02/01/2021
*విశాఖలో ప్రారంభమైన డ్రై రన్..*
కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నేడు విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో.. పలు ఆసుపత్రులతో పాటు సింహాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్‌ను నిర్వహించనున్నారు. సుమారుగా రెండు గంటల పాటు ఈ డ్రై రన్ కొనసాగనుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు.. సుమారు 25 మందితో ఈ రోజు డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వాటిలో ఎదురయ్యే సవాళ్లను ఇబ్బందులను ఆరోగ్యశాఖకి పంపించనున్నారు.