
07/09/2024
*మాసాపేటలో వినాయక విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*
*రాయచోటి, సెప్టెంబర్ 7:-*
వినాయక చవితి పండుగ సందర్భంగా రాయచోటి పట్టణంలోని మాసాపేట మూడవ వీధిలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని శనివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులకు మాసాపేట గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రివర్యులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రివర్యులను కలిసేందుకు మాసాపేట ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు వచ్చారు.