Deepthi 65

Deepthi 65 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Deepthi 65, News & Media Website, .

20/07/2025

సింహాచలం గిరిప్రదక్షిణ విహంగ వీక్షణం -

మన సనాతనం ఎప్పుడూ మనని అబ్బుర పరుస్తూనే ఉంటుంది... 🙏🏻🙏🏻🙏🏻
నరసింహతే నమో నమః 🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

@సింహాచలం

తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గిరి అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపాడు. ఈ ఘటన పాకాల మండల...
18/07/2025

తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గిరి అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపాడు. ఈ ఘటన పాకాల మండలం మద్దినాయినిపల్లెలో చోటుచేసుకుంది. భార్య హేమకుమారి (35), కుమార్తెలు తేజశ్రీ (7), తనుశ్రీ (11)ని చంపేసిన తర్వాత గిరి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే గిరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌ తెలిపారు. గిరిని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నాడు.

జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య.. యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను బెదిరిస్తున్న పోలీసులు...రాజీ కుదు...
18/07/2025

జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య..

యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను బెదిరిస్తున్న పోలీసులు...

రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేసిన వెల్గటూర్ ఎస్ఐ..

మీరు నిరసన చేస్తే మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగిన పోలీసులు..

హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువుల ఆగ్రహం..

న్యాయం జరగాలని బంధువులు డిమాండ్..

ఇది చదువుకున్న వారి కెపాసిటీ అంటే.....భారత కుర్రోడు ప్రతిభ.... కోట్లల్లో ఆఫర్లు....ప్రపంచ స్థాయి లో ఉన్న దిగ్గజ కంపనీలు ...
18/07/2025

ఇది చదువుకున్న వారి కెపాసిటీ అంటే.....భారత కుర్రోడు ప్రతిభ.... కోట్లల్లో ఆఫర్లు....ప్రపంచ స్థాయి లో ఉన్న దిగ్గజ కంపనీలు మొత్తం ఆఇద్దరు కోసం...విద్యావంతులు కి తిరుగులేదు....సరిసారు వారికి ఎవ్వరు....ఇద్దరు ఇంజినీర్ల కోసం రూ.2,400 కోట్లు.. ఏఐ రేసులో మెటా దూకుడు!

సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ కోసం మెటా పరిశోధనలు

భారత ఏఐ నిపుణుడు త్రపిట్ బన్సల్ కు రూ.800 కోట్ల ఆఫర్
ఓపెన్ ఏఐ నుంచి మెటాకు మారిన బన్సల్ రుమింగ్ పాంగ్ కు రూ.1600 కోట్ల ప్యాకేజి

ఆపిల్ నుంచి మెటాలో చేరిన పాంగ్

సిలికాన్ వ్యాలీలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తీవ్రమైన పోటీ నడుస్తున్న వేళ, మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇద్దరు ప్రముఖ ఏఐ పరిశోధకులైన త్రపిట్ బన్సల్ మరియు రుమింగ్ పాంగ్‌లను తమ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో చేర్చుకోవడానికి రూ. 2,400 కోట్ల విలువైన ఆఫర్లతో సంచలనం సృష్టించింది. ఈ భారీ ఆఫర్లు భారత ఏఐ నిపుణుల ప్రతిభను మరియు మెటా యొక్క అత్యాధునిక ఏఐ సాంకేతికత అభివృద్ధిలో నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయి.

త్రపిట్ బన్సల్: ఓపెన్‌ఏఐ నుండి మెటాకు

ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ అయిన త్రపిట్ బన్సల్, 2022లో ఓపెన్‌ఏఐలో చేరి, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ మరియు ఏఐ రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఓపెన్‌ఏఐ "O1" మోడల్‌ను రూపొందించడంలో సహ-సృష్టికర్తగా ఉన్న బన్సల్ ను టెక్ క్రంచ్ "అత్యంత ప్రభావవంతమైన ఓపెన్‌ఏఐ పరిశోధకుడు"గా అభివర్ణించింది. మెటా, బన్సల్‌కు రూ. 800 కోట్ల భారీ ఆఫర్‌తో ఆకర్షించి, తమ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో చేర్చుకుంది. ఈ ఆఫర్‌లో భారీ సైనింగ్ బోనస్, ఈక్విటీ గ్రాంట్స్ మరియు పనితీరుకు సంబంధించిన షరతులతో కూడిన దీర్ఘకాల వెస్టింగ్ షెడ్యూల్ ఉన్నాయి. ఇది ఏఐ పరిశోధనా రంగంలో మెటా దూకుడు వైఖరికి నిదర్శనం.

రుమింగ్ పాంగ్: ఆపిల్ నుండి మెటాకు

ఆపిల్ ఫౌండేషన్ మోడల్స్ టీమ్‌కు నాయకత్వం వహించిన రుమింగ్ పాంగ్, ఆపిల్ అధునాతన ఏఐ సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జెన్‌మోజీ, మెరుగైన సిరి వంటి ఆవిష్కరణలకు దోహదపడిన పాంగ్, జూలై 2025లో ఆపిల్‌ను వీడి మెటాలో చేరారు. ఆయనకు మెటా రూ. 1,600 కోట్ల ఆఫర్‌ను అందించింది. పాంగ్ మెటాకు వెళ్లిపోవడం ఆపిల్ ఏఐ విభాగానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. న్యూరల్ నెట్‌వర్క్‌లు, భారీ లాంగ్వేజి మోడల్స్‌ విషయంలో పాంగ్ నిపుణుడు. ఇవి చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి సాంకేతికతలకు పునాదిగా ఉన్నాయి. ఈ నియామకం మెటాకు ఏఐ ఫౌండేషన్ మోడల్స్‌లో బలమైన పునాదిని ఏర్పరచడానికి సహాయపడుతుంది.

మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్

మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL)... ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), దానిని అధిగమించే సూపర్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కేంద్రంగా ఉంది. ఈ ల్యాబ్‌ను స్కేల్ ఏఐ మాజీ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ మరియు గిట్‌హబ్ మాజీ సీఈఓ నాట్ ఫ్రీడ్‌మన్ నేతృత్వం వహిస్తున్నారు. ఓపెన్‌ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆంత్రోపిక్ వంటి సంస్థల నుండి ఇప్పటికే 11 మంది ప్రముఖ ఏఐ పరిశోధకులను మెటా నియమించుకుంది. 2026 నాటికి ఆన్‌లైన్‌లోకి రానున్న 'ప్రోమిథియస్' సూపర్‌క్లస్టర్‌తో సహా భారీ ఏఐ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెటా నిర్మిస్తోంది.

సిలికాన్ వ్యాలీలో ఏఐ నిపుణుల కోసం పోటీ

మెటా భారీ నియామకాలు సిలికాన్ వ్యాలీలో ఏఐ నిపుణుల కోసం జరుగుతున్న తీవ్రమైన యుద్ధాన్ని సూచిస్తున్నాయి. ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, మెటా తమ ఉత్తమ పరిశోధకులను ఆకర్షించేందుకు 100 మిలియన్ డాలర్ల సైనింగ్ బోనస్‌లను ఆఫర్ చేస్తోందని విమర్శించారు. అయితే, బన్సల్, పాంగ్‌లతో పాటు ఇతర పరిశోధకులు మెటాలో చేరడం ద్వారా ఈ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ పోటీ భవిష్యత్తు ఏఐ ఆవిష్కరణలకు దారి తీస్తుందని అంచనా.

భారత్ నుంచి ప్రపంచస్థాయి ఏఐ నైపుణ్యం

త్రపిట్ బన్సల్ విజయం భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణుల ప్రతిభను హైలైట్ చేస్తుంది. గురుగ్రామ్‌లో అక్సెంచర్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, ఐఐఎస్‌సీ బెంగళూరులో పరిశోధనా సహాయకుడిగా పనిచేసిన బన్సల్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలలో ఇంటర్న్‌షిప్‌లు చేశారు. ఈ నియామకాలు భారతీయ పరిశోధకులు ప్రపంచ ఏఐ రంగంలో చేస్తున్న గణనీయమైన సహకారాన్ని గుర్తు చేస్తున్నాయి.

18/07/2025

పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లును అమ్మేసిన భర్త

తెలంగాణ : డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని శాంతినగర్‌కు చెందిన నికితా–శ్రావణ్ దంపతులు.. గొడవల నేపథ్యంలో నికితా పుట్టింటి వద్ద ఉండిపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న నికిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తుంది. కాగా బిడ్డపుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండటం చూసి నికిత షాక్‌ అయ్యింది. ఫోన్ చేసినా భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాసేపట్లో అంత్యక్రియలు.. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు!కాసేపట్లో అంత్యక్రియలు.. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు!హర్యానాలో ఆశ్చర్...
18/07/2025

కాసేపట్లో అంత్యక్రియలు.. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు!

కాసేపట్లో అంత్యక్రియలు.. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు!
హర్యానాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. యమునానగర్ జిల్లాలోని కోట్ మజ్రి ప్రాంతంలో షేర్ సింగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దహన సంస్కారాలకు ముందు స్నానం చేయించే సమయంలో వెంటిలేటర్ ట్యూబ్‌ను తీసేశారు. ఆ సమయంలో షేర్ సింగ్ దగ్గుతూ లేచాడు

కట్నం కోసం సొంత భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించిన ఎస్ఐబంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్ఐగా విధులు నిర్...
18/07/2025

కట్నం కోసం సొంత భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించిన ఎస్ఐ

బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చల్లా ప్రవీణ్ కుమార్

విజయవాడ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన చల్లా ప్రవీణ్‌ కు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాజ్యలతతో వివాహం జరగగా కట్నం కోసం ఇద్దరి మధ్య నిత్యం గొడవలు

పెళ్లి సమయంలో కట్నం కింద రూ.10 లక్షలు, 3 ఎకరాల భూమి, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు, ఒక ప్లాట్ ఇవ్వగా.. తన పేరు మీదకి 3 ఎకరాల భూమి, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు రిజిస్టర్ చేయలేదని కుటుంబంలో నిత్యం గొడవలు

6 నెలలుగా సొంతింటికి పంపకుండా ప్రవీణ్ కుమార్ చిత్ర హింసలు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసిన భార్య

పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించిన ఎస్ఐ చల్లా ప్రవీణ్ కుమార్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఘటన.

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్యఅంబేద్కర్ కోనసీమ జిల్లా – రాజోలురాజోలు మండలం బి.సావ...
17/07/2025

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య

అంబేద్కర్ కోనసీమ జిల్లా – రాజోలు

రాజోలు మండలం బి.సావరం గ్రామం సిద్ధార్థనగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న ఓలేటి పుష్ప (22) గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మ (22) అనే యువకుడితో కలిసి గత ఆరు మాసాలుగా బి.సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది.

షమ్మ గత కొన్ని రోజులుగా మద్యంతాగి పుష్పను వ్యభిచారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో "నా వెంట రావాలి" అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటుచేసుకుంది. పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మ ఆమెను చాకుతో ఎడమ రొమ్ము మీద, కాలిపై పొడిచి హత్య చేశాడు.

దీనితో పాటు పుష్పను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగ, సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన పుష్ప ఘటనాస్థలంలోనే మృతి చెందింది.

సమాచారం అందుకున్న రాజోలు సీఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మ కోసం 2 టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రుణభారంతో దేశం కుదేలు                        భారతదేశం గత దశాబ్దకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సామాజిక పథకాలు, రాజకీయ మార్...
17/07/2025

రుణభారంతో దేశం కుదేలు



భారతదేశం గత దశాబ్దకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సామాజిక పథకాలు, రాజకీయ మార్పులను చవిచూసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఎన్నో వాగ్దానాలు చేసింది. అయితే, ఇటీవలి ఆర్థిక నివేదికలు, సామాజిక వాస్తవాలు సామాన్య పౌరుడి జీవితంలో పెరిగిన అప్పుల భారాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్- 2025 ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ. 4.8 లక్షల అప్పు ఉంది. ఇది గత రెండేళ్లలో రూ. 90,000 మేర పెరిగింది. ఈ గణాంకాలు సామాన్యుడి జీవన పరిస్థితులు ఎంత దిగజారాయో చాటుతున్నాయి.

ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, 2023 మార్చిలో ఒక్కో పౌరుడిపై అప్పు రూ. 3.9 లక్షలుగా ఉండగా, 2025 మార్చి నాటికి ఇది రూ. 4.8 లక్షలకు చేరింది. ఈ రూ. 90,000 పెరుగుదల సామాన్యుడి ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. దేశ జిడిపిలో అప్పుల వాటా 41.9 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 29 శాతం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, మొబైల్ ఇఎంఐలు 54.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, లోన్- టు-వాల్యూ (ఎల్‌టివి) రేషియో 70 శాతానికి పైగా ఉండటం. ఇది రుణాల రికవరీని కష్టతరం చేస్తుంది. అంతేకాక, 25 శాతం రిటైల్ రుణాలు సురక్షితం కానివిగా గుర్తించారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సూచిస్తుంది.

ఫోర్బ్ నివేదిక ప్రకారం, దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 2.16 లక్షలు మాత్రమే. అంటే, సామాన్యుడి అప్పు అతని ఆదాయం కంటే రెండింతలకు పైగా ఉంది. ఈ అసమతుల్యత సామాన్య పౌరుడు తన రోజువారీ జీవన అవసరాల కోసం అప్పులపై ఆధారపడుతున్నాడని స్పష్టం చేస్తుంది. ఆర్‌బిఐ గణాంకాలు చెప్పేది ఏమిటంటే 55% అప్పులు, ఆస్తుల సృష్టికి కాకుండా, కేవలం జీవన ఖర్చుల కోసమే తీసుకోబడుతున్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం, వ్యక్తిగత రుణాలు, ఇఎంఐలు ఈ ధోరణికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సామాన్యుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, నిత్యావసర వస్తువుల ధరలు గత 11 ఏళ్లలో దాదాపు 300 శాతం పెరిగాయి. ఆహారం, ఇంధనం, గృహ ఖర్చులు, విద్య, వైద్యం వంటి అంశాలు సామాన్యుడికి భారంగా మారాయి.

రెండవది, ద్రవ్యోల్బణం పెరిగినా, వేతనాలు దానికి అనుగుణంగా పెరగలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబ ఖర్చులను భరించలేక, ప్రజలు అప్పులపై ఆధారపడుతున్నారు. మూడవది, నైపుణ్యానికి తగిన ఉపాధి అవకాశాలు తగ్గాయి. యువతలో నిరుద్యోగం రేటు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది, ఇది ఆర్థిక అస్థిరతకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు- ఉదాహరణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై), ఆయుష్మాన్ భారత్- పేదలకు సహాయం చేసే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. అయితే, ఈ పథకాలు అమలులో లోపాలు, అవగాహన లేమి లేదా అర్హత సమస్యల వల్ల సామాన్యుడికి పూర్తి ప్రయోజనం చేకూరడం లేదు.

ఉదాహరణకు, పిఎంఎవై కింద గృహ రుణాలపై సబ్సిడీలు అందుతున్నప్పటికీ అర్హత నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండటం వల్ల చాలా మంది ఈ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వంటి విమర్శకులు, మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. అచ్చేదిన్ నినాదంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, వాస్తవానికి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టిందని వాదిస్తున్నారు. ఒక వైపు సామాన్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, ప్రభుత్వానికి సన్నిహిత వ్యాపార వేత్తలు మాత్రం అపార సంపదను సృష్టించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు, ఐటి హార్డ్‌వేర్, బయో టెక్నాలజీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ ఈ ప్రయోజనాలు ప్రధానంగా కార్పొరేట్ రంగానికే చేకూరుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి. మొదట ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి.

నిత్యావసర వస్తువుల ధరలను స్థిరీకరించడం అత్యవసరం. రెండవది, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. మూడవది, రుణాల విషయంలో పారదర్శకత, సురక్షిత రుణవిధానాలను అమలు చేయాలి. అంతేకాక సామాన్యులకు విద్య, వైద్యం, గృహసౌకర్యాలు అందించే పథకాలు సులభతరం చేయాలి. తద్వారా వారు అప్పులపై ఆధారపడకుండా ఉండగలరు. మోడీ పాలనలో దేశం కొన్ని రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, సామాన్యుడి జీవనపరిస్థితులు మాత్రం ఆశాజనకంగా లేవు. పెరిగిన అప్పుల భారం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాల కొరత వంటివి పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే సామాన్యుడి జీవితం మరింత కష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!ఆంధ్రప్రదేశ్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(M)లో ద...
17/07/2025

వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!
ఆంధ్రప్రదేశ్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(M)లో దారుణం జరిగింది. మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22) భర్తతో విడిపోగా.. విజయవాడలో కారు మెకానిక్‌గా పని చేస్తున్న షేక్ షమ్మతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సిద్ధార్థనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన షేక్ షమ్మ.. పుష్పతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో పొడిచి చంపాడు

17/07/2025

బలుపు మరణం ..🧔🏿‍♂️🐍

మెడలో పాము వేసుకుని ఆటలు.. మృతి

✒️'పాములు పట్టేవాడు పాము కాటుకే బలవుతాడు' అనే సామెతను వింటుంటాం. ఎంత నైపుణ్యం ఉన్నవారైనా విషపూరిత పాములతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ, మధ్య ప్రదేశ్లోని రఘోఘర్ దీపక్ మహావార్ అనే స్నేక్ క్యాచర్ నల్లత్రాచు పామును తన మెడకు చుట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. తన కొడుకును స్కూల్లో వదిలి వస్తుండగా అది కాటేసింది. చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్లగా.. రాత్రి పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

https://youtu.be/a2LURlFlrf8For More Videos Please Subsribe Channel
24/10/2024

https://youtu.be/a2LURlFlrf8

For More Videos Please Subsribe Channel

chagantikoteswararaospeeches Koteswara Rao Latest Pravachanam | ఇంట్లో దరిద్రం పోవాలంటే ఒకటే మార్గం.! | ...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Deepthi 65 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share