16/02/2025
సైబర్ మోసాలపై అనంతపురం జిల్లా ఎస్పీ సమరం... సైబర్ నేరాల కట్టడికి ప్రజల్లో అవగాహన తేవడమే ఎస్పీ ధ్యేయం*
💥 *ప్రజల్లో అవగాహన తేవడానికి సిద్ధం చేసిన టాంటాం ఆటోలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో 17 టాం టాం ఆటోలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*
💥 *జిల్లా అంతటా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు ఒకే సమయంలో 70 టాంటాం ఆటోలను ప్రారంభించిన ఆయా పోలీసు అధికారులు*
💥 *జిల్లా ఎస్పీ గారి ప్రసంగం* :
సైబర్ సురక్ష (మన భద్రత... మన బాధ్యత) లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈనెల 13 వ తేదీన 3 డిజిటల్ వాహనాలు ప్రారంభించి సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సూచించే వీడియోలను డిస్ప్లే చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నాం. అనంతపురం జిల్లా కేంద్రంలో నిన్న, మొన్న సుమారు 10 వేల మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ఈ వాహనాలు పంపి సైబర్ నేరాలపై అవగాహన చేశాం. తాజాగా... సైబర్ సురక్ష కార్యక్రమంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా అంతటా టాంటాం ఆటోలను తిప్పేలా ఉపక్రమించాం. మంచి చదువరులు, నిరక్షరాస్యులు మరియు పిల్లలు, పెద్దలు, వృద్ధులు... ఇలా అన్ని వర్గాల ప్రజలలో చైతన్యం చేయడమే జిల్లా పోలీస్ లక్ష్యం. పనుల్లో నిమగ్నమై తీరిక లేక డిజిటల్ వాహనాలు ద్వారా ప్రదర్శించే వీడియోలు చూడలేని వారి కోసం టాంటాం ఆటోల ద్వారా ఆడియో వాయిస్ విన్పించి చైతన్యం చేయాలన్నదే ఆకాంక్ష. పబ్లిక్ రీడ్రస్సెల్ సిస్టం ఆటోలలో ఉంచి గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపట్టణాలలో తిప్పి సైబర్ నేరాల అప్రమత్తతపై ప్రజలకు వాయిస్ విన్పించేలా చర్యలు తీసుకున్నాం.
సాధారణ నేరాలలో పోయే సొత్తుల విలువ కంటే అధిక రెట్లు సైబర్ నేరాలలో ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారు. చాలా సైబర్ నేరాలు జరిగిన తీరును విశ్లేషిస్తే ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడం, దురాశల వల్లే ఈ నేరాలు చోటు చేసుకుంటున్నట్లు అవగతమయ్యింది. అందుకే విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేస్తాం.