకట్ N. జర్నలిస్ట్