26/06/2025
దేశ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులు రోడ్లు భవనాలు నిర్మించిన అనంతపురానికి చెందిన యస్సార్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (SRC) పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆ కంపెనీ ఫౌండర్ మరియు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గంలో జరిగిన ఈ స్టాంప్స్ కుంభకోణం బయటికి తెచ్చిందే మేము అలాంటిది మా పై బురదజల్లడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని ఆయన తెలిపారు. ఈ స్టాంప్స్ వ్యవహారం పై ప్రభుత్వం సిట్ లేదా సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు మీడియాకు తెలిపారు,మొత్తం వ్యవహారం వెనుక ఎవరో పెద్ద వ్యక్తి ఉండి మా సంస్థ పై మరియు నా పై వ్యక్తిగత లేదా రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.