
09/11/2023
ఇంటాక్ ఆధ్వర్యములో ప్రపంచ వారసత్వ వారోత్సవాలలో ఫోటోగ్రఫీ పోటీలు
నవంబరు 20 -11 -2023 నుండి 26-11-2023
వరకు అనంతపురములో జరుగు ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో విద్యార్థులకు, పోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించబడును. కెమెరాల ద్వారా లేదా మొబైల్ ద్వార చిత్రీకరించిన ఫోటీలను 8X12 ఇంచుల ఫోటో ప్రింట్లను ఆహ్వానించుచున్నారు. పోటీలలో విజయం సాధించిన ముగ్గురికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను 26-11-2023 ముగింపు ఉత్సవాలలో బహుకరించబడును. ఫోటోగ్రఫీ విషయము ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రాచీన చారిత్రక కట్టడాలు, కోటలు, దేవాలయాలు, మసీదులు, దర్గాలు, చెరువులు, పురాతన సమాధులు, భవనాలు గుహలు, విగ్రహాలు మొ|| వాటికి సంబంధించినవై ఉండాలి. ఎంట్రీలు పంపవలసిన చివరి తేది 15.11. 2023 మరిన్ని వివరాలకు శ్రీనిధి రఘు 9440285480 S.రషీద్ భాషా 9676350 681 సంప్రదించగలరు.
దీనికి సంబంధించిన గోడ పత్రికను 9-11. 2023 న ఇంటాక్ సంస్థ కార్యాలయంలో అవిష్కరించబడినది. ఈ కార్యాక్రమంలో ఇంటాక్ కన్వీనర్ అడ్వకేట్ శ్రీరామ్ కుమార్ కంబదూరి షేక్ నబీ రసూల్, శ్రీనిధి రఘ, రషీద్ బాషా (చిత్ర దర్శకుడు) తదితరులు పాల్గోన్నారు.