18/09/2024
*ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్లను పరిశీలించిన సబ్ కలెక్టర్.:-*
*ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ .:-*
*ఆదోని/సెప్టెంబర్ :- 18*
*ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్లను బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదోని పట్టణంలో సెప్టెంబర్ 19న ప్రారంభోత్సవం అయ్యే పాత లైబ్రరీ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్, శ్రీనివాస భవన్ సమీపంలో అన్న క్యాంటీన్, ప్రసూతి హాస్పిటల్ సమీపంలో అన్న క్యాంటీన్ పట్టణంలో ఉన్న మూడు అన్న క్యాంటీన్ లను క్షేత్రస్థాయిలో సబ్ కలెక్టర్ తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్... క్యాంటీన్లలలో , ధరల పట్టిక, త్రాగు నీటి సదుపాయం, రిసెప్షన్ సెంటర్, టాయిలెట్స్, డస్ట్ బిన్ , ఎలక్ట్రిషన్ సదుపాయాలను తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని మున్సిపల్ కమిషనర్ (ఇంచార్జ్) అనుపమ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.*