09/04/2026
రాజధాని అమరావతిలో విజయవంతంగా ముగిసిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
ప్రజారాజధాని అమరావతిలో 3 రోజులపాటు జరిగిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన బుధవారంతో విజయవంతంగా ముగిసింది. ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ మిషన్‌లో భాగంగా రాజధాని నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు పర్యటిస్తున్న WB & ADB బృందం.. తమ పర్యటన ప్రణాళికలలో భాగంగా బుధవారం రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో పలు సెషన్లు నిర్వహించింది. పలు సెషన్లలో CRDA అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS గారు పాల్గొని, రాజధాని అమరావతి నిర్మాణ పనులు పురోగతి తదితర అంశాల గురించి WB & ADB బృందానికి వివరించారు.
ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, రాజధాని ప్రాంతంలో విపత్తులు సంభవించకుండా, ప్రమాదాలు జరగకుండా అమలు కావాల్సిన పటిష్ట ప్రణాళికల అమలు, రాజధాని అమరావతిలో అందరికీ అందుబాటులో హౌసింగ్ సముదాయాల కల్పన, రహదారుల నిర్వహణ, నీటి వనరులు, వ్యర్ధ జలాల నిర్వహణ, సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ప్రణాళికలు, రాజధాని అమరావతిలో అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యకమాల నిర్వహణ, ఆయా కార్యక్రమాలలో కమ్యూనికేషన్స్ విభాగం యొక్క పాత్ర తదితర అంశాలపై WB & ADB బృందం చర్చలు నిర్వహించి APCRDA అధికారులకు పలు సూచనలు చేసింది. ఆయా సెషన్లలో PgMC సిబ్బంది, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, PMC సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.