09/07/2025
వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు..!!
అమెరికాలోని న్యూ మెక్సికోలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి ఓ ఇల్లు కొట్టుకుపోతున్న వీడియో వైరల్ అవుతోంది. వరదకు ముందు ఆ నది చాలా చిన్నగా ఉండేదని, ఇప్పుడు భీకరంగా ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 35 రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. అటు టెక్సాస్ రాష్ట్రంలో వరదలకు ఇప్పటివరకు 109 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి.