23/09/2024
ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు ఉదయం 11 గం. నుంచి 12గం.30.ని. వరకూ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన బదిలీలపై పేషీ అధికారులతో సమీక్షించారు.
• డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సి.ఈ.ఓ., డి.ఎల్.డి.ఓ. బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృ శాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామం అని ఉప ముఖ్యమంత్రివర్యులు అభిప్రాయపడ్డారు.
• బదిలీలకు ఉద్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించడం మూలంగా ఇప్పటి వరకూ అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం... అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేయడంపట్ల శ్రీ పవన్ కల్యాణ్ గారు సంతృప్తి వ్యక్తం చేశారు.
• అదే విధంగా బదిలీల ప్రక్రియపై వచ్చిన స్పందన, వాటిపై వచ్చిన వార్తా కథనాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు.
• వార్తా కథనాల్లో ప్రస్తావించిన అంశాలపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ పోస్టింగ్స్ ఇవ్వడానికిగల కారణాలను పేషీ అధికారులు వివరించారు.
Andhra Sena