14/06/2025
300 కోట్ల రూపాయల స్కామ్ కి కారకులైన ప్రస్తుత చిత్రపురి కమిటీని తక్షణం రద్దు చేయాలని, చిత్రపురి అవినీతి పరులకు అండగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావును సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, న్యాయం చేస్తానని చెప్పి మోసం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, 45 అంతస్తులలో 4,400 చదరపు అడుగుల ఇల్లు కట్టి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవాలని చూస్తున్న వల్లభనేని అనిల్ కుమార్ ని అదుపులోకి తీసుకోవాలని… గౌరవ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయని కో ఆపరేటివ్ కమిషనర్ ని, రంగారెడ్డి జిల్లా డీసీవో సుధాకర్ లను సస్పెండ్ చేయాలని కోరుతూ సినిమా కార్మికులు శనివారం నాడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా లో సీఐటీయూ నాయకులు ఈశ్వర్, సంకూరి రవీందర్, రాజు, లలిత, ఆమ్ ఆద్మీ నాయకురాలు హేమ, నవోదయం పార్టీ అధ్యక్షులు శంకర్ పటేల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు మోహన్ గౌడ్, చిత్రపురి సాధన సమితి నాయకులు కస్తూరి శ్రీనివాస్, తెలంగాణ మేధావుల నాయకులు భద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు