Singapore Telugu TV

  • Home
  • Singapore Telugu TV

Singapore Telugu TV A Telugu Channel in Singapore, highlights: Telugu events, people and telugu culture in Singapore

*** స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలు ***స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ...
30/04/2025

*** స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలు ***
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2025 ఏప్రిల్ 26 శనివారం నాడు 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు విచ్చేసి సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకం అని చెప్పారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను మెచ్చుకొన్నారు సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ శ్రీ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్ గారు , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్ లర్ గారిని సన్మానించారు.

స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలం లో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.

పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు.

ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి  శుభాకాంక్షలు | Wish you all a very happy & prosperous Sriramanavami 🙏
06/04/2025

సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు | Wish you all a very happy & prosperous Sriramanavami 🙏

సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు | Wish you all a very happy & prosperous UGADI (Telugu New Year) 🙏
30/03/2025

సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు | Wish you all a very happy & prosperous UGADI (Telugu New Year) 🙏

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ ఆధ్వర్యంలోవిశ్వావసు ఉగాది వేడుకలు
20/03/2025

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ ఆధ్వర్యంలో
విశ్వావసు ఉగాది వేడుకలు

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ ఆధ్వర్యంలో

విశ్వావసు ఉగాది వేడుకలు

తేదీ: 29 మార్చి 2025, శనివారం
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు (సింగపూర్ కాలమానం)
వేదిక: GIIS MPH Auditorium Punggol, Singapore, 828649

ప్రవేశం ఉచితం
కార్యక్రమానికి హాజరు కావడానికి ఈ క్రింది లింకు ద్వారా నమోదు చేసుకోగలరు.
http://bit.ly/41EKH4M

ఈ కార్యక్రమానికి మీ సహకారాన్ని కోరుతూ స్పాన్సర్లను ఆహ్వానిస్తున్నాము.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
రత్న కుమార్ కవుటూరు: 91735360
చామిరాజు రామాంజనేయులు: 97683814
రాంబాబు పాతూరి: 91732114

Kakatiya Cultural Association Singapore - Sri Seetarama Kalyana Mahotsavam 2025
07/03/2025

Kakatiya Cultural Association Singapore - Sri Seetarama Kalyana Mahotsavam 2025

🌺 శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 🌺

కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సింగపూర్లో అత్యంత వైభవంగా
శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

📅 తేదీ: ఏప్రిల్ 6వ తేదీ, ఆదివారం
⏰ సమయం: సాయంత్రం 5 గంటల నుండి
🎟️ ప్రవేశం: ఉచితం
🍱 ప్రసాద విందు: కళ్యాణం అనంతరం భోజనం ఏర్పాటు చేయబడుతుంది.

✨ విశేషం:
భద్రాచలంలో నుండి పవిత్ర అక్షింతలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది.

🙏 మీ కుటుంబ సభ్యులతో వచ్చి, ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని,
శ్రీరామ కృపను పొందగలరు.

గమనిక:
ఈ కళ్యాణంలో భాగస్వాములు కావాలనుకుంటే, నమోదుకు సంబంధించిన వివరాలు త్వరలో అందించబడతాయి.

💐 మీ ఆశీస్సులతో,
కాకతీయ కల్చరల్ అసోసియేషన్, సింగపూర్.

Talangana Cultural Society Singapore - UGADI 2025
07/03/2025

Talangana Cultural Society Singapore - UGADI 2025

🍯🥭🧂అందరికీ ముందస్తు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🌿🌶🍋

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పూజ మరియు పంచాంగ శ్రవణం🙏

🛕Venue: Sri Siva Durga Temple, 8 Potong Pasir Ave 2, Singapore 358362
🗓 Date: 30 Mar 2025, ఆదివారం; 6PM to 9PM

🖇 👉 రిజిస్ట్రేషన్ లింకు: https://bit.ly/TCSSUgadi2025

🧑‍🧑‍🧒‍🧒 కుటుంబ సమేతంగా పాల్గొని ఈ నూతన సంవత్సర పండుగ వేడుకను విజయవంతం చేయగలరు.

ఇట్లు,
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)

23/02/2025

GRAND FINALE WINNER | TELUGU TORANAM - Neeti Padyala Potee

తెలుగు తోరణం - నీతి పద్యాల పోటీ - ఆఖరి భాగం | TELUGU TORANAM - Neeti Padyala Potee - FINALE EPISODE
Watch it:
https://www.youtube.com/watch?v=qypQRkwKElM

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ ఆధ్వర్యంలోగానకళానిధి, కలైమామణి, సప్తగిరి సంగీత విద్వన్మణిడా. తాడేపల్లి లోకనాథశర్మ గా...
21/02/2025

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ ఆధ్వర్యంలో

గానకళానిధి, కలైమామణి, సప్తగిరి సంగీత విద్వన్మణి
డా. తాడేపల్లి లోకనాథశర్మ గారిచే
శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

తేదీ: 21/02/2025 శుక్రవారం
సమయం: 6:30pm SGT
వేదిక: మల్టీ పర్పస్ హాల్, 760N, వాటర్ ఫ్రంట్ వేవ్స్ కాండో, బెడోక్ రిజర్వాయర్ రోడ్, సింగపూర్ 479245.

Registration link to register Event: http://bit.ly/4hZsrJX

Dr Tadepalli Lokanatha Sarma.. M. Mus, Ph.D, is a renowned Guru of Classical music & recipient of prestigious awards like 'Ganakalanidhi' 'Kalaimamani' etc. This is a beautiful chance for the Telugu residents of Singapore to meet him in person and to listen to his expert lecture about Classical music. We welcome all, who is interested to know about classical music in deep to kindly attend this special event and avail the rare opportunity.

Multi Purpose Hall has limited seating capacity (max of 50), hence requesting you to register for logistics arrangements, thank you!!

TCSS మహాశివరాత్రి శివాలయాల సందర్శన యాత్ర  - 2025
09/02/2025

TCSS మహాశివరాత్రి శివాలయాల సందర్శన యాత్ర - 2025

🚌TCSS మహాశివరాత్రి శివాలయాల సందర్శన యాత్ర - 2025

🕉️ఓం నమః శివాయ🕉️
ప్రియమైన అందరికీ,
మహా శివరాత్రి శుభాకాంక్షలతో,

మహాశివరాత్రి సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దేవాలయాల సందర్శన యాత్రను ఈ సంవత్సరం కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని…

TCSS ప్రత్యేక బస్సుల్లో 26 ఫిబ్రవరి రాత్రి 9గంII నుండి 27 ఉదయం 6గంII వరకు సింగపూర్ లో ఉన్న 10 నుండి 12 శివాలయాల దర్శనంకు ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

కావున ఈ దైవ దర్శన యాత్ర లో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందగలరు.

📝రిజిస్ట్రేషన్ లింక్‌: https://bit.ly/TCSSMahashivbus2025

ఇట్లు,
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)

Address


Alerts

Be the first to know and let us send you an email when Singapore Telugu TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Singapore Telugu TV:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share