Nellore Media

  • Home
  • Nellore Media

Nellore Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nellore Media, Media/News Company, .

తిరుమల కొండపై శ్రీవారి సహజ శిల ఇది. దూరం నుంచి చూస్తే శ్రీవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ విగ్రహం, శ్రీవారి మోహము...
27/06/2025

తిరుమల కొండపై శ్రీవారి సహజ శిల ఇది. దూరం నుంచి చూస్తే శ్రీవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ విగ్రహం, శ్రీవారి మోహము, తలపై కిరీటంతో ఓ చెక్కిన శిల్పంలా సాక్షాత్కరిస్తుంది. తిరుపతి నుండి తిరుమల చేరుకునే ఘాట్ రోడ్డులో చివరి మలపు నుంచి గమనిస్తే దూరంగా శ్రీవారి సహజ శిల కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేక పర్వదినాలలో స్థానికులు పూజలు చేస్తారు.

వాహనంపై త్రివర్ణ పతాకం ఎగరవేసే హక్కు అందరికి ఉందా..! ఈ తప్పులు చేస్తే 3 ఏళ్ల జైలు.. నిబంధనలు ఏమిటంటే..దేశం స్వాతంత్య దిన...
14/08/2024

వాహనంపై త్రివర్ణ పతాకం ఎగరవేసే హక్కు అందరికి ఉందా..! ఈ తప్పులు చేస్తే 3 ఏళ్ల జైలు.. నిబంధనలు ఏమిటంటే..

దేశం స్వాతంత్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతుంది.

ఈ నేపధ్యంలో ఆగస్టు 15కి ముందు ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో త్రివర్ణ పతాకంతో తమ సెల్ఫీని ‘harghartiranga.com’లో అప్‌లోడ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే జాతీయ జెండా ఎగర వేయడంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.

వీటిని ఉల్లంఘిస్తే శిక్ష విధించే నిబంధన ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు తరచుగా తమ బైక్ లేదా కారుపై త్రివర్ణ పతాకాన్ని ఉంచుతారు. అయితే ఇలా ప్రతి ఒక్కరూ జెండా ఎగరవేయడానికి అనుమతిలేదు.

💥ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం తమ వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే చట్టబద్ధమైన హక్కు ఉంది.

💥వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అధికారం ఎవరికి ఉంది?

త్రివర్ణ పతాకాన్ని ఎక్కడైనా ఎగురవేసేటప్పుడు జెండా పైభాగంలో కాషాయం రంగు ఉండాలని జాతీయ జెండా కోడ్ చెబుతోంది. అంతేకాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ఎగరవేయకూడదు.

ఇప్పుడు జాతీయ జెండాను ఎవరి వాహనంపై ఎవరు ప్రదర్శించ వచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం.. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002లోని పేరా 3.44 ప్రకారం కార్లపై జాతీయ జెండాను ఎగురవేసే హక్కు క్రింది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడింది.

దేశ అధ్యక్షుడు

దేశ ఉపాధ్యక్షుడు

గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్

ఇండియన్ మిషన్ పోస్టుల అధిపతులు

ప్రధాన మంత్రి

కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర ఉప మంత్రులు

ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రి

భారత ప్రధాన న్యాయమూర్తి

సుప్రీం కోర్టు న్యాయమూర్తి

హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి

హైకోర్టుల న్యాయమూర్తులు

💥నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష ఏమిటంటే...💥

పౌరులకు ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి లేదా తమ చేతుల్లో జెండా పట్టుకుని నడవడానికి స్వేచ్ఛ ఉంది. అయితే ప్రైవేట్ వాహనాలపై జెండాలు పెట్టడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఈ నేరానికి పాల్పడినట్లు తేలితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవచ్చు. దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి భారత జాతీయ చిహ్నాలను అవమానించిన వ్యక్తికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

💥జాతీయ జెండాను అవమానించినందుకు శిక్ష

💥ఇంట్లో జెండా ఎగరవేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థ లేదా విద్యాసంస్థలోని సభ్యులెవరైనా ఏ రోజు, ఏ సందర్భంలోనైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించినా దానికి పూర్తి గౌరవం ఇవ్వాలి. జాతీయ జెండాను సరైన స్థలంలో ఉంచాలి. అంటే జాతీయ జెండాను నేలపై లేదా మురికి ప్రదేశంలో ఉంచరు. అంతేకాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు.

రాత్రి సమయంలో జాతీయ జెండాను అవనతం చేయాలా?
------------------------------------------
ఇంతకుముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి ఉండేది. అయితే 2022 లో ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు జెండా ఎగురవేసేందుకు ఎలాంటి సమయ పరిమితి లేదు.

సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం పాలిస్టర్ క్లాత్‌తో తయారు చేసిన జెండాను ఎగురవేయడంపై నిషేధం తొలగించబడింది. జాతీయ జెండాను పత్తి/పాలిస్టర్/ఉన్ని/ పట్టు/ఖాదీ బంటింగ్‌తో తయారు చేయవచ్చు.

చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన జాతీయ జెండాలను కూడా ఉపయోగించవచ్చు.

జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే. కార్తీక్నెల్లూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా కే కార్తీక్ బుధవారం ఉదయం క...
14/08/2024

జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే. కార్తీక్

నెల్లూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా కే కార్తీక్ బుధవారం ఉదయం కలెక్టరేట్లోని వారి చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.

విజయనగరం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నెల్లూరుకు బదిలీపై వచ్చిన జెసి కార్తీక్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పోలీస్ కవాతు రిహార్సల్స్ పరిశీలించిన జిల్లా యస్.పి. కృష్ణకాంత్
14/08/2024

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పోలీస్ కవాతు రిహార్సల్స్ పరిశీలించిన జిల్లా యస్.పి. కృష్ణకాంత్

మీరు ఏమంటారు..?కామెంట్ చేయండి..!
17/03/2024

మీరు ఏమంటారు..?
కామెంట్ చేయండి..!

14/03/2024

పులివెందుల - జగన్
కుప్పం - చంద్రబాబు
హిందూపురం - బాలకృష్ణ
పిఠాపురం - పవన్ కళ్యాణ్
మంగళగిరి - లోకేష్

ఈ సారి ఎన్నికల్లో ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు..?

కామెంట్ చేయండి..!

Command Control Centre in Nellore Municipal Corporation
25/01/2024

Command Control Centre in Nellore Municipal Corporation

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మువ్వన్నెల రంగుల్లో ముస్తాబైన నెల్లూరు జిల్లా కలెక్టరేట్..
25/01/2024

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మువ్వన్నెల రంగుల్లో ముస్తాబైన నెల్లూరు జిల్లా కలెక్టరేట్..

అద్భుతం జరగక ముందు ఎవరూ గుర్తించరు..అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు..!మన అయోధ్య రామయ్య విషయంలోనూ ఇదే జరిగింది...
25/01/2024

అద్భుతం జరగక ముందు ఎవరూ గుర్తించరు..
అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు..!

మన అయోధ్య రామయ్య విషయంలోనూ ఇదే జరిగింది.

19/01/2024

జై శ్రీరామ్.. జైశ్రీరామ్..
అయోధ్య రాముడి దివ్యరూపం ఇదేనా..!
=====================
అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో కొలువుదీరనున్న రాముడి దివ్యరూపం ఇదేనా..? ఏమో తెలియదు గానీ.. ఈ ఫొటోలోని బాలరాముని రూపాన్ని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. చాలామంది ఇప్పటికే ఈ ఫోటోను వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు. స్టేటస్ లో పెట్టుకొని జై శ్రీరామ్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

23/04/2023

నెల్లూరులో గాలి, వాన భీభత్సం..
వణుకు పుట్టిస్తున్న వీడియో..!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Nellore Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share