31/10/2025
హనుమకొండ నగరంలో వరదలతో దెబ్బతిన్న సమ్మయ్య నగర్, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యలయంలో జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, తక్షణం తీసుకోవలసిన సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.