VSJ News Updates

  • Home
  • VSJ News Updates

VSJ News Updates తాజా సమాచారం ఎప్పటికప్పుడు..

20/09/2025

ధర్మవరం పట్టు చీర తయారీ ఇలా...

20/09/2025
ఇక గ్రీన్ కార్డు కష్టమే గురూ..!అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ క...
20/09/2025

ఇక గ్రీన్ కార్డు కష్టమే గురూ..!

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ కార్డు రావాలంటే EB-3 క్యాటగిరీలోని స్కిల్డ్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ 12 నుంచి 40 ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది.

తాజాగా H1B వీసాల అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.88 లక్షలు చెల్లిస్తూ ఉంటేనే వీసా రెన్యూవల్ అయి గ్రీన్ కార్డు వస్తుంది.

20/09/2025

ఓయూలో మాస్ స్టెప్పులేసిన లేడీ కానిస్టేబుళ్లు..

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో పెద్ద ఎత్తున ఓయూ విద్యార్థినులు పాల్గొని బతుకమ్మ ఆడారు.

ఈ వేడుకల్లో భాగంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న లేడీ కానిస్టేబుల్స్ విద్యార్థినులతో కలిసి మాస్ స్టెప్పులు వేసి దుమ్ములేపారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.

ట్రేడింగ్ మోసం.. ఇద్దరి అరెస్ట్.. హైదరాబాద్: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇనల్దార్ వినాయక రాజేంద్ర(నిఖిల్),...
20/09/2025

ట్రేడింగ్ మోసం.. ఇద్దరి అరెస్ట్..

హైదరాబాద్: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇనల్దార్ వినాయక రాజేంద్ర(నిఖిల్), రిషి తుషార్ అరోతే (విక్రంథ్)ను అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియా లింకులు, వాట్సాప్ గ్రూప్ల ద్వారా బాధితులను ప్రలోభపెట్టి రూ. 32 లక్షల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

నిందితులపై రాష్ట్రంలో 2 కేసులు, దేశవ్యాప్తంగా 12 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్స్, బైనాన్స్ ట్రాన్సాక్షన్ వివరాలు సీజ్ చేశారు.

టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు: RTCపండగ సందర్భంగా బస్సు టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఎటువంటి వా...
20/09/2025

టికెట్ చార్జీలు పెరిగాయనే
ప్రచారంలో వాస్తవం లేదు: RTC

పండగ సందర్భంగా బస్సు టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

సాధారణ సర్వీసులకు ధరలు యథాతథంగా ఉన్నాయని తెలిపింది. పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు మాత్రమే జీవో 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసుల డీజిల్ ఖర్చులను భర్తీ చేసేందుకు టికెట్ ధరలను స్వల్పంగా సవరిస్తామని పేర్కొంది.

ఈ విషయంలో ప్రచారాలను నమ్మవద్దని RTC కోరింది.

ఫీజులు పెండింగ్లో ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే: ఉపలోకాయుక్తAP: వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థుల ఫీజులు పెండింగ్లో ఉ...
20/09/2025

ఫీజులు పెండింగ్లో ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే: ఉపలోకాయుక్త

AP: వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థుల ఫీజులు పెండింగ్లో ఉన్నా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందేనని ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఆదేశించారు.

SVUలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విద్యార్థులు నిరసన తెలపగా, సుమోటోగా స్వీకరించారు. ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు.

అండర్ టేకింగ్/బాండ్లు తీసుకొని సర్టిఫికెట్లివ్వాలని సూచించారు.

19/09/2025

తల్లి నగల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు

గత కొంత కాలంగా తల్లి బంగారం కోసం ఇరువరి మధ్య గొడవలు

అన్న నాగిరెడ్డి కుటుంబం పై తమ్ముడు రామకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యుల దా*డి

నాగిరెడ్డి భార్య పద్మ , కుమారుడు అంజిరెడ్డిలకు తీవ్ర గా*యాలు. పద్మ పరిస్తితి వి*షమం..

19/09/2025

ఐఫోన్ 17 కోసం కొట్టుకున్నారు!

లేటెస్ట్గా లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని BKCలో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు.

స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు.

19/09/2025

తల్లీకూతుళ్లకు వేధింపులు.. యువకులను నడిరోడ్డుపై చితక్కొట్టారు!

AP: తిరుపతిలో నిన్న రాత్రి కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద ఆరుగురు యువకులు రోడ్డుపై వెళ్తున్న తల్లీకూతుళ్లను వేధించారు.

దీంతో స్థానికులు ముగ్గురిని పట్టుకొని చావబాదగా, మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు కూడా నిందితులను లాఠీతో కొట్టారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు ముందు బార్లోనూ ఈ యువకులు గొడవపడ్డారు.

18/09/2025

పి*చ్చి కుక్క దా*డిలో 50 మందికి పైగా గా*యాలు.. సిరిసిల్ల జిల్లాలో ఘటన, అందరిని కరి*చింది ఒకే కుక్క..

18/09/2025

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో గొడవ..

KNR బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

అనిల్ అనే వ్యక్తికి తనిఖీల్లో 100 శాతం ఆల్కహాల్ పాయింట్లు రావడంతో పోలీసులు అతడి వాహనాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిని, బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VSJ News Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share