07/08/2025
ప్రెస్ మీట్..
తేది:07.08.2025
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం,
హన్మకొండ జిల్లా.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ...
ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాబావ పరిస్థితి చూస్తుంటే చాలా నిరాశ జనకంగా రైతులకు తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షభావ పరిస్థితులు ఉన్నాయి.
వర్షాలు పడిన పడుకున్న రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించలానే సదుద్దేశ్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచిన్నప్పటి నుండి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క నిరూపయోగమైన ప్రాజెక్ట్ గా చూపెట్టాలానే ఒక్క దురుద్దేశ్యంతో దాదాపు రెండు సంవత్సరాల నుండి పంపులను ఆన్ చెయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా చేయడానికి అహర్నిశలు పనిచేస్తునది అని చెప్పడానికి నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సమికృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది.
అసలు సమావేశం ఎందుకు జరుగుతుంది ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఉన్న నీళ్లను ఎవరికీ ఏ పద్ధతిలో ఇవ్వాలనే అధికారులు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలకి నిన్న చూపిన గణంకాలలో ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపు లేదు.
ఎందుకంటే LMD లో నీళ్ళు లేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్ళు లేవు అని కాబట్టి మాటలు చెప్పి చేతులు దులుపుకునే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
మీ కక్ష, మీ పట్టింపు అన్ని కూడా కెసిఆర్ గారి మీద పెట్టి ఘోష్ కమిటీ వేసి ఏకపక్షం గా నివేదిక ఇచ్చినట్టు మీ లీకులు చూస్తే అర్ధం అవుతుంది.
కానీ ఒక్క రైతుగా నేను బాధపడుతున్న,ఈ వర్షాలు చూస్తుంటే ఇప్పటికి సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు అయింది.
గోదావరి నదిలో ప్రతి రోజు లక్ష నుండి లక్షా యాభైవేల క్యూసెక్కుల నీరు వృధాగా పోయి సముద్రంలో కలిసి పోతుంది.
మిమ్మల్ని రైతులు నమ్మి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, రైతు బందు రూ. 15,000/- ఇస్తారని,బోనస్ ఇస్తారని ఆశపడి ఓట్లు వేసిన పాపానికి రైతుబంధు రాం రాం చేసిండ్రు.
రుణమాఫీ కొంతమందికి ఏగొట్టిరు.
చివరకు నీళ్లు అయినా ఇస్తారని అనుకుంటే అవి కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు.
ఎందుకండీ రైతుల మీద ఇంత కక్ష.
రేవంత్ రెడ్డి అంటుంటాడు నేను రైతు బిడ్డను అని నువ్వు రైతు బిడ్డవి కాదు,రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మంత్రి అని చెప్తా ఉన్నావు కదా నీ