Telugu Books and Blogs

  • Home
  • Telugu Books and Blogs

Telugu Books and Blogs Knowledge is divine.. Let us share it and discuss it here, preferably on Telugu books and blogs.

*1947 నుండి 2012 వరకు మొత్తం అన్ని చందమామ సంచికలు ఈ క్రింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*
28/07/2019

*1947 నుండి 2012 వరకు మొత్తం అన్ని చందమామ సంచికలు ఈ క్రింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*

చందమామ,CHANDAMAMA,kadhalu,kathalu,కథలు,భేతాళకథలు,Vikram Bethala Kathalu,Telugu stories , Telugu Magazine

https://m.facebook.com/story.php?story_fbid=1085428344948298&id=171781376313004
14/08/2018

https://m.facebook.com/story.php?story_fbid=1085428344948298&id=171781376313004

గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు [4]. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని (conceal) లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం.. తుని దాటిందగ్గర్నుంచి పచ్చకార్పెట్ కప్పినట్టున్న పొలాల మధ్యలోంచి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట లాంటి స్టేషన్లు దాటుకుంటా 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి స్టేషనొస్తుంది..

"అప్పుడే రాజమండ్రి వొచ్చేశామా " అంటారెవరో అటుపక్క సీట్లో కూర్చున్న పెద్దాయన.. "ఆ.. అవునండీ" అని సమాధానమిస్తాడు పూతరేకులు అమ్ముకోడానికి వచ్చిన బక్కపలచని కుర్రాడు..

అప్పుడు మొదలవ్వుద్ది అందరిలో ఒకలాంటి హడావిడి..

అయిదు నిముషాలాగి తిరిగి ట్రైన్ స్టార్ట్అవ్వగానే..

రిజర్వేషన్ దొరక్క గుమ్మం దగ్గర మెట్ల దగ్గర కూర్చునోళ్లు ఎందుకైనా మంచిదని లోపలికొచ్చేస్తారు..
కుర్రోల్లాంటోళ్లు వాళ్ళు చేసుకుంటున్న చాటింగులాపేసి మెల్లగా గుమ్మం దగ్గర జేరతారు.. పెద్దోళ్ళులాంటోళ్ళు వాళ్ళ వెనకాల నిలబడతారు..
అప్పటిదాకా ఒక సౌండుతో ఊగుతూ వచ్చిన రైలు అప్పట్నుంచి మరో సౌండుతో దడదడలాడుతూ లోపల కూర్చునోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది..

ట్రైనంతా నిశ్శబ్దమైపోద్ది..

అన్ని తలలు కిటికీలవైపు తిరుగుతాయి...

సీట్లో కూర్చున్న లేడీస్ నిద్రపోతున్న పిల్లల్ని లేపి మరీ కిటికీలోంచి చూపిస్తారు. అదే.. ..

"అదిగో చూడు.. గోదావరి.. గోదావరి.. బ్రిడ్జదిగో.. ఎంత పెద్దదో చూడు.. ఇదిగో, విండోలోంచి డబ్బులెయ్యి.." అని కనుచూపు మేరంతా నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని కంపార్ట్మెంట్ కిటికీలోంచే సర్దుకుని చూపిస్తూ తనివితీరా మురిసిపోతారు...

ట్రైను బ్రిడ్జి మీద నడిచిన ఆ అయిదు నిముషాలు గుమ్మం దగ్గర నిల్చునోళ్లల్లో రకరకాల ఆలోచనలు..

కోట్లాదిమంది కడుపు నింపుతున్న గోదావరి మాతని కళ్లారా ఆస్వాదించి, కడుపు నిండా గోదారి గాలి పీల్చి, వీలైనన్ని సెల్ఫీలు తీస్కుని, ఘనంగా వెనక్కొచ్చి సీట్లలో కూర్చుని, కుర్రోళ్ళు డీపీలు మార్చుకున్నాక తృప్తిగా డిన్నర్ పార్సెల్ విప్పుతారు... @గోదావరి రివర్ అని...

ఆల్మోస్ట్ రాజమండ్రికి ట్రైన్లో వచ్చే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది.. ఫ్లయిట్లో వచ్చినా, ట్రైనెక్కి వచ్చినా, బస్సెక్కి వచ్చినా గోదావరినదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండటం కష్టం.. ఆ పచ్చదనం చూసినోళ్లు "గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా" అని కుళ్ళుకుంటారు.. చరిత్ర తెల్సినోళ్లు మాత్రం మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు.. ఇవేమి తెలీని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారు..

అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడి పుట్టినరోజు ఈరోజు.. ఆయనే సర్ ఆర్ధర్ కాటన్ గారు..

ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొస్తే ఆకలిచావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణనష్టం మిగులుస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట.. ఎందుకంటే, ఎక్కడో నాసిక్లో పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1600 కిమీ పాటు ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్రగోదావరిగా రూపాంతరం చెంది, అదే స్పీడ్తో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ వృధాజలాలు ఉపయోగపడేవి కావంట..

అలాంటి ప్రాంతానికి, విధినిర్వహణలో భాగంగా ఇంగ్లాండునించి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారుచేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు..

"ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం" అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు..

ఎన్నోసార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడుజేసుకుని మరీ నిర్మించి "నా పేరు జెప్పుకోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్" అని అక్షయపాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు.. ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాం..

ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా మా గోదారి సైడొస్తే ఈయన గురించి చెప్తూ "కాటన్ దొరగారు" అంటాం తప్పించి "కాటన్" అని ఏకవచనం కూడా వాడమండీ.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం..

కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం.. ఆయన పేరుకు ముందు ఉండాల్సిన "అపరభగీరధుడు" అన్న బిరుదు.. అయితే దీని గురించే నాదొక కంప్లైంట్ ఉంది..

పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి గంగమ్మ తల్లిని భూమ్మీదకి రప్పించిన భగీరధుడుతో పోల్చడం కంటే, తన జటాజూటాల్లో బంధించి పవిత్ర గంగాజలాలు ఎటు పడితే అటు ప్రవహించకుండా సరైన తీరులో కిందకి వొదిలిపెట్టి భూమాతకి, గంగామాతకి కూడా ఉపశమనం కలిగించిన పరమశివుడితో పోల్చడం కరెక్టని నా అభిప్రాయం..

అఖండ గోదావరి మాతకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి, విశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పుగోదావరికొకటి, పశ్చిమగోదావరికోటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి, పచ్చని భూములతో పాటు సిరిసంపదల పుట్టుకకు కారణమైనోడు దేవుడు కాక ఇంకేమవుతాడు?? 🙏🙏

ఏదైనా పని పూర్తి చెయ్యడానికి "మీ బాధ్యతంటే మీ బాధ్యతని" దెబ్బలాడుకుంటున్న మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలకంటే.. రెండొందల ఏళ్ళ ముందే మనతో ఏం సంబంధం లేకపోయినా వృధాగా పోతున్న గోదావరిని డెల్టాలుగా, తెలుగు రాష్ట్రాలకి ధాన్యాగారాలుగా మార్చి, ఎన్నో కడుపులు నిండటానికి కారణమైన దేవుడిని పరమశివుడితో పోల్చడంలో తప్పేంలేదని నా అభిప్రాయం.. 🙏🙏🙏

కాటన్ దొరగారికి నమస్సులు మరియు జన్మదిన శుభాకాంక్షలు..
Copy pasted post... Pranams to the orizinal author for this post...

Happy Deepawali to all... దీపావళి శుభాకాంక్షలు
19/10/2017

Happy Deepawali to all... దీపావళి శుభాకాంక్షలు

మ' అనే పేరిట తమను గోప్యంగా ఉంచుకొన్న మహేంద్రనాథ్‌ గుప్త భగవాన్‌ శ్రీరామకృష్ణుల శిష్యుడు. జీవితంలో పలు ఎదురుదెబ్బలు తిన్న...
29/07/2015

మ' అనే పేరిట తమను గోప్యంగా ఉంచుకొన్న మహేంద్రనాథ్‌ గుప్త భగవాన్‌ శ్రీరామకృష్ణుల శిష్యుడు. జీవితంలో పలు ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి తెగించిన స్థితిలో 'మ'కు శ్రీరామకృష్ణులను దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆ సందర్శనం 'మ' జీవన గమనాన్నే మార్చివేసింది. అధోగతి అంచులకు వెళుతున్న తన జీవితాన్ని ఔన్నత్యం కేసి - ఆధ్యాత్మిక ఔన్నత్యం కేసి - మళ్ళించిన ఆ దివ్� ��పురుషుణ్ణి పదేపదే దర్శించాడు 'మ'. దర్శించుకోవడంతోనే ఆగిపోలేదు; ప్రతిరోజు కార్యక్రమాలను దినచర్య పుస్తకం (డైరీ)లో రాసి పదిలపరచారు. ఈ డైరీ నోట్స్‌ వివరణే ఈనాటి మతచరిత్రలో ఒక మైలురాయి గానూ, దుఃఖంలో మునిగివున్న అసంఖ్యాక హృదయాలలో ప్రశాంత అమృత ధారలను వర్షించే ఆనంద మేఘంగానూ, గృహస్థ జీవిత ఆదర్శాన్ని మన ముందు ఉంచి, దానిని చేరుకోవడానికి దారి చూపే మార్గదర్శిగానూ; సన్యాస జీవి�� � అసలైన ఆధారసూత్రాలను వివరించి, మార్గం చూపే ఉన్నతమైన గురువుగానూ భాసిస్తున్న శ్రీరామకృష్ణ కథామృతం.

శ్రీ రామకృష్ణుల సంభాషణల సంకలనాన్ని 'శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత' అనే పేరుతో ఐదు సంపుటాలుగా వంగ భాషలో 'మ' ప్రచురించారు. దీని తెలుగు అనువాదం మొదటి సంపుటం 1976లో ప్రప్రథమంగా వెలువడింది. తదుపరి సంపుటాలు క్రమంగా, కాస్త జాప్యంతోనే వెలువడ్డాయి. ఐదవ సంపుటం 1985లో వెలువడింది.

గతంలోని ఐదు సంపుటాల స్థానే చెన్నై మఠం వారు మూడు సంపుటాలుగా వెలువరించారు. ప్రస్తుతం పాఠకులకు మరింత అనువుగా ఉండడానికి మూడు సంపుటాల స్థానే రెండు సంపుటాలుగా (పెద్ద పరిమాణంలో) ప్రచురిస్తున్నాం. బెంగాలీ గ్రంథంలో 'మ' ఉదహరించిన భగవద్గీతా శ్లోకాలనూ, పాఠకుల స్పష్టతను పెంపొందింపజేసే విధంగా 'పరిచ్ఛేదం' పేరుతో విభాగాలనూ చేర్చాం. లభ్యమైనంత వరకూ ఛాయాచిత్రాలను సముచిత స్థానంలో �� �ిలకించడానికి వీలుగా పొందుపరిచాం. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు పరిశోధకులు 'మ' దినచర్య పుస్తకంలోని నాలుగు ఆరోపాలు (entries) (25 ఆగష్ట్‌ 1886, 2 సెప్టెంబర్‌ 1886, 12 అక్టోబర్‌ 1886, 17 ఫిబ్రవరి 1887) నవ్యభారత్‌ అనే మాసపత్రికలో 1904లో ప్రచురితమైనట్లు కనుగొన్నారు. ఈ నాలుగు ఆరోపాలను మూడవ అనుబంధంగానూ, గ్రంథకర్తయైన 'మ' జీవిత చరిత్ర నాల్గవ అనుబంధంగానూ రెండవ సంపుటంలో పొందుపరిచాం.

- ప్రకాశకులు

To read more click on the link http://kinige.com/book/SriRamakrishna+Kathamritam

SriRamakrishna Kathamritam By Mahendranath Guptaఇది “శ్రీరామకృష్ణ కథామృతం” రెండు సంపుటాలు కలిసిన ఈ-బుక్. * * * 'మ' అనే పేరిట తమను గోప్యంగా ఉంచుకొన్న మహేంద్రనాథ్‌ గుప్త భగవాన్‌ శ్రీరామకృష్ణుల శిష్యుడు. జీవితంలో పలు ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి తెగించిన స్థితిలో 'మ'కు శ్రీరామకృష్ణ…

Interesting Review on PK...http://kothakeratam.blogspot.in/2014/12/movie-in-my-view-pk.htmlఓ గ్రహంతరవాసి భూమిని చూడ్డాని...
25/12/2014

Interesting Review on PK...

http://kothakeratam.blogspot.in/2014/12/movie-in-my-view-pk.html

ఓ గ్రహంతరవాసి భూమిని చూడ్డానికి వచ్చి.. అనుకొని పరిస్దితుల్లొ భూమ్మీద చిక్కుకుంటాడు. తిరిగి తన గ్రహనికి వెళ్ళిపొవాలని చేసే ప్రయత్నాల్లొ అతనికి ఎదురైన సమస్యలు చుట్టూ ’పికే’ సిన్మా నడుస్తుంది. భూమ్మీద అతనికి ఎదురైన రకరకాల మనుషులు, వారి వేషధారణ మొదులుకొని వాళ్ళు పాటించే మతవిశ్వాసాలు, నమ్మకాల వరకు అన్నీ ఆ గ్రహంతరవాసిని కన్ ప్యూజన్ లొ పడేస్తుంటాయి. అమాయకంగా అతనడిగే ప్రశ్నలు అందర్నీ నవ్విస్తునే...ఆలొచనల్లొ పడేస్తాయి. మూడనమ్మకాలమీద, దొంగబాబాలమీద సెటైర్లు వేస్తూ...ఓ సొషల్ మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సిన్మా తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఆ క్రమంలొ కొన్ని కొన్ని అనవసరమైన డైలాగ్స్ ద్వారా...ఆ మతాన్ని పాటించేవారి నమ్మకాల్ని ప్రశ్నించడం సరిగా లేదు...(Read more in blog)...

05/11/2014

PDF files ఎలా Upload చేయాలొ తెలియడం లేదు..దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి...Please..

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు...పుస్తకాల్ని ప్రేమించని వారంటూ ప్రపంచంలొ ఎవరూ ఉండరు. అందులొనూ దేశబాషలందు తెలుగు లెస్స...
24/10/2014

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు...
పుస్తకాల్ని ప్రేమించని వారంటూ ప్రపంచంలొ ఎవరూ ఉండరు. అందులొనూ దేశబాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకునే తెలుగువారు గురించి అసలు చెప్పనవసరమే లేదు...తెలుగువారు ప్రపంచంలొ ఎక్కడున్నా...తెలుగుపుస్తకాల్ని చూస్తే...అమ్మప్రేమలొ కమ్మదనాన్ని గుర్తు తెచ్చుకొంటారని.... ఈ గ్రూప్ ని ప్రారంబించడం జరిగింది.
ఇక్కడ మనకు నచ్చినా, మనం మెచ్చిన తెలుగుపుస్తకాల గురించి చర్చిద్దాము. వీలైతే వాటి లింక్స్ ఇక్కడ షేర్ చేసుకుందాము.
knowledge is divine అన్నారు పెద్దలు. మనకు తెల్సిన విషయాల్ని నలుగురుతొ పంచుకొవడం వలన జ్నానాన్ని అందించనవారిమే కాకుండా, కొత్త కొత్త విషయాల్ని తెల్సుకున్నవాళ్ళమౌతాము.

కృతజ్నతలతొ...
మీ అడ్మిన్.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Books and Blogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Books and Blogs:

  • Want your business to be the top-listed Media Company?

Share