Akshara Yagnam
- Home
- Akshara Yagnam
Welcome to official page of SURAPPAGARI NEWS !!!
Address
Website
Alerts
Be the first to know and let us send you an email when Akshara Yagnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Shortcuts
-
Want your business to be the top-listed Media Company?
Our Story
అక్షరం వ్యాపారంగా మారిపోయింది. సమాజానికి దిశా నిర్దేశం చేయాల్సిన పత్రికలు ప్రసార మాధ్యమాలు దిశ తప్పుతూ వాస్తవాలకు తూట్లు పొడుస్తూ అవాస్తవాలకు పట్టం కడుతూ వాస్తవాలని తుంగలో తొక్కుతూ ఎవరికీ ఇష్టం వచ్చిన రీతి లో వాళ్ళు కథనాలను ప్రసారం చేస్తూ అక్షర సమాధి గావిస్తున్నారు. వార్తల్లో నిజాలని వెతుక్కునే దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం చేరుకున్నాము అంటే పత్రికల మరియు ప్రసార మాధ్యమాల విశ్వసనీయత ఏమిటో తేటతెల్లం అవుతుంది. వార్త చానళ్ళు మరియు పత్రికల మధ్య పరస్పర పోటి ఈ పరిస్థితికి కారణం అనడంలో ఎటువంటి అతిశోయోక్తి లేదు. పాఠకుడి లేదా ప్రేక్షకుడిని ఆకర్షించడానికి వాస్తవాలకు మరింత మసాలా జోడించి " బ్రేకింగ్ న్యూస్ " అంటూ ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ పత్రికల మరియు ప్రసార మాధ్యమాల ఉనికిని కోల్పోయేలా చేస్తున్నాయి. అంటే అన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఇలానే ఉన్నాయి అనుకుంటే పొరపాటే, కాని విలువలని పాటిస్తున్న పత్రికలు మరియు ఛానళ్ళు దీనిని అరికడితే సగటు పాఠకుడికి/ప్రేక్షకుడికి మేలు చేసిన వారవుతారు. హై టెక్ ప్రపంచంలో రంగు రంగు ల పేజిలతో వార్తలు ప్రచురించడం, కన్నులకు ఇంపుగా ఉండేలా వార్తలు ప్రసారం చేయడం మంచి పరిణామమే కానీ ఆ ముసుగులో అవాస్తవాలకు రంగులు అద్దడం హేయం. ...ప్రతి పాత్రికేయుడు దీనిని ఖండించాలి అనుకున్న ఈ వ్యాపార ప్రపంచం లో ఇది అసాధ్యం గా మారిపోయింది. అందుకే సగటు పాఠకుడిగా కోన ఊపిరితో ఉన్న అక్షరానికి జీవం పోస్తూ , అక్షరాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి, వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ , నిజాల నిగ్గును నిక్కచ్చిగా వెలికి తీస్తూ, తాజా వార్తలని, వార్తల విశ్లేషణతో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ, సమగ్ర కథనాలతో, సరికొత్త పంధాతో వాస్తవికతకు దర్పణం పడుతూ సమాజ ప్రగతికి ఎక్కు పెట్టిన అస్త్రం గా నా ఈ ప్రయత్నం సపలికృతం అవుతుంది అని ఆశిస్తూ , మీ అందరి సహాయ సహకారాలను నాకు అందించాలని కోరుకుంటూ నా ఈ అక్షర ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాను...నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ నిండు మనసుతో ఆశిర్వదిస్తారని ఆకాంక్షిస్తూ.... మీ.. సంపత్ కుమార్ సూరప్పగారి