GDK

GDK UNITY OF GODAVARIKHANI YOUTH

రామగుండం పేరు గొప్ప ఊరు దీబ్బ అన్నట్లు ఉందా.....?ఒకప్పుడు మహానగరాలు అయినా హైదరాబాద్, వరంగల్, తరువాత మూడవ మహానగరంగా వెలిగ...
27/12/2024

రామగుండం పేరు గొప్ప ఊరు దీబ్బ అన్నట్లు ఉందా.....?

ఒకప్పుడు మహానగరాలు అయినా హైదరాబాద్, వరంగల్, తరువాత మూడవ మహానగరంగా వెలిగిన ఊరు మన రామగుండం ఇప్పుడు ఎందుకు అభివృద్ధి, డెవలప్మెంట్ లో ముందుకు వెళ్లడం లేదు..?

ఒకప్పుడు కరీంనగర్ కంటే ఎక్కువ జనాభా కలిగిన రామగుండం లో ఇప్పుడు ఏమవుతుంది..?

2011 లో మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా ఎదిగిన రామగుండం ఎన్ని సంవత్సరాలనుండి ఎంత డెవలప్మెంట్ ఐనది...?

ఒకప్పుడు చిన్న టౌన్ లు గా ఉన్న సిద్ధిపేట, మంచిర్యాల ఎందుకు రామగుండం కంటే డెవలప్ అయ్యాయి....?

మన రామగుండం నుండి ఒక్క నాయకుడు కూడా మంత్రులు గా లేనందుకా...?

నాయకుల నిర్లకశామా?

కరీంనగర్ రీజియన్ లో ఎక్కువగా లాభాలు పొందుతున్న గోదావరిఖని డిపో ని ఎంకికని నిర్లక్ష్యం చేస్తున్నారు, గోదావరిఖని కీ రెండవ డిపో ప్రపోసల్ ఉన్న ఎందుకు మంజూరు కావట్లేదు.. బస్టాండ్ కెపాసిటీ ఎందుకు పెంచట్లేదు విస్తరణ చెయ్యట్లేదు....?

కమర్షియల్ కాంప్లెక్స్ మార్ట్స్ అన్ని కూడా ఇతర చిన్నపాటి టౌన్ లకు ఎందుకు తరలి పోతున్నాయి..?

దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉండి జిల్లా కాకుండా ఉన్న అందులో రెవిన్యూ డెవిసన్ కీ కూడా నోచుకోని ఏకేక మున్సిపల్ కార్పొరేషన్ మన రామగుండం మా....???

రూడా RUDA రామగుండం కేంద్రం నుండి తరలి పోతుందా....? అంటే అవును అని సమాచారం??

అన్ని హంగులు ఉన్న రామగుండం ను జిల్లా కేంద్రం చేయకుండా చిన్న నగర పంచాయతీ ని జిల్లా చేయడములో అర్ధం????

సోషల్ మీడియా లో రేటింగ్స్ రామగుండం కీ మన ప్రజలు హైప్ చేయక పోవడమా...???

గూగుల్ మాప్స్ లో కూడా రాజీవ్ రహదారి రామగుండం - హైదరాబాద్ రాకుండా మంచిర్యాల -హైదరాబాద్ అని రామగుండం ఆస్తిత్వం కోల్పోతుందా....?

ఎన్ని పెద్ద పెద్ద ఇండట్రీస్ ఉన్న dmft నిధులు ఎక్కడ రామగుండం డెవలప్మెంట్ ఎక్కడ పోయింది...?

దేశం లో 29 రాష్టలకు రామగుండం పేరు ఒక్కప్పుడు వినపడేది అదే ఇప్పుడు కనుమరుగయ్యే లాగా ఉందా...?

ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 100 పేజీలు సరిపోవు ఎక్కడ
అంబేద్కర్ భవనం???
IT హబ్???
MINI ట్యాంక్ బాండ్???
AIRPORT???
బస్టాండ్ విస్తరణ ఫుట్ ఓవర్ బ్రిడ్జి??
MUNCIPAL జంక్షన్ విస్తరణ???
B పవర్ హౌస్ జంక్షన్ విస్తరణ??
ఎక్కడ వెల్కమ్ కామన్ లు???
లుంబిని పార్క్ ల గోదావరి పక్కన పార్క్???
BOATING పర్యాటకం???
రాజమండ్రి ల పుష్కర ఘాట్ ఎక్కడ?

దేశమంతా తన విద్యుత్తో వేలుగులు అందిస్తూ మంచేస్టర్ అఫ్ ఇండియా గా ఉన్న రామగుండం నీకు గుర్తింపు లేదు......
నీవేలుగులు ఎక్కడ ?????

ఇవన్నీ కూడా ఎప్పుడు అయ్యేది మాస్టర్ ప్లాన్ ఎప్పుడు చేసేది
ఈ 2024 సంవత్సరం కూడా ఐపోయింది కొంచెం మన రామగుండం డెవలప్మెంట్ గురించి discus చేయండి మిత్రులారా....

మిత్రులారా మీ అభిప్రాయాలు కామెంట్ రూపం లో చెప్పండి
మీరూ ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఎం చేయాలి ప్లీజ్ షేర్ to your , #గోదావరిఖని ఫ్రెండ్స్

05/09/2024

2021 ,అక్టోబరు 9:
#గొదవరిఖని రామగుండం నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలు, నగర విస్తరణ, నూతన పరిశ్రమలు, మెడికల్‌ కళాశాల తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాస్టర్‌ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు. డిజైన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (డీడీఎఫ్‌) సంస్థ ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపకల్పన చేస్తోంది. మున్సిపల్‌ శాఖ డీడీఎఫ్‌ కన్సల్టెంట్‌కు మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసిన ఈ సంస్థ డ్రాఫ్టును కూడా రూపొందించింది. కరోనా కారణంగా మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి పనికి కొంత జాప్యం ఏర్పడింది. ఇప్పుడు డీడీఎఫ్‌ సంస్థ పని వేగవంతం చేసింది. ఈ నెలలోనే స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం నిర్వహించనున్నది. ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణను చేయనున్నారు.

ఈ ఏడాదితో మాస్టర్‌ ప్లాన్‌ గడువు పూర్తి

రామగుండం నగరపాలక సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను ఈ ఏడాదితో కాలపరిమితి ముగియనున్నది. రామగుండం మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత 2001లో మొదటగా మాస్టర్‌ ప్లాన్‌ను ఏర్పాటు చేశారు. 20ఏళ్ల కాలపరిమితిపై ప్రభుత్వం ఈ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాదిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి కౌన్సిల్‌లో ఆమోదం తరువాత ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపి జీఓ జారీ చేస్తుంది.

నగర విస్తరణే లక్ష్యంగా..

రామగుండం నగరపాలక సంస్థలో నగర విస్తరణే లక్ష్యంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం రామగుండం నగర జనాభా 2,29,644గా ఉంది. 2021లో ఈ జనాభా 2,48,980గా ఉం టుందని అంచనా వేస్తున్నారు. 93.87చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రామగుండం నగరంలో రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని పట్టణాలున్నాయి. దీనికి ట్రైసిటీగా పేరుంది. 2001లో మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించినా అందుకు అనుగుణంగా రోడ్లు, పార్కులు, ఆట స్థలాలు కానీ, ఇతర అభివృద్ధి ప్రతిపాదనలు కానీ అమలుకు నోచుకోలేదు. 2011లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో నగర విస్తరణపై పూర్తిస్థాయిలో ముందుచూపు లేకుండా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఇందులో గోదావరిఖని పట్టణంలోని ఏ ఒక్క రహదారిని 100అడుగుల రహదారిగా అంచనా వేయలేదు. కేవలం బీ పవర్‌హౌస్‌ నుంచి పెద్దంపేట, ఎన్‌టీపీసీ ప్రస్తుత పీకే రామయ్య క్యాంపు లింగాపూర్‌గుండా రామగుండంకు 100అడుగుల రహదారిని ప్రతిపాదించారు. దీంతో పాటు ఎన్‌టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు నుంచి ఎఫ్‌సీఐ వరకు 100అడుగుల రహదారిని ప్రతిపాదించారు. ఇక మేడిపల్లి సెంటర్‌ నుంచి మేడిపల్లి ఓసీపీ, గంగానగర్‌ నుంచి మేడిపల్లి వరకు మాత్రం 80అడుగుల రహదారిని ప్రతిపాదించారు. రామగుండం నగరం విస్తరించడం, శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండడంతో అందుకు అనుగుణంగా రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఆర్‌డీపీ)ను రూపొందించుకున్నాయి. ముఖ్యంగా గోదావరిఖని మున్సిపల్‌ జంక్షన్‌ నుంచి ఫైవింక్లయిన్‌ వరకు వంద అడుగుల రహదారి, రాజేష్‌ థియేర్‌ నుంచి మార్కండేయకాలనీ, మార్కండేయకాలనీ నుంచి కళ్యాణ్‌నగర్‌ వరకు 60అడుగుల రహదారికి ఆమోదం లభించింది. అలాగే ఇందిరానగర్‌ నుంచి గౌతమినగర్‌, ఇందిరానగర్‌ నుంచి 7ఎల్‌బీ కాలనీ వరకు 60అడుగుల విస్తరణ ప్రతిపాదించారు. అలాగే మున్సిపల్‌ ఆఫీస్‌ వెనుక నుంచి శివాలయం వరకు 40అడుగులకు ఆర్‌డీపీ ఆమోదం లభించింది. ఇక లక్ష్మీనగర్‌లో 40అడుగుల విస్తరణను ప్రతిపాదించారు. గత మాస్టర్‌ ప్లాన్‌లో చాలా ప్రాంతాలను ఓపెన్‌ స్పేస్‌లుగా చూపారు. చుట్టూ రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉన్న ప్రాంతాలలో మధ్యన ఉన్న ఏరియాను వెకెంట్‌ ల్యాండ్‌గా చూపారు. ముఖ్యంగా ఎన్‌టీపీసీలోని కృష్ణనగర్‌ ప్రాంతంలో గల గంగపుత్ర సొసైటీ ఏరియా, సప్తగిరికాలనీ సమీపంలోని ఏరియా, ప్రస్తుత గంగానగర్‌ ఏరియాలను మాస్టర్‌ ప్లాన్‌లో వెకెంట్‌ ల్యాండ్‌గా చూపారు. దీంతో ఈ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. చుట్టూ నిర్మాణాలు జరిగి ఈ స్థలాలు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. గంగానగర్‌లో సింగరేణి ప్లాటింగ్‌ జరిగి నిర్మాణాలు కూడా జరిగాయి. అయినా ఆ ప్రాంతాన్ని వెకెంట్‌ ల్యాండ్‌గా మాస్టర్‌ ప్లాన్‌లో చూపారు. అక్కడ పాత షెడ్ల స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించాలంటే కూడా అనుమతులు రావడం లేదు. వీటితో పాటు 1984లో గోదావరికి వచ్చిన వరదలను అంచనా వేసి సబ్‌ మెర్జిబుల్‌ ఏరియాను రూపొందించారు. ఇందులో ప్రస్తుత పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీ, జనగామ పరిసర భూములన్నీ ముంపు భూములుగానే ఉన్నాయి. ఈ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావు. అనుమతులు రావాలంటే ప్రభుత్వం కన్వర్షన్‌ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం వల్ల బ్యాక్‌ వాటర్‌ పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీలోని చాలా ప్రాంతాలకు వస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, గోదావరి వరదలకు సప్తగిరికాలనీ సమీపంలోని ఎన్‌ఆర్‌సీపీ పరిసర భూములన్నీ ముంపునకు గురయ్యాయి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో సబ్‌ మెర్సిబుల్‌ ఏరియాలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

20 ఏళ్ల అభివృద్ధికి మాస్టర్‌ ప్లానే ఊపిరి..

రామగుండం నగరం మరో 20ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి జరుగాలన్న విషయానికి మాస్టర్‌ ప్లానే సూచికగా మారనున్నది. సింగరేణి గనుల విస్తరణలో భాగంగా అనేక రహదారులు, నాలాలను మళ్లిస్తున్నారు. రామగుండం నగరానికి సమీపం నుంచి కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి. రామగుండం నుంచి కాళేశ్వరం, రామగుండం నుంచి వరంగల్‌, రామగుండం నుంచి నాగపూర్‌ మార్గాలకు జాతీయ రహదారులు కనెక్ట్‌ అవుతాయి. ఇందుకు అనుగుణంగా బైపాస్‌ల నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. రామగుండం శివారు ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాయి. లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల కల్చర్‌ వచ్చింది. రామగుండం నుంచి జనాభా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం దాదాపు ఆగింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ తెలంగాణ ప్లాంట్‌, సింగరేణి, ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోలార్‌ ప్లాంట్లు, రామగుండంలో నూతనంగా మెడికల్‌ కళాశాల, ఐటీ టవర్ల మంజూరు వంటివి జరిగాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి కూడా జరుగుతోంది. రామగుండం నగరం పక్కనే ఉన్న అంతర్గాం ప్రాంతంలో ఇండస్ర్టియల్‌ పార్కును ప్రతిపాదిస్తున్నారు. రామగుండం పక్కనే రామగుండం నగరంకు పది కిలో మీటర్ల దూరంలో ఇందారం నుంచి టేకుమట్ల, మంథని, బేగంపేట మీదుగా వరంగల్‌కు కొత్త జాతీయ రహదారి మంజూరైంది. త్వరలోనే నిర్మాణ పనులు కూడా మొదలుకానున్నాయి. గనుల విస్తరణలో భాగంగా రామగుండం-మంథని-కాళేశ్వరం రహదారిని కూడా మళ్లించారు. గోదావరి వెంట ఉన్న గ్రామాల గుండా ఈ రహదారి నిర్మాణం జరిగింది. నూతన మాస్టర్‌ ప్లాన్‌లో 100, 120 అడుగుల రహదారులను అభివృద్ధి జరుగనున్న ఏరియాల్లో ప్రతిపాదించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, స్టేడియంలు, ఆసుపత్రులు, పా ర్కులకు సంబంధించి పబ్లిక్‌యుటిలిటీ ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉం టుంది. మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించిన తరువాత ప్రభుత్వం ఇందుకు సం బంధించి అమలుకు నిధులు కేటాయించనున్నది. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో రాబోయే 20ఏళ్ల జనాభాను అంచనా వేసి అందుకు అనుగుణంగా రహదారుల రూపకల్పన కూడా చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే నిర్మాణాలకు సంబంధించిన అనుతులు కూడా మంజూరవుతాయి.

సింగరేణి job Notification for executive and NCWA
14/03/2024

సింగరేణి job Notification for executive and NCWA




సింగరేణి  job Notification ranundi.....
21/02/2024

సింగరేణి job Notification ranundi.....




ఇది ఒక సింగరేణి ఉద్యోగి ఆవేదన......సింగరేణి ఆసుపత్రి ఉన్నది కార్మికుల కోసమేనా?ఈ రోజు నేను ఒక కార్మికుడికి పరిస్తితి లైవ్...
27/01/2024

ఇది ఒక సింగరేణి ఉద్యోగి ఆవేదన......

సింగరేణి ఆసుపత్రి ఉన్నది కార్మికుల కోసమేనా?

ఈ రోజు నేను ఒక కార్మికుడికి పరిస్తితి లైవ్ గా చూసి చలించిపోయా..
అతను ప్రమోషన్ దృష్ట వేరే ఏరియా కి గోదావరిఖని నుండి వేరే ఏరియా కి ట్రాన్స్ ఫర్ అయ్యారు అంట..ఏదో పని ఉండి కుటుంబ సభ్యులతో గోదావరిఖని వచ్చారు అంట..కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళ 4 సంవత్సరాల పాప కి హై ఫివర్ రావడం తో చూపిద్దామని గోదావరిఖని ఏరియా ఆసుపత్రి తీసుకోచ్చాడు.మొదటగా తన పేరు బుక్ ఇక్కడే ఉండటంతో ఆ బుక్ మీద చూసి ఓపి రాయమంటే ఫ్యామిలీ బుక్ కావాలి అన్నారు.నేను ప్రమోషన్ వల్ల వేరే ఏరియా కి ట్రాన్స్ ఫర్ అయ్యాను..పాప ఆసుపత్రి బుక్ అక్కడే ఉంది..నిన్న పని ఇక్కడికి వచ్చాం..వచ్చాక ఫివర్ ఉంది ఈ ఒక్కసారికి చూడండి అంటే లేదండి చూడం..వేరే ఏరియా నుండి వచ్చిన వాళ్ళకు స్పేషల్ ఫారం ఉంటది..అది కూడ కార్మికుడికి ఏమర్జెన్సీ అయితేనే అని చెప్పి చూడమన్నారు..పాపం చేసేది ఏమీ లేక ప్రవైట్ ఆసుపత్రికి తీసుకేళ్ళారు..ఆ పాప కి నిజంగానే చాలా ఫివర్ ఉంది..

ఇలాంటి సమయంలో కూడ కార్మికులకు ఉపయోగపడని ఈ ఆసుపత్రి ఏందుకు? ఈ దిక్కుమాలిన సిస్టమ్ ఏందుకు?

డిజిటైలేజన్ పరంగా ముందుకు వెళ్తున్న,మన సింగరేణి లో మాత్రం వెనుకనే...

కార్మికుడు ఏ ఏరియా లో పని చేసిన,కార్మికుడికి ,కుటుంబ సభ్యును ఆసుపత్రి లో చికిత్స కి అవకాశం ఇవ్వాలి...బుక్ లేకున్న సాఫ్ట్ కాపీ,లేదా ఇతర ఏదైన ప్రూఫ్ చూపించిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాల్సింది గా కోరుతున్నాం..

Plz every one share this post..



27/08/2023

Just for fun :

x : "సార్ ఇది y గారి ఇల్లేనా"
y: "అవును...మీరు?"
x: "మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలి"
y: "ముందు మా కండిషన్స్ విన్నాక మాట్లాడండి"
x: "అది కాదు సార్ మీ అమ్మాయి పెళ్ళి...."
y: "ఏదైనా సరే ముందు మా కండిషన్స్ విన్నాకే పెళ్ళి గురించి మాట్లాడండి"
x: "సరే కానివ్వండి"
y: "మా అమ్మాయికి 654321 ఉన్నవాడినే పెళ్ళి చేయాలి"
x: "అంటే ఏంటి సార్"
y: "6 అంకెల జీతం అంటే లక్ష జీతం అయినా ఉండాలి
5 లక్షల కారు అయిన ఉండాలి అది కూడా అబ్బాయి పేరు మీదే ఉండాలి
4 లక్షలు విలువ చేసే బంగారం అమ్మాయికి వెయ్యాలి
3 బెడ్ రూములు కలిగిన ఇల్లు ఉండాలి అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి
2 ట్రిప్ప్లు అయినా నెలకు తిప్పాలి బయట
1 ఒక్కడే కొడుకు అయ్యుండాలి"
x: 🤔🤔🤔🤔🤔
y: అంతే కాదు
అబ్బాయి తల్లితండ్రులు పెళ్ళి అవగానే విడిపోవాలి
అమ్మాయికి వంట రాదూ అయినా మీరు అడగకూడదు
అమ్మాయి ఆలస్యంగా నిద్రలేస్తుంది
ఆదివారాలైతే ఇంకా ఆలస్యంగా లేస్తుంది
అవి పట్టించుకోకూడదు
ఇక ఇల్లు కారు డాక్యుమెంట్స్ మాకు చూపెట్టాలి
ఆఫీస్ నుండి సాలరీ సర్టిఫికెట్ తీసుకురావాలి
మా అమ్మాయిని మేము చాలా గారాభంగా పెంచాము
తను ఇబ్బంది పడకూడదు కదా అందుకే ఇన్ని జాగ్రత్తలు
ఇవన్నీ మీకు నచ్చాక అప్పుడు మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడుదాం ఏమంటారు మీరు?"
x : "నేను ఏమనాలి సార్"
y: "నువ్వే కదయ్యా మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అన్నావు"
x: "నేను పోలీసుస్టేషన్ నుండి మాట్లాడుతున్నాను సార్ మీ అమ్మాయి మీ వీధి చివరి స్కూటర్ గారేజ్ మెకానిక్ ని ఈరోజు ఉదయం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్ళి చేసుకుందట।
మీరు ఒప్పుకోరని, తమని విడదీస్తారని, తానిప్పుడు మేజర్ నని, మిమ్మల్ని ఒప్పించమని మా స్టేషన్లో బైఠాయించింది।
అందుకే మీ అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అని అన్నాను,
వచ్చి మాట్లాడండి" అని ఫోన్ పెట్టేసాడు y
y:😭😭😭😭😭

అజర్‌బైజాన్‌లో జరిగిన ‘చెస్‌ వరల్డ్‌ కప్‌ 2023’ ఫైనల్స్‌లో ఒక అడుగు దూరంలో టైటిల్‌ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓ...
27/08/2023

అజర్‌బైజాన్‌లో జరిగిన ‘చెస్‌ వరల్డ్‌ కప్‌ 2023’ ఫైనల్స్‌లో ఒక అడుగు దూరంలో టైటిల్‌ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే.

👉ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్‌ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్‌ కప్‌లో ఇంత చిన్న వయసులో రన్నరప్‌గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు, దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నాడు.🍁

సింగరేణి కాలేజ్ నాస్పుర్ లో జాబ్స్క్రెడిట్ : sccl fast updates
27/08/2023

సింగరేణి కాలేజ్ నాస్పుర్ లో జాబ్స్
క్రెడిట్ : sccl fast updates

08/08/2023

Shri Narendra Modi, Hon'ble PM lays foundation stone for redevelopment of Ramagundam Railway Station under
👉 Project cost ~ ₹26.5 cr
👉 A glimpse at the proposed designs of the upcoming redeveloped Ramagundam Station

06/08/2023

రామగుండంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

అన్ని రకాల పరిశ్రమలు, వనరులు అందుబాటులో ఉన్న రామగుండంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు MSరాజ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇక్కడి రైల్వే స్టేషన్ లో అన్ని రకాల సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లకు స్టాప్ ఇవ్వాలని, రెండవ ప్లాట్ఫారం పైన, స్టేషన్ బయట ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని రైల్వే DMEశ్రీనివాస్ వినతి పత్రం అందించామన్నారు.

సింగరేణి లో ఉన్న ECE GRADUATES అందరూ కూడా ఇంటర్నల్ లో వివిధ పోస్టులకు తమకు కూడా అర్హత కల్పించాలని కోరుతున్నారు వీరు అందర...
12/07/2023

సింగరేణి లో ఉన్న ECE GRADUATES అందరూ కూడా ఇంటర్నల్ లో వివిధ పోస్టులకు తమకు కూడా అర్హత కల్పించాలని కోరుతున్నారు వీరు అందరూ సింగరేణి లో దాదాపు 500 కు పైగా ఉన్నారు .తమను కూడా ఐటీ ప్రోగ్రామర్, పోస్ట్లు, E&M LO జరిగే జాబ్లకు కన్సిడర్ చేయాలని కోరుతూ లెటర్ వ్రాయడం జరిగింది....
, , , ..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when GDK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share