28/10/2025
#తమిళనాడులో రామేశ్వరం నుండి 75 కి.మి. దూరంలో " #తిరుఉత్తర_కోసమాంగై" అని ఊరు ఉంది.
మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి సొంత ఊరు ఇది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు.
శివభక్తురాలైన #మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన #రావణబ్రహ్మను_మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు.
ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని #మొగలి_పువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన #రేగిపండు_చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది.
ఇక్కడ శివుడు #శివలింగరూపంలో, #మరకతరూపంలో, #స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది.
ఆ మరకతం నుండి వచ్చే #కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం #ఆరుద్ర_నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది.
అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం.
ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు #వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా #రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి.🙏
అందరికీ కార్తీక్ మాస ప్రారంభ శుభాకాంక్షలు