
04/07/2025
రైల్వే స్టేషన్ లో తనిఖీలు (03.07.2025)
కర్నూల్ జిల్లా...
కర్నూలు రైల్వే స్టేషన్ , రైళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు....
ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.... అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ఐజి శ్రీ ఆకే రవి కృష్ణ ఐపియస్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారులు కర్నూలు పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా కర్నూలు రైల్వేస్టేషన్ లో మీడియాతో మాట్లాడారు.
కర్నూలు పోలీసులు , ఈగల్ టీo , స్పెషల్ పార్టీ పోలీసులు , డాగ్స్ స్క్వాడ్ బృందాలు, రైల్వే ఆర్‌పీఎఫ్ , జి ఆర్ పి పోలీసులు సంయుక్తంగా గంజాయి, మత్తు పదార్ధాల నిర్మూలనకు కర్నూలు రైల్వేస్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం కు కర్నూలు మీదుగా వెళ్లే యశ్వంతపూర్ To యోగి నగరి రిషికేష్ రైలు లో ( ట్రైన్ నెంబర్ 06597 ) జనరల్ బోగి నుండి ఎసి బోగిలను అన్నింటిని తనిఖీలు చేయడం జరిగిందన్నారు.
ఎలాంటివి లభ్యం కాలేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా కు ఒక ట్రైన్ ను కేటాయించి తనిఖీలు చేయాలని ఆదేశాలున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి, మత్త పదార్దాల నిర్మూలనకు , అక్రమరవాణాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశారని, ఈ నెంబర్‌కు సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
అనంతరం కర్నూల్ రైల్వే స్టేషన్ లోని పార్సిల్ కార్యాలయంలో డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజారావు, అబ్దుల్ గౌస్, గుణశేఖర్ బాబు, కర్నూలు టు టౌన్ ఎస్సై సతీష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం ,కర్నూల్.