Sakshi Television

  • Home
  • Sakshi Television

Sakshi Television Sakshi launched a TV news channel Sakshi TV and the programs have started airing on March 1, 2009.

This media group is working under the name "Indira Television". Sakshi TV is first High Definition Television (HDTV) in India.

వాసిరెడ్డి చంద్రబాల సంభాషణలుమార్చి 10, 2012ఉదయం 8:05:28 వాసిరెడ్డి చంద్రబాల ఫోన్‌ నుంచి జేడీ లక్ష్మీనారాయణ నెంబర్‌ 94411...
22/06/2012

వాసిరెడ్డి చంద్రబాల సంభాషణలు


మార్చి 10, 2012
ఉదయం 8:05:28
వాసిరెడ్డి చంద్రబాల ఫోన్‌ నుంచి జేడీ లక్ష్మీనారాయణ నెంబర్‌ 9441113444కు SMS
మార్చి 13,2012
ఉదయం 9:33:31
జేడీ లక్ష్మీనారాయణ మరో సెల్‌నెంబర్‌ 9441433444కు వాసిరెడ్డి చంద్రబాల SMS పంపించారు.

అదేరోజున అంటే మార్చి 13,2012
10:00:09 సమయంలో వాసిరెడ్డి చంద్రబాల నెంబర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ 99854-11111కు అవుట్‌గోయింగ్‌ కాల్‌ వెళ్లింది. 50 సెకన్ల పాటు ఇద్దరి మధ్య సంభాషణ సాగింది.
అదేరోజున
10:22:51
12:03:18
12:07:10
13:19:27
16:39:46 సమయాల్లో
వాసిరెడ్డి చంద్రబాల నుంచి జెడీ లక్ష్మీనారాయణ నెంబర్‌కు SMS చాటింగ్‌ జరిగింది.

ఏప్రిల్‌ 24, 2012
ఉదయం 9:54:19
అదే రోజు 9:55:23
వాసిరెడ్డి చంద్రబాల నుంచి జేడీ నెంబర్‌ 9441433444కు రెండు SMSలు

ఏప్రిల్‌ 25, 2012
సమయం 14:38:10
14:38:12
వాసిరెడ్డి చంద్రబాల ఫోన్‌ నుంచి ABN ఎండీ రాధాకృష్ణ నెంబర్‌ 99854-11111కు రెండు SMSలు

మే1, 2012
ఉదయం 10:07:21
10:07:24
10:07:28
10:07:30
వాసిరెడ్డి చంద్రబాల నుంచి ABN రాధాకృష్ణ 99854-11111కు నాలుగు SMSలు

మే2, 2012
రాత్రి 22:00:04
వాసిరెడ్డి చంద్రబాల నుంచి జేడీ లక్ష్మీనారాయణ 94414-33444కు SMS

మే20, 2012
రాత్రి 22:00:03
వాసిరెడ్డి చంద్రబాల నుంచి జేడీ లక్ష్మీనారాయణ 94414-33444కు SMS

మే22, 2012
16:29:00
వాసిరెడ్డి చంద్రబాల నుంచి జేడీ లక్ష్మీనారాయణ 94414-33444కు SMS

మే22, 2012
17:03:52
17:03:56
17:03:58
వాసిరెడ్డి చంద్రబాల నుంచి ABN రాధాకృష్ణ 99854-11111కు మూడు SMSలు

మే23
ఉదయం 10:19:11
వాసిరెడ్డి చంద్రబాల... ABN రాధాకృష్ణ 99854-11111నెంబర్‌కు 11 సెకండ్ల పాటు మాట్లాడారు.

సీబీఐ మ్యాన్యువల్‌ ఏం చెబుతోంది..?వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టిన- సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌... అనేక...
22/06/2012

సీబీఐ మ్యాన్యువల్‌ ఏం చెబుతోంది..?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టిన- సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌... అనేకానేక విమర్శలకు తావునిస్తోంది. సీబీఐ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేస్తోన్న లక్ష్మీనారాయణ... తమ నిబంధనావళిని మరిచపోయారా..? మీడియా ప్రతినిధులతో ఇలా మాట్లాడటం- సీబీఐ నిబంధనలకు విరుద్ధం..! ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో కార్యాలయాలు ఉన్నచోట- సీబీఐ అధికారులు- మీడియా ప్రతినిధులతో నేరుగా మాట్లాడకూడదు. మీడియా కార్యాలయాలకు నేరుగా పత్రికా ప్రకటనలు అందించకూడదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోకు మాత్రమే తమ ప్రకటనలు ఇవ్వాలి. కాని- సీబీఐ ఈ పని చేయలేదు. సీబీఐ అనేది ఇంటెలిజెన్స్‌ సంస్థకాదు, అలాగని- అన్ని విషయాల్ని బట్టబయలు చేసే సంస్థ కాదు.

మీడియాకు ఇచ్చే సమాచారం- అపరిపక్వంగా ఉండకూడదు. సమాచారం వెల్లడించే విషయంలో- రాజీ పడకూడదు. పత్రికలకు, మీడియాకు ఇచ్చే ప్రకటనల ప్రతుల్ని- ముందుగా- సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోని- డిప్యూటీ ప్రిన్సిపల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌-DPIOకు పంపించాలి. అంటే- పత్రిక ప్రకటనల్ని- DPIO మాత్రమే జారీచేస్తుంది. ఒకవేళ- సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వదలిస్తే- డైరెక్టర్‌తోగానీ, అదనపు డైరెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అంతేగానీ- ఇది పబ్లిసిటీగా భావించవద్దు. కాని- సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం- నిబంధనలకు నీళ్ళొదిలి... విలేకరులతో ఇష్టారాజ్యంగా... వందలసార్లు మాట్లాడారు. సీబీఐ మ్యాన్యువల్‌ ఇంత స్పష్టంగా చెబుతున్నా- లక్ష్మీనారాయణ ఈ నిబంధనలు పాటించారా..? ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఉన్న హైదరాబాద్‌ నగరంలో- లక్ష్మీనారాయణ- నేరుగా మీడియా ప్రతినిధులతో ఎందుకు మాట్లాడారు, మీడియా సంస్థల అధినేతలతో ఎందుకు మాట్లాడారు..? సీబీఐ మ్యాన్యువల్‌ అవసరం లేదని జేడీ అనుకున్నారా..? లక్ష్మీనారాయణ తనకుతానే ఏయే నిబంధనలు సృష్టించుకున్నారో చెప్పుకోవాలి..?

గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న జపాన్ కంపెనీ సోనీసోనీ.. సుదీర్ఘ చరిత్ర కలిగిన జపనీస్‌ కంపెనీ. గడిచిన రెండు మూడు సంవత్సరాలుగ...
22/06/2012

గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న జపాన్ కంపెనీ సోనీ

సోనీ.. సుదీర్ఘ చరిత్ర కలిగిన జపనీస్‌ కంపెనీ. గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా చరిత్రలో ఎప్పుడూ లేనంత కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. బిలియన్‌ కొద్దీ నష్టాలను ప్రకటిస్తోంది. ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ సోనీకి ఇండియాలో ఉన్న సబ్సిడరీ మాత్రం మంచి లాభాలు ఆర్జిస్తోంది. ఇదెలా సాధ్యమవుతోంది ఒకసారి చూద్దాం.

రంగుల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించడంలో సోనీ ఉత్పత్తులకు గొప్ప పేరుంది. ఆ గొప్పదనం సోనీ యాడ్స్‌లో కూడా కనిపిస్తుంది. అయితే కంపెనీ పరిస్థితి మాత్రం ఇంత కలర్‌ఫుల్‌గా లేదు. దక్షిణ కొరియా కంపెనీల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడం ఈ జపనీస్‌ కంపెనీకి కష్టమైపోతోంది. స్యాంసంగ్‌, ఎల్జీ కంపెనీలు ప్రపంచ మార్కెట్లోకి దూసుకురావడంతో సోనికి కష్టకాలం వచ్చింది. గడిచిన ఐదు క్వార్టర్లుగా భారీ నష్టాలను ప్రకటిస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 5.7 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చూపింది. ఈ కారణంగా షేరు ధర 30 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జపాన్‌లో భూకంపం రావడం, జపాన్‌ కరెన్సీ యెన్‌ బలపడటం వల్ల తమ కంపెనీ ఇబ్బందుల్లోకి వెళ్లిందని మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. ఇవి తాత్కాలిక కారణాలు మాత్రమే. అసలు కారణం స్యాంసంగ్‌, ఎల్జీల నుంచి వస్తున్న పోటీనే. ఈ రెండు కంపెనీలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సోనీ తల పట్టుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా సోనీ ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇండియాలో మాత్రం ఆ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగి 6,133 కోట్ల రూపాయలకు పెరిగింది. మసారు తమాగవ నేతృత్వంలో సోనీ ఇండియా దూసుకుపోతోంది. ఏమిటి తమాగావ విజయ రహస్యం? సోనీకి బ్రాండ్‌ విలువ చాలా ఎక్కువ. ఈ బ్రాండ్‌ విలువను నిలబెట్టుకోవడమే సోనీ సక్సెస్‌ సీక్రెట్‌. ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడి డిస్కౌంట్లు ఇవ్వకపోవడం వల్ల సోనీ బ్రాండ్‌ చెక్కు చెదరలేదు. పోటీ కంపెనీలతో పోలిస్తే సోనీ ఉత్పత్తుల ధరలు కనీసం 10 నుంచి 15 శాతం ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కస్టమర్లు సోనీని బాగా ఆదరిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా నాణ్యత బాగుంటుందనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉండటంతో ప్రతియేటా సోనీ ఇండియా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇండియాలో సోనీ సాధిస్తున్న విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌ ప్రపంచవ్యాప్తంగా కూడా నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

మునులు తపస్సు చేసుకున్న ప్రాంతంమునులు తపస్సు చేసుకున్న అద్భుత ప్రాంతమది ... ప్రకృతి వరంగా అలరారిన అపురూప చోటు అది. కానీ ...
22/06/2012

మునులు తపస్సు చేసుకున్న ప్రాంతం

మునులు తపస్సు చేసుకున్న అద్భుత ప్రాంతమది ... ప్రకృతి వరంగా అలరారిన అపురూప చోటు అది. కానీ ఇప్పుడు అక్కడ అలాంటి వాతావరణమే కనిపించట్లేదు. అభివృద్ధికి దూరమై ... గుప్తనిధుల వేటతో శిథిలమై ... అధికారుల కటాక్షం కోసం ఎదురుచూస్తోంది.

పచ్చని చెట్లు .. ఆ మధ్యలో కొండలు .. ఇదే గజరాయుని గుట్ట ...
మహబూబ్‌నగర్‌జిల్లా నందిపేట గ్రామశివార్లలోని ఈ గుట్టపై అతి పురాతన శివాలయం ఉంది ...

అంతేకాదు ఇక్కడి 12 రాతి గుహల్లో అప్పట్లో మునులు తపస్సు చేసుకుంటుండేవారట ... ఈ గుహల్లో ఉన్న పెద్ద నంది విగ్రహం వల్లే ... ఈ ప్రాంతానికి నందిపేట అని పేరు కూడా వచ్చిందంటారు అక్కడివారు.

కానీ అధికారులు గుహను పట్టించుకోవడమే మానేశారు. ఇటు గుప్తనిధుల వేటలు జోరుగా సాగుతున్నాయి. పురాతనమైన నంది విగ్రహం కూడా అలానే ధ్వంసమైనట్టు స్థానికులు చెబుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ... తలా ఇంత డబ్బులు వేసుకుని వారే ఈ ప్రాంతాన్ని కొంత బాగు చేసుకున్నారు. కానీ కొన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారంటున్నారు.
అధికారులు ఈ పురాతన గుట్టపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని ... ఇటు గుప్తనిధుల వేటను ఆపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

http://youtu.be/LlfyTP2S4YY

రాష్ట్రంలో నాయకత్వ మార్పుండచ్చని ఢిల్లీలో చర్చఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో పార్టీ స్థాయి క్షీణిస్తుండడంపై....
22/06/2012

రాష్ట్రంలో నాయకత్వ మార్పుండచ్చని ఢిల్లీలో చర్చ

ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో పార్టీ స్థాయి క్షీణిస్తుండడంపై..సీఎం కిరణ్‌పై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండొచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉపఎన్నికల్లో సీఎం తీరు, పార్టీ స్ట్రాటెజీపై సోనియా అసంతృప్తితో ఉన్నట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

ఉదయం 12గంటలకు ఢిల్లీ చేరుకున్న సీఎం నేరుగా..సోనియా ఇంటికి వెళ్లారు. నలభై నిమిషాలపాటు సాగిన భేటీలో అహ్మద్‌ పటేల్‌కూడా పాల్గొన్నారు. సోనియాతో భేటీ ముగిశాక..పార్లమెంట్‌కు చేరుకొని ప్రణభ్ ముఖర్జి రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి మద్ధతుగా కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకంచేశారు. ఈ సాయంత్రానికల్లా సీఎం.. హైదరాబాద్‌కు చేరుకొనే అవకాశాలున్నాయి.

ప్రకృతమ్మ ఒడిలో ఎర్ర నేస్తాలుతొలకరి జల్లుల్లు నేల తల్లిని ముద్దాడగానే .. ఆ జీవులకు ప్రాణం లేచొస్తుంది. పచ్చని పంటపొలాలపై...
22/06/2012

ప్రకృతమ్మ ఒడిలో ఎర్ర నేస్తాలు

తొలకరి జల్లుల్లు నేల తల్లిని ముద్దాడగానే .. ఆ జీవులకు ప్రాణం లేచొస్తుంది. పచ్చని పంటపొలాలపై పాకుతూ అవి పలకరిస్తాయి. వాటి రాకే శుభసూచకంగా భావించి రైతులు పులకరించిపోతారు. అవే ఆరుద్ర పురుగులు.

పచ్చని పంటపొలాలపై ఎర్రని నక్షత్రాల్లా కనిపిస్తున్నవి ఏమిటో గుర్తుపట్టారా? అవును ... ఆరుద్ర పురుగులే. వేగంగా నడుస్తూ ... ముట్టుకోగానే ముడుచుకుపోయే ఈ చిట్టి జీవులు రైతన్నల నేస్తాలు. ప్రకృతి సోయగాలు. రంగారెడ్డిజిల్లాలో వర్షాకాల ఆగమనానికి గుర్తుగా ఇవి తడి నేలపై ... పంటపొలాలపై పాకుతూ కనువిందు చేస్తున్నాయి.ఆరుద్ర పురుగుల్ని శుభ సూచకంగా భావిస్తారు రైతన్నలు. అయితే గతంలో ఎక్కువగా ఉండే పురుగులు ... ఇప్పుడు తగ్గిపోయాయంటున్నారు. రెడ్ బగ్స్‌ గురించి తెల్సుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, తగిన చర్యలు తీసుకోకపోతే ... భవిష్యత్తులో ఆరుద్ర పురుగులంటే పుస్తకాల్లోనో, ఇంటర్‌నెట్‌లోనో చూడడం తప్ప మరో గత్యంతరం ఉండదు.

15మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంఉప ఎన్నికల్లో గెలుపొందిన 15మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ ...
22/06/2012

15మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ఉప ఎన్నికల్లో గెలుపొందిన 15మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారితో విడివిడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు.

ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలను అత్యథిక మెజార్టీతో గెలిపించినందుకు విజయమ్మ ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రజా పక్షాన ఉంటుందన్నారు. వైఎస్ ఆశయాలను సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజాకోర్టులో వైఎస్ జగన్ నిర్దోషి అని ప్రజలు తీర్పు ఇచ్చారని, త్వరలోనే ఆయన కేసుల నుంచి బయటపడతారని విజయమ్మ అన్నారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దీక్ష, అరెస్ట్మహాత్ముడి సాక్షిగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కనివిని ఎరగని రీతిలో అసెంబ్లీలోనే ఎమ...
21/06/2012

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దీక్ష, అరెస్ట్

మహాత్ముడి సాక్షిగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కనివిని ఎరగని రీతిలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. వైఎస్ జగన్‌పై సీబీఐ అక్రమ కేసులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన దీక్షకు దిగారు. చాలాసేపు ఎమ్మెల్యేలను గాంధీ విగ్రహం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ విషయంలో స్పీకర్‌ తీరుపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలమైన తాము శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. గాంధీ విగ్రహాన్ని కూడా నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. కాగా దీక్షకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

YSRCP MLAs deeksha,Arrest at assembly

అలరిస్తున్న సత్యమేవ జయతేమిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఏ ముహూర్తాన 'సత్యమేవ జయతే' ఆరంభించారో కానీ అన్ని వర్గాల వ...
20/06/2012

అలరిస్తున్న సత్యమేవ జయతే

మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఏ ముహూర్తాన 'సత్యమేవ జయతే' ఆరంభించారో కానీ అన్ని వర్గాల వారిని ఆ ప్రోగ్రామ్‌ విశేషంగా అలరిస్తోంది... పార్లమెంట్‌ సైతం ఈ కార్యక్రమానికి స్పందించి ఆమిర్‌కు ఆహ్వానం పంపింది...దీనిని బట్టే 'సత్యమేవ జయతే' ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందో ఊహించవచ్చు...

ఆమిర్‌ ఖాన్‌ నిర్వహిస్తున్న 'సత్యమేవ జయతే' కార్యక్రమం అన్నివర్గాలవారిని విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, ఇందులో ఆమిర్‌ ఎంచుకుంటున్న అంశాలపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది... ఈ కార్యక్రమంలో మరికొన్ని అంశాలను చేరిస్తే బాగుంటుందని పార్లమెంట్‌ భావించింది... ఈ విషయమై ఆమిర్‌తో చర్చించాలని ఉన్నత చట్టసభ అభిప్రాయపడి ఆయనకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది...

విదేశీ పెట్టుబడులను మన ఫార్మాస్యూటికల్‌ సెక్టార్‌కు నేరుగా మల్లించడంపై ఆమిర్‌తో పార్లమెంట్‌ చర్చించనుందని తెలుస్తోంది... ఆ మధ్య మనదేశంలో సాగుతున్న చట్టవిరుద్ధమైన వైద్యవిధానాన్ని ఆమిర్‌ తన కార్యక్రమంలో ఎండగట్టాడు... ఈ విషయంలో ఆమిర్ క్షమాపణ చెప్పాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది... అయితే ఈ విషయంలో ఎంతోమంది మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, ప్రజలు ఆమిర్‌కు మద్దతుగా నిలిచారు... ఈ ఒక్క అంశమే కాదు ఆమిర్‌ తన కార్యక్రమంలో చర్చించిన భ్రూణ హత్యలు, బాలలపై లైంగిక వేధింపులు, గృహ హింస వంటి అంశాలు కూడా సంచలనం రేకెత్తించాయి... ఈ విషయాలే పార్లమెంట్‌ను సైతం ఆకర్షించడం వల్ల ఆమిర్‌తో మరిన్ని ప్రజా ఉపయోగకరమైన అంశాలపై చర్చించాలని భావించి, ఆయనకు ఆహ్వానం పంపింది... పార్లమెంట్‌ కమిటీ అధినేత శాంతాకుమార్‌ ఈ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది... పార్లమెంటరీ అఫైర్స్‌ మినిస్టర్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం ఈ విషయం గురించి తనకేమీ తెలియదని అంటున్నారు... ఏది ఏమైనా ఆమిర్‌ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు... మరి పార్లమెంట్‌ ఆయనతో ముచ్చటించే అంశాలపై 'సత్యమేవ జయతే'లో ఎలాంటి ఎపిసోడ్స్‌ రూపొందుతాయో చూడాలి...

Satyamev Jayate impact: Aamir Khan invited to Parliament

అనంతపురం లో కానిస్టేబుల్ వీరంగంఅనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పెళ్లిపేరుతో అమ్మాయిని లొంగదీసుకొని ...
20/06/2012

అనంతపురం లో కానిస్టేబుల్ వీరంగం

అనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పెళ్లిపేరుతో అమ్మాయిని లొంగదీసుకొని ఆతర్వాత మొహం చాటేశాడు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన ప్రియురాలిని చూసి స్టేషన్‌ గోడదూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తోటి కానిస్టేబుళ్లు అతగాడిని పట్టుకోని కటకటాల్లో పెట్టారు.

ఫ్యాక్షన్‌ గ్రామమైన కామిరెడ్డిపల్లిలో కానిస్టేబుల్‌ బాషా పికటింగ్‌ నిర్వహిస్తున్నాడు. డ్యూటీ చేయాల్సిన బాషా.... అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో మునిగాడు. పెళ్లిపేరుతో ప్రేమయాత్రలు చేశాడు. తీరా ఆ యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయటంతో నిరాకరించాడు. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ప్రియురాలిని చూసిన ప్రియుడు స్టేషన్‌ గోడదూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

Lady Police Constable Love at Anantapur

వేణు చెబుతున్న బొత్స తీన్ మార్అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిన బొత్స సత్యనారాయణ తీన్‌మార్‌ కథ ఇది..! లిక్కర్ దందా, ఇసుకదం...
20/06/2012

వేణు చెబుతున్న బొత్స తీన్ మార్

అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిన బొత్స సత్యనారాయణ తీన్‌మార్‌ కథ ఇది..! లిక్కర్ దందా, ఇసుకదందాలు చేస్తున్నట్లు విమర్శలున్న సత్తిబాబు... సైలంట్‌గా సినిమాలు తీస్తున్నారు..! బొత్స సినిమా బిజినెస్‌కు బినామీ... బండ్ల గణేష్‌.! ఇది ఎవరో చెబుతున్న మాటలు కాదు..! బొత్స అవినీతిపై విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఎమ్మెల్యే వేణుగోపాలచారి చెబుతున్న - రియల్‌ స్టోరీ..!

బండ్ల గణేష్‌ మర్డర్‌ చేసినా- బొత్స రక్షిస్తారా..? ఏం మాటలివి..! తీన్‌మార్‌ ఆడియో ఫంక్షన్‌లో ఇన్ని మాటలు మాట్లాడే ధైర్యం- బండ్ల గణేష్‌కు ఎక్కడిది..? అని అప్పట్లోనే అందరూ ముక్కున వేలేసుకున్నారు. అభిమానం ఉంటే ఉండొచ్చేమోగానీ... మరీ ఇంత బరితెగింపా..? ఈ మాటల్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు- ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి. బొత్స అవినీతిపై విచారణ జరిపించాలంటూ - ఆయన హైకోర్టును కోరారు.
బండ్ల గణేష్‌ తన మనిషి అని బొత్స సత్యనారాయణ చెప్పారు. పైగా అయితే ఏంటట అనేవిధంగా విజయనగరంలో మాట్లాడారు.

బొత్సతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే- బండ్ల గణేష్‌- పలువురిని బెదిరిస్తున్నాడని- వేణుగోపాలచారి తన పిటిషన్లో వివరించారు. క్రౌన్‌ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్లయిన సుబ్బారావు, మధుసూధనరావులకు 91లక్షల 50వేల రూపాయలు మోసం చేశాడని తెలిపారు. ఇచ్చిన డబ్బు కావాలని అడిగితే- తీవ్ర పరిణామాలుంటాయని- గణేష్‌- వారిని బెదిరించాడని చెప్పారు. గణేష్‌కు భయపడి... సుబ్బారావు- ఈ ఏడాది మే నెల ఐదో తేదీన CCS పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, ఇంతవరకు ఎటువంటి చర్య లేదని- వేణుగోపాలచారి - హైకోర్టు దృష్టికి తెచ్చారు.

బొత్స అండదండలతో- బండ్ల గణేష్‌- ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని- 2700 గజాల భూమి విక్రయ వ్యవహారంలో- ఇలాగే బెదిరించాడని- ఎమ్మెల్యే పిటిషన్‌లో తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై బండ్ల గణేష్‌ ఇంతవరకు మూడు సినిమాలు తీశారు... కాదు కాదు బొత్స తీయించారు. ఆ సినిమాలు- ఆంజనేయులు, తీన్‌మార్‌, గబ్బర్‌సింగ్‌. నష్టాలమీద నష్టాలు వచ్చినా... ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలను బండ్ల గణేష్‌ ఎలా ఖర్చుపెట్టగలిగాడు..? సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న బండ్ల గణేష్‌కు- ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడివి..! గణేష్‌ వెనుకున్న అదృశ్య హస్తం ఎవరిది..?

బొత్స, బండ్ల గణేష్‌ మధ్య బినామీ బంధాన్ని తేల్చాలనీ- వేణుగోపాలచారి కోర్టు మెట్లెక్కారు. లిక్కర్‌ దందా, సినీ బినామీతోపాటు- బొత్సకు ఇసుక మాఫియాతో బలమైన బంధం ఉందని- వేణుగోపాలచారి తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై బండ్ల గణేష్‌తో సినిమా తీయిస్తున్న "తీన్‌మార్ బొత్స" భరతం పట్టాలని- వేణుగోపాలచారి 105 పేజీల పిటిషన్లో కోరారు...

దర్యాప్తు నిస్పాక్షికంగా జరగాలంటే.. సీబీఐకి ఈ కేసును అప్పగించాలని వేణుగోపాలాచారి కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ, సీబీఐ, ఐటీశాఖలను ప్రతివాదులుగా పిటిషన్‌లో ప్రస్తావించారు.

Venugopalachary Petition Against Botcha in High Court

చిరంజీవికి నాన్బెయిలబుల్ వారెంట్కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి తమిళనాడు హోసూర్ జ్యూడిషియల్ మెజిస్ట్ర...
20/06/2012

చిరంజీవికి నాన్బెయిలబుల్ వారెంట్

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి తమిళనాడు హోసూర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2011 తమిళనాడు ఎన్నికల్లో పరిమితికి మించి వాహనాలు వాడారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం గత నెల 7వ తేదీన చిరంజీవి కోర్టు హాజరు కావల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాకపోవటంతో నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీలోపు చిరంజీవి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Non Bailable Warrant against Chiranjeevi

Address


Alerts

Be the first to know and let us send you an email when Sakshi Television posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share