JCR YUVA SENA

  • Home
  • JCR YUVA SENA
Website

JCR YUVA SENA వెబ్ సైట్ ను సందర్శించండి. https://www.newsads.org

Subscribe Channel
https://www.youtube.com/

Janga Chandra Reddy

https://www.newsads.org
Vist Website ::

తొలగించే హక్కు కల్పించండి.
11/03/2026

తొలగించే హక్కు కల్పించండి.

ప్రజల బహిరంగ డిమాండ్.
21/02/2026

ప్రజల బహిరంగ డిమాండ్.



రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది.
20/02/2026

రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది.

???????
20/02/2026

???????

1. MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేస్తే ప్రజలు గెలుస్తారు!ప్రజలారా..! ఒక్కసారి *మీ నిరసనను* ఓటు రూపంలో మీ శక్...
19/02/2026

1. MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేస్తే ప్రజలు గెలుస్తారు!

ప్రజలారా..! ఒక్కసారి *మీ నిరసనను* ఓటు రూపంలో మీ శక్తిని, ధైర్యాన్ని చూపించండి. ఈవిధంగా చేస్తేనే.. ఇకమీదట రాజకీయపార్టీలు ఆచరణకు సాధ్యం కాని, అమలుకు నోచుకోనటువంటి అడ్డగోలుగా హామీలు ఇవ్వరు.

ప్రజలారా..! మీరు ఓడిపోతారా? గెలుస్తారా? అనేది మీ చేతుల్లోనే ఉంది.

2. ప్రజలారా..! మీ ఓటు ను స్వతంత్ర్య అభ్యర్థులకు వేస్తే స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారు.

3. ప్రజలారా..! మీ ఓటు ను రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేస్తే రాజకీయ నాయకులు గెలుస్తారు.
























MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం.
18/02/2026

MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం.
























చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు ::దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్...
03/01/2026

చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు ::

దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును.

1. రైతులకు తగినన్ని *బియ్యం మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ సన్న & దొడ్డు బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

2. రైతులకు తగినన్ని *కూరగాయల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ కూరగాయలు,ఆకుకూరలు మొ//వి నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

3. రైతులకు తగినన్ని *పూల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పూలను (పువ్వులు) నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

4. రైతులకు తగినన్ని *పండ్ల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పండ్లను,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

5. రైతులకు తగినన్ని *మక్క మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ మక్క కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

6. రైతులకు తగినన్ని *పల్లి మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పల్లి కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

7. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడీలకు మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీ పాయింట్స్,క్యాటెరింగ్ & ప్రజలందరికి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవచ్చు.

8. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునేవిధంగా, ఇతరులు ఎవ్వరూ అమ్మకుండా చట్టం చెయ్యవచ్చును.

9. రైతు కమిటీలు వేసి, మార్కెట్లు అన్నింటినీ రైతులకే అప్పజెప్పవచ్చును. ధరల నిర్ణయం,స్థిరీకరణ,నియంత్రణ మొ//వి పూర్తి అధికారాలు రైతు కమిటీలకే ఇవ్వవచ్చును.

పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు (గ్రామానికి ఒకటి, పట్టణాల్లో,నగరాల్లో వార్డుకు,డివిజన్ కు ఒకటి లేదా ప్రతీ 5,000 జనాభాకి ఒకటి) నిర్మించుకోవచ్చును. ఈ విధంగా చెయ్యడం వలన రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.

మార్కెట్లకు సమయం విధించవచ్చు.
ప్రతీ రోజు సాయంత్రం 6:00 నుండి రాత్రి 12:00 వరకు తెరిచి ఉంచొచ్చు.
రాత్రి 12:00 నుండి ఉదయం 6:00 వరకు రైతులు విశ్రాంతి (నిద్ర) తీసుకోవచ్చును.
ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు రైతులు తమ శేనుల్లో పనులు చేసుకోవచ్చును.

పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే *వరి* పండించడం తగ్గించి అన్నిరకాల పంటల్ని రైతులు పండించే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రం లో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే తెలంగాణ ప్రజలందరికి సరిపోతుంది! అవసరానికి మించి అధికంగా పండిస్తే మంచి ధర లభించదు.

రైతులు ... *ప్రజల కోసం* వ్యవసాయం చేస్తారు.
అంతేగాని,
అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల కోసం,
హోల్ సేల్ వ్యాపారుల కోసం,
రిటైల్ వ్యాపారుల కోసం,
వీధి వ్యాపారుల కోసం,
చిల్లర వర్తకుల కోసం,
గల్లీ వ్యాపారుల కోసం
మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు.

కానీ,
రైతులకు తగినన్ని మార్కెట్లు లేక, ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన, రైతులు తాము కష్టపడి పండించిన పంటలను వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు.
------
ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యట్లేదు. ఇకమీదట చెయ్యరు కూడా!.

-----
రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.

119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత)

*జై కిసాన్*

Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043

పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*. ఎన్నికల్లో ఓట్లు వ...
02/01/2026

పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*.

ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులకు (నాయకులకు) నివాసానికి క్వార్టర్లు (బిల్డింగ్లు), క్యాంప్ ఆఫీసులు, లగ్జరీకార్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు హెలీకాప్టర్లలో ప్రయాణం, పెన్షన్లు, ఎకరాలకొద్దీ భూములు, కోట్ల సంపాదన, పదవి,హోదా,ఆస్థి,అంతస్తులు,సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు.

ఓట్లు వేసినటువంటి ప్రజలకు (ఓటర్లకు) చాలామందికి స్వంత ఇండ్లు లేవు. అప్పులున్నాయి.అభివ్రుద్ధి చెందడంలేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం.

జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు,రైతు కుటుంబాలు,రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడంలేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం అభివ్రుద్ధి చెందుతున్నారు.

*రైతులు అభివ్రుద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు* ::

1. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేకపోవడం. ఉన్నటువంటి కొద్దిపాటిమార్కెట్లు వ్యాపారులకు కేటాయించడం వలన.

2. రైతుల కష్టం మొత్తం దళారుల, వ్యాపారుల పాలు అవుతున్నది. కష్టం రైతులది. లాభాలు మాత్రం దళారులకు,వ్యాపారులకు.

3. రైతులు తాము పండించిన పంటల ధరల్ని తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు, మరికొన్ని పంటలకు అడ్తిలో వ్యాపారులు నిర్ణయిస్తున్నారు.

పై కారణాల వలన

1. ఒక ఎకరంలో *మిర్చి* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.

2. ఒక ఎకరంలో *తమాట* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.

3. ఒక ఎకరంలో *సోరకాయ* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 2-3 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.

4. ఒకప్పుడు *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి రూ// 10,000 ఉన్నప్పుడు, వడ్ల ధర క్వింటాలుకు సుమారు రూ// 1,000 ఉండేది! ప్రస్తుతం *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి లక్షల్లో (2-4 లక్షలు) ఉంది. క్వింటాలు వడ్ల ధర మాత్రం రూ// 3,000 దాటలేదు.

5. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడి సెంటర్స్ మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీపాయింట్స్,క్యాటెరింగ్ మొ//వాటన్నింటికి నేరుగా రైతుల వద్ద నుండే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా అయినప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారుల నుండి సరఫరా అయినన్ని రోజులు రైతులు అభివ్రుద్ధి చెందరు. రైతులకు మంచి లాభాలు రావు.

6. రైతుభరోసా (గతంలో రైతు బంధు) ఎకరానికి సంవత్సరానికి మొదట 8 వేలు ఇచ్చారు. ప్రస్తుతం 12,000 వేలు ఇస్తున్నారు.
ఈ పథకంతో పాటు రైతుభీమా మరియు రాయితీలు లాంటివి రైతులకు ఇస్తున్నప్పటికి రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందదం లేదు.

దళారీ వ్యవస్థ నిర్మూలన (నాశనం) అయినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. రైతులు *రాజు* అవుతారు.

ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. మార్కెట్లు అనేవి రైతుల కోసం నిర్మించాలి. కానీ, మన పాలకులు (నాయకులు) మాత్రం వ్యాపారులకు కేటాయిస్తారు.
-----
*రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే*,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.

ఓట్లు అయితే ఎలాగూ వేస్తాము. ఆ వేసే ఓటు మన రైతులకు వేద్దాం.

119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను.
70% మంది రైతులు,రైతుకుటుంబాలు,రైతు కూలీల నుండి,
30% మంది విద్యార్థులు, యువత నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెడతాను.

గమనిక : రైతులు అంటే చిన్న,సన్నకారు రైతులు. (అడ్డగోలుగా భూములు ఉన్న రైతులు కాదు)

*జై కిసాన్*

Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043

ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
31/12/2025

ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

తెలంగాణలోని 119 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేనే నిలబెడతాను.(భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ...
28/12/2025

తెలంగాణలోని 119 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేనే నిలబెడతాను.(భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో)

70% మంది రైతుల్ని, 30% మంది విద్యార్థులు,యువత ను MLA,MP లుగా గెలిపించాలని మేనిఫెస్టో వ్రాశాను.

ఉచిత ప్రచారం కోసం 34 వెబ్ సైట్లు. 15-20 వేల పేజీలు (10 లక్షల Keywords). ప్రతీ గ్రామానికి,ప్రతీ వార్డుకు,ప్రతీ డివిజన్ కు ప్రత్యేక పేజీలు.

కుల రాజకీయాలకు భవిష్యత్ లేదు!ప్రజలకు భవిష్యత్ లో *కుల రాజకీయాలతో, కుల సంఘాలతో, కుల సంఘాల నాయకులతో* అవసరం ఉండకపోవచ్చు!భవి...
24/12/2025

కుల రాజకీయాలకు భవిష్యత్ లేదు!

ప్రజలకు భవిష్యత్ లో *కుల రాజకీయాలతో, కుల సంఘాలతో, కుల సంఘాల నాయకులతో* అవసరం ఉండకపోవచ్చు!

భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 70% మంది రైతులు, 30% మంది విధ్యార్థులు, యువత MLA, MP లుగా గెలవాలనే ఉద్దేశ్యంతో నేను వ్రాసినటువంటి *మేనిఫెస్టో* పుస్తకం 26-01-2026 రోజున ఆన్ లైన్, సోషల్ మీడియాలో ఉచితంగా విడుదల.

*ఈ పుస్తకంలో పుర్తిగా వివరంగా వ్రాశాను*.

--------
*జై కిసాన్*
Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org (News Ads)
--------

Address


Alerts

Be the first to know and let us send you an email when JCR YUVA SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed media company?

Share