11/03/2025
ఆదిలాబాద్ టౌన్ :
అదిలాబాద్ జిల్లా ఎస్పీని కలిసిన భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ నాయకులు
మార్చ్ 11
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరవ నూతన ఎస్పీ ని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భగత్ సింగ్ నగర్ కాలనీలో 2007 నుండి ఉన్న అంబేద్కర్ జెండాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం భగత్ సింగ్ నగర్, అలాగే అదిలాబాద్ లో ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం అయినా తమా పార్టీ సహాయ సహకారాలు అందిస్తారని ఎస్పీ గారికి హామీ ఇచ్చారు. కలిసిన వారిలో పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్, & , భీమ్ ఆర్మీ (ASP) పార్టీ ఆదిలాబాద్ టౌన్ SC యువజన అధ్యక్షుడు అడ్లూరి రాజు, మహేష్ షిండే, వెంకటేష్ రోడ్ల, పాప్యా పవార్, అతిష్ వాటో రే తదితరులు పాల్గొన్నారు.