05/04/2026
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి ఎస్ నరసింహ గారు, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి గారు, జస్టిస్ అలోక్ ఆరాధే గారు పాల్గొన్నారు.
✳️ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు, జస్టిస్ పి సామ్ కోషి గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి గారు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు, డీజీపీ బి శివధర్ రెడ్డి గారితో పాటు మాజీ న్యాయమూర్తులు, న్యాయకోవిదులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✳️ వంద ఎకరాల్లో నిర్మించబడే జ్యుడీషియల్ సిటీలో భాగంగా హైకోర్టు జోన్-II నూతన భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించడంతో పాటు ఈ సందర్భంగా భవన సముదాయాల నమూనాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
Marking a major step towards strengthening judicial infrastructure in Telangana, Hon'ble Supreme Court Chief Justice Justice Surya Kant laid the foundation stone for the Telangana High Court Zone-II building complex at Rajendranagar in Ranga Reddy district. Hon'ble Chief Minister Sri A. Revanth Reddy, along with Hon'ble Supreme Court Judges Justice P.S. Narasimha, Justice Ujjal Bhuyan, Justice S.V. Bhatti, and Justice Alok Aradhe, participated in the programme.
🔹 The event was attended by Hon'ble Telangana High Court Chief Justice Justice Apares Kumar Singh, Justice P. Sam Koshy, former Chief Justice of India Justice N.V. Ramana, former Supreme Court Judge Justice Subhash Reddy, High Court judges, Chief Secretary K. Ramakrishna Rao, and DGP B. Shivadhar Reddy, along with former judges, legal luminaries, and senior officials.
🔹 As part of the 100-acre ‘Judicial City’ project, the Bhoomi Puja for the new High Court Zone-II buildings was performed. The dignitaries also viewed an exhibition showcasing the architectural models of the proposed building complex.