09/09/2025
“సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ కోసం అనంతపురం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న జనసేన నేత సుంకర శ్రీనివాస్ గారు.
రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం, సుసంపన్నతకు ప్రతీకగా నిలుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరగబోతున్న మహాసభ “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అనంతపురం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు నారాయణ గారు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఫుడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారు ముఖ్యంగా పాల్గొన్నారు.
ఈ మీటింగ్ లో ఆహార వసతులు, రవాణా సౌకర్యాలు, వాలంటీర్ల సమన్వయం, సభ ప్రాంగణం వద్ద భద్రతా చర్యలు మొదలైన వాటిపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
శ్రీ సుంకర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ –
“ఈ సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం కేవలం ఒక సభ కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వ విజయాల పండుగ. ముఖ్యంగా, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా అధినేత ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ప్రజా సేవకు అంకితభావంతో పని చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభలో పాల్గొని చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తారు” అని తెలిపారు.
అంతేకాక, ఫుడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లలో మా టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రజలకు భోజనం, నీరు, రవాణా విషయంలో ఎలాంటి లోటు ఉండదని భరోసా ఇచ్చారు.
సమావేశంలో మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ముఖ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
— జిల్లా జనసేన పార్టీ కార్యాలయం, ఉమ్మడి కడప జిల్లా.
-superhit