23/11/2026
🔱 ఓం నమః శివాయ… హర హర మహాదేవ్! 🔱
కాశీని తలపించే మన మాణికేశ్వరం చిన్న కాశీలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపు, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమం నిర్వహించనున్నారు.
మాణికేశ్వరం గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు, శివభక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని, భజనలో పాల్గొని, అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.
📍 శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం, మాణికేశ్వరం, అద్దంకి మండలం
📞 వివరాలకు: 9676311128