Hello Anantapur

Hello Anantapur anantapur updates anantapur news

అనంతపురం  ఫ్లై ఓవర్ బ్రిడ్జ్
29/05/2023

అనంతపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్

జిల్లా కేంద్రంలో వరద నీటి ఉధృతితో ఇళ్లల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడిన పోలీసులు* జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛ...
12/10/2022

జిల్లా కేంద్రంలో వరద నీటి ఉధృతితో ఇళ్లల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడిన పోలీసులు

* జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో నగర పోలీసులు మరియు స్పెషల్ పార్టీ పోలీసులు నీట మునిగిన కాలనీల్లో కలియ తిరిగారు

* వరద నీటి ఉధృతితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దయనీయ స్థితిలో ఉన్న వృద్ధులు, పిల్లలు, మహిళల్ని రక్షించారు

* నిస్సహాయ స్థితిలో ఇళ్లల్లోనే జల దిగ్బంధనానికి గురైన పిల్లలను, వృద్ధులను భుజాన ఎత్తుకొచ్చారు

* అనంతపురం 4 వ పట్టణ మరియు 3 వ పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి.మనిషి మునిగే ప్రవాహంలో సైతం లెక్కచేయకుండా రోప్ లు ఉపయోగించి ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేసి సురక్షితం చేశారు.



క్రింది స్థాయి సిబ్బందితో పని చేయించే శక్తి ఉన్న మంచి పని కోసం ముందుండి మీ కేడర్ను పక్కనపెట్టి సహాయం చేస్తున్న డి.ఎస్.పి...
06/10/2022

క్రింది స్థాయి సిబ్బందితో పని చేయించే శక్తి ఉన్న మంచి పని కోసం ముందుండి మీ కేడర్ను పక్కనపెట్టి సహాయం చేస్తున్న డి.ఎస్.పి శ్రీనివాసులు సార్ గారికి మరియు పోలీసు వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

26/09/2022
అనంతపురం హైవే హైదరాబాద్ చెఫ్  రెస్టారెంట్ నందు ఐచర్  ఇతర వాహనం డివైడర్ పై ఉన్న దృశ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ...
21/09/2022

అనంతపురం హైవే హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ నందు ఐచర్ ఇతర వాహనం డివైడర్ పై ఉన్న దృశ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు

అనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది * అమ్మ, నాన్న చనిపోవ...
17/09/2022

అనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది

* అమ్మ, నాన్న చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించారు

* బూజు పట్టిన ఇల్లు .. జడలు కట్టిన జుట్టుతో దుర్గంధం వెదజల్లుతూ శ్మశాన వాటికను తలపిస్తోన్న వాతావరణం నుండీ జన జీవనంలోకి తెచ్చిన అనంతపురం పోలీసులు

** వివరాలు...

అనంతపురం నగరం వేణుగోపాల్ నగర్ ఆటో స్టాండ్ సమీపాన ఉన్న ఓ ఇంట్లో ముగ్గురు సభ్యులున్న కుటుంబం గత రెండేళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇంట్లోనే మగ్గుతున్నారు. వీరి తండ్రి మూడేళ్ల కిందట చనిపోవడంతో ఈ ముగ్గురూ డిప్రెషన్ లోకి వెళ్లారు. అప్పటి నుండీ ఆ ఇళ్లు తలుపులు వేసినవి వేసినట్లే ఉంటున్నాయి. బిల్లు చెల్లించక పోవడంతో కరెంటు సైతం కట్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా అంధకారంలోనే జీవిస్తున్నారు. జుట్టు పెరిగి జడలుగా అట్టకట్టాయి. గోర్లు విపరీతంగా పెరిగాయి. స్నానం లేదు. ఇళ్లంతా దుర్గంధం. లోపల శ్మశాన వాతావరణం తలపిస్తోంది ఈక్రమంలో విపరీతమైన దుర్గంధం బయటికి వెదజల్లడంతో స్థానికులు గమనించారు. ఈవిషయం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి దృష్టికి వచ్చింది. అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి శంకర్ రెడ్డి, సిబ్బంది, మరియు స్థానిక కార్పొరేటర్ సుజాత, స్థానికులు సంయుక్తంగా ఆ ఇంటిని ఈరోజు సందర్శించారు. ఇరుగు పొరుగు వారి సహాయముతో మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ చేశారు. తరువాత వారిని ఒప్పించి వారికి స్నానాలు చేయించారు. కొత్త దుస్తులు మరియు నిత్యావసర వస్తువులను ఇప్పించి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. పోలీసుల మానవత్వం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Hello Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hello Anantapur:

Share