SSC Channel

SSC Channel SSC News Is a local channel From Siddipet. The Channel dedicated for entertainment like music, movie

23/10/2024

కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి. యెలహంక, అల్లాలసండ్రలో రోడ్లపై వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన చేపలను పలువురు పట్టుకుంటున్నారు. కొందరైతే వలలు వేసి మరీ ఫిషింగ్ చేస్తున్నారు. హెబ్బాల, హెన్నూరు, నాగవార, ORR లాంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. కర్ణాటకలోని పలు జిల్లాలకు ఈ నెల 28 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. #

22/10/2024

TG: రాహుల్ గాంధీ, CM రేవంత్ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై వివరణ ఇవ్వాలని KTR సవాల్ విసిరారు. 'BRS హయాంలో 1,60,083 ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చింది? KCR హయాంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ల ఫలితాలు ఇప్పుడు వస్తే, వాటిని కూడా తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే దీనిపై చర్చించేందుకు 'అశోక్ నగర్ రావాలి' అని అన్నారు. #

21/10/2024

TG: శ్రీనివాస్ అనే పేరు ఎవర్రోన్. ఎన్ని తరాలు మారినా ఈ పేరు మాత్రం పిల్లలకు పెట్టకుండా ఉండలేరు. తాజాగా జగిత్యాలలో ఆసక్తికర ఘటన జరిగింది. శ్రీనివాస్ అనే పేరున్న 250 మంది ఒకేచోట కలుసుకున్నారు. సుమారు వెయ్యి మందితో 'శ్రీనివాసుల సేవా సమితి' అనే గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇవాళ 250 మంది సమావేశానికి హాజరయ్యారు. సమితి ద్వారా అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు, పేదలకు సేవలు చేస్తున్నామని చెప్పారు.

21/10/2024

TG: గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని KTR అన్నారు. 'గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు. సంజయు భద్రత ఇచ్చి రేవంత్ ర్యాలీ చేయించారు. సంజయ్ ఏం చదువుకున్నారు. ఆయనను చర్చలకు పిలిచినా లాభం ఉండదు. పరీక్షల గురించి ఆయనకేం తెలుసు? పేపర్లు లీక్ చేయడం మాత్రమే తెలుసు' అని విమర్శించారు. 🙂🙂🙂🙂🙂🙂

19/10/2024

ఓ బండరాయిలో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్న తల్లి కుక్కను సినీ ఫైటర్లు కాపాడి దాని పిల్లల వద్దకు చేర్చారు. మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్క పిల్లలు ఏడుస్తున్నాయని చూసేందుకు వెళ్లిన వారు తల్లి కుక్క కోసం చుట్టుపక్కల వెతగ్గా పక్కనే ఉన్న రాతిబండ మధ్యలో కనిపించింది. వెంటనే యంత్రం సాయంతో రాయిని కదిపి కుక్కను బయటికి తీసి పిల్లల వద్దకు చేర్చారు.

18/10/2024

TG: మూసీ పరీవాహకంలోని నివాసితులకు నష్టం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని CM రేవంత్ పేర్కొన్నారు. వారికి కష్టం, నష్టం కలగకుండా ఏ భవనాలకు ఏ మేర పరిహారం ఇవ్వాలో అంచనా వేస్తామని తెలిపారు. ఈ నిర్ణయం వెల్లడించాకే వారిని ఖాళీ చేయిస్తామని ప్రకటించారు. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించేందుకు సిద్ధమన్నారు. అటు మూసీ పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఇటుకను ప్రభుత్వం తొలగించలేదని స్పష్టం చేశారు.

15/10/2024

TG: పద్మశ్రీ మొగిలయ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని పరిరక్షిస్తామని ఆయనకు రాచకొండ సీపీ సుధీర్ హామీ ఇచ్చారు. ఆ భూమిలో దుండగులు కూల్చేసిన గోడ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సీపీకి మొగిలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. హయత్ నగర్లో మొగిలయ్యకు ప్రభుత్వం 600 గజాల భూమిని మంజూరు చేయగా, దాని చుట్టూ నిర్మించిన గోడను ఇటీవల దుండగులు కూల్చేశారు. దీనిపై కేసు నమోదైంది.

11/10/2024

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సతీమణి శ్రీనిత, కూతురు పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మ తయారు చేసిన శ్రీనిత, కూతురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

11/10/2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట కోమటి చెరువు వద్ద జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. 'అక్కా చెళ్లెళ్లు సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ దేశ విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని పెంపొందించింది. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలి' అని హరీశ్ రావు ఆకాక్షించారు.

10/10/2024

చిలప్చెడ్ పోలీస్ స్టేషన్లోనే మహిళా ASI ఆత్మహత్యాయత్నం చేశారు. సుధారాణి చిలప్ చెడ్ PSలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. కాగా బుధవారం రాత్రి స్టేషన్లో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కానిస్టేబుల్ గుర్తించి వెంటనే జోగిపేట ఆసుపత్రికి తరలించారు. తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరైనట్లు ఆబ్సెంట్ వేయిస్తూ ఎస్సై వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

09/10/2024

ఈ వీడియోలో ఏం తప్పు ఉంది: KTR ఓ రైతు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఒక జర్నలిస్టుపై కేసు పెట్టడాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తప్పుబట్టారు. 'ఈ వీడియోలో అసలు తప్పు ఏమిటి? దీనికే జర్నలిస్టు గౌతం గౌడ్పై కేసు పెట్టారా? నేను ఈ రైతు మల్లయ్యను ఆయన స్వగ్రామంలో సందర్శించి, ఆయన పరిస్థితి గురించి ఆరా తీశాను. ఇప్పుడు నాపై కేసు పెడతారా?' అంటూ KTR ఆ వీడియోను షేర్ చేశారు.

08/10/2024

TG: 'మూసీ' పేరును పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ అన్నారు. పవిత్రమైన గంగ, యమున, సరస్వతి, కావేరి నదుల పేర్లు పెట్టుకుంటున్నప్పుడు మూసీ పేరును ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు. 'మూసీ కంపు కొడుతుంది, మురిగిపోయింది, విషం చిమ్ముతోంది. అందుకే ఏ తండ్రీ తన ఆడబిడ్డకు ఆ పేరు పెట్టుకోవడం లేదు. నేను ఆ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా' అని రేవంత్ అన్నారు #

Address


Alerts

Be the first to know and let us send you an email when SSC Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share