15/03/2026
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న చర్యల ఫలితంగా దేశంలో మహిళా ఉద్యోగుల తొలి ఎంపికగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం.
ఆ స్పూర్తితో మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడేందుకు ఆళ్లగడ్డలో ఇప్పటికే రెండు విడతల్లో మహిళ జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించాం. మహిళల సాధికారత కోసం మున్ముందు నా కృషి కొనసాగిస్తాను.