15/11/2024
కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.శుక్రవారం తెల్లవారుజామున కార్తిక స్నానాలు ఆచరించి శివాలయానికి వచ్చి మహాశివుని దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం.ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరి శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.దీంతో శివాలయం కోలాహాలంగా మారింది. శివాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో పులిహార ప్రసాదం అందజేశారు.
కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటె.....