
12/08/2025
*_ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించిన,.. ఆంధ్రప్రదేశ్ తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని వాల్మీకి..!_*🫵🏻
అనంతపురం నగరంలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని *మీఇంటికి - మీ ఎమ్మెల్యే* అంటూ నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలిచారు అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు.
ప్రజల పక్షాన నిలబడి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజానాయకుడు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని చూసి ప్రతిపక్ష నేతలకు మింగుడు పడటం లేదు, రోజురోజుకి ప్రజల్లో దగ్గుపాటి ప్రసాద్ గారికి పెరిగిపోతున్న ప్రజా ఆదరణని చూసి ఓర్వలేక పోతున్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిపై నిత్యం ఏదోఒక అసత్య ప్రచారం చేసి బురదజల్లే ప్రయత్నం చేయాలని చుస్తే సహించేది లేదు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను.🫵🏻 కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదు, గట్టిగా బుద్ధి చెబుతాం, అంతేకాకుండా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తున్నాను..
ఇన్ని రోజులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం పైనే దృష్టి పెట్టారు, కానీ ఇక నుండైనా కలుగులో దాక్కున్న ఊసరవెల్లుల్ని బయటికి లాగి ప్రజాక్షేత్రంలో వారికి బుద్ధి చెప్పేలా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను..
*సంగా తేజస్విని వాల్మీకి*
ఆంధ్రప్రదేశ్ తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి