08/02/2023
#బూమ్_రాంగ్
హబ్బబ్బా ... ఈ మాత్రం దానికి మరీ అంత #కమల్_హాసన్ అయిపోవాలా ఏంది సామీ ⁉️
🫨
'' ఓ కాంట్రాక్టర్ గురించి ఎమ్మెల్యే కోటంరెడ్డి నాతో చాలాసేపు చర్చించారు. ఆ విషయం నా ఫోన్‌లో ఆటోమేటిక్‌గా రికార్డ్ అయ్యింది. నాది ఆండ్రాయిడ్ ఫోన్ కావడంతో ఫోన్‌లో ప్రతీకాల్ రికార్డ్ అవుతుంది. నాది I-Phone అని కోటంరెడ్డి చెప్పిన మాట అవాస్తవం ... అయితే నేను, మా కాంట్రాక్టర్ల చర్చ వచ్చినప్పుడే కోటంరెడ్డి ఆడియో బయటపెట్టాను. శ్రీధర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని నేను ఈపని చేయలేదు. దీన్ని శ్రీధర్‌రెడ్డి షోన్ ట్యాపింగ్ అనడం. ఇంత అలజడి జరుగుతుందని నేను అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోందని అనుకోలేదు. హోంశాఖకు ఫిర్యాదన్న తర్వాతే నేను బయటికి రావాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కోవడం ఇష్టంలేక నేను మీడియా ముందుకొచ్చాను. నేను ఎవరో సీఎంకు అసలు తెలియదు. ఏదేదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో నా స్నేహితుడుని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎమ్మెల్యే అంటున్నట్టు నన్ను ఎవరు ప్రభావితం చేయలేదు. అంతకుమించి ఎవరి ఒత్తిడీ నాపై లేదు. నేను ఇప్పుడు ఆ ఆడియో డిలీట్ చేశాను '' - రామశివారెడ్డి
#భూమిరెడ్డి