21/07/2025
పథకాలు కాదు ప్రాజెక్టుల ముఖ్యం
- రాయలసీమ రాజకీయ నాయకులకు పదవులు కావాలి కానీ రైతుల సమస్యలు పట్టవా..?
- ఆదోనిలో ఘనంగా జిల్లా జల సాధన సమితి సదస్సు విజయవంతం
ఆదోని న్యూస్ : కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిధిలో లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా జలసాధన సమితి సదస్సుకు ముఖ్యఅతిథిగా రాయలసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి పాల్గొని రాయలసీమ రాజకీయ నాయకుల పై పలు విమర్శలు సంధించారు, ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సింది పథకాలు కాదని ప్రాజెక్టులు అని తెలిపారు, ప్రతి రాజకీయ నాయకులు రైతే రాజు అని ఏనాడు కూడా రైతుని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతుకు ముఖ్యంగా కావలసింది సాగునీరు తాగునీరు అని రాయలసీమ కరువు ప్రాంతం కాదని రాయలసీమకు ప్రాజెక్టులు లేక కరువు ప్రాంతంగా మారిందని, ఈ రాజకీయ నాయకులు కరువు ప్రాంతమని ప్రజలను మభ్యపెడుతూ... ప్రాజెక్టులు మన రాయలసీమలోనే ఏర్పాటు చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్ని ప్రాంతాల్లో లాగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా సమానంగా వర్షపాతం నమోదవుతుందని వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు చిన్నచిన్న ఆనకట్టలు నిర్మిస్తే నీటిని వృధా చేసుకోకుండా ప్రతి పంటకు నీరు అందుతుందని తెలిపారు రాయలసీమ రాజకీయ నాయకులకు పదవులు ముఖ్యమని ప్రాజెక్టులు కాదని ఎద్దేవా చేశారు
నంద్యాల జిల్లా పర్యటనలో జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమలో ఎన్నడు లేని విధంగా అత్యధిక సీట్లు రాయలసీమ నుండే వచ్చాయని రాయలసీమ ని సస్యశ్యామలం చేస్తాను అనడం సంతోషకరమైన విషయమని త్వరలో కమిటీని నిర్ణయిస్తే మా అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన తెలియజేశారు, తుంగభద్ర నది మా పంటలకు దగ్గరలో ఉన్న మా పంట పొలాలకు నీరు రావడంలేదని, ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో 33 గ్రామాలకు త్రాగడానికి నీరు కూడా లేక ఇబ్బందికరంగా మారిందని, కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంద్రీనీవా కాలువ నుండి త్రాగునీరుని అందించాలని కోరారు, త్రాగునీరు అందించే బాధ్యత మొత్తం ప్రజాప్రతినిధులదే అని ఆయన గుర్తు చేశారు, ముఖ్యమంత్రి ఆవేదనతో ప్రాజెక్టులపై మాట్లాడడం సరికాదని ఆలోచనతో మాట్లాడాలని రాయలసీమకు రావలసిన సాగు త్రాగు నీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జల సాధన సమితి కన్వీనర్ శేషాద్రి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు హలిగేర కేశం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వేదావతి ప్రాజెక్ట్ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి, సుజ్ఞానమ్మ, మనీ, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు
కర్నూలు జిల్లా జల సాధన సమితి ప్రత్యేక డిమాండ్లు
- త్వరలో వేదవతి ప్రాజెక్టు పనులు చేపట్టాలి
- పందికొన రిజర్వాయర్ నుండి ప్రతి రైతుకు సాగునీరు అందించాలి
- ఆస్పరి మండలానికి హంద్రీనీవా నుండి త్రాగునీరు అందించాలి
- గురు రాఘవేంద్ర పులి కనుమ ప్రాజెక్టుల ను రైతులకు ఉపయోగకరంగా ఉంచాలి
- నగరడోన రిజర్వాయర్ పనులు మొదలుపెట్టాలి
- హంద్రి కాలువ నుండి ఆస్పరి దేవనకొండ మండలాల్లో చెరువులను నీళ్లతో నింపాలి