SRDNews

SRDNews Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SRDNews, Media/News Company, Vishal Megha Mart, Beeramguda.

//SUN RISES IN DARK //A news channel is a specific type of media channel within an individual's repertoire that is prioritized for accessing national news content.

25/07/2026

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్తుపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యం చెప్పారు. లఘ్న కుండలి ప్రకారం.. సీజేపీ జోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు. అందువల్లే పార్టీకి విపరీతమైన క్రేజ్, అటెన్షన్ వస్తున్నాయని చెప్పారు. కాలసర్ప సహిత రాజయోగం కనిపించిన పార్టీ సీజేపీ అన్నారు. 2026 అక్టోబర్ 31 వరకు ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పారు. రాశిచక్రం పరిశీలిస్తే విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు.

23/07/2026

మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలకు గోదావరి ఉప్పొంగుతోంది. రామ్కుండ్ సహా పలు ఘాట్లు, ఆలయాలు నీటిలో మునిగాయి. పలు డ్యామ్లలోకి భారీగా నీరు చేరుతోంది. కాగా ఎగువన వరదలతో గోదావరి పోటెత్తుతుండటంతో కిందనున్న TGలోని రైతులకూ మేలు కలుగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 'కన్నెపల్లి' నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడానికి GOVT కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే.

22/07/2026

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పంట కొనకపోవడంతో గోడ కూలి మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మే 6న మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలంలో పంటలను కాపాడుకునేందుకు వెళ్లి మృతి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఈ సహాయాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన రైతు సదస్సులో కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు.

21/07/2026

ప్రాణాలు కాపాడే CPR.. ఇలా చేయాలి!..
అత్యవసర పరిస్థితుల్లో CPR చేస్తే వ్యక్తి బతికే అవకాశం మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఎలా చేయాలో వివరిస్తూ డాక్టర్ శివరంజని చేసిన వీడియో వైరలవుతోంది. 'వ్యక్తి శ్వాస ఆగిపోయినప్పుడు మాత్రమే CPR చేయాలి. ఛాతీ మధ్య భాగంలో అరచేతితో 30సార్లు ప్రెస్ చేయాలి. తర్వాత నోటిని ఓపెన్ చేసి శ్వాస అందించాలి. ఇలా రిపీట్ చేయాలి. పిల్లలకు అయితే బొటన వేళ్లతో ప్రెస్ చేయాలి' అని సూచించారు.

20/07/2026

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వకపోతే ఆ పార్టీ నాయకుల మెడలోంచి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పోలీసులు కేసు పెడితే తనవద్దకు రావాలన్నారు. ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వకపోతే, తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి ఇస్తానన్న హామీ మేరకు ఇప్పటివరకు 3 వేల ఇళ్లను కేంద్రం వాటాతో కట్టించానన్నారు.

19/07/2026

బోనాల పండుగ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. ఆలయాలు, ఊరేగింపు మార్గాల్లో పోలీసులకు సహకరించాలని తెలిపారు. భక్తి, క్రమశిక్షణతో బోనాలు నిర్వహించి ప్రశాంత వాతావరణం కొనసాగించేలా ప్రజలు సహకరించాలన్నారు.

19/07/2026

'డెలివరీ' పేరుతో ఇంట్లోకి చొరబడే యత్నం!
ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఆన్లైన్లో ఆర్డర్లు, ఇంటికి రోజుకో డెలివరీ రావడం రొటీన్ అయిపోయింది.
అయితే కొందరు డెలివరీ బాయ్స్ ఇదే అదనుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. బెంగళూరు ఘటన మరువక ముందే ఓ డెలివరీ బాయ్ ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉందని భావించి చొరబడటానికి యత్నించాడు. డోర్ నెట్టి లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా, ఇంతలో లోపలి నుంచి అమ్మాయి తల్లి రావడంతో ఏవో మాటలు చెప్పి తప్పించుకున్నాడు.

బి కేర్ ఫుల్.

19/07/2026

నేడు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి మాస్ బోనాలకు సర్వం సిద్ధమైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండ కోట పరిసరాలు మార్మోగనున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5 లక్ష మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. కోటలో పోలీసులు, వైద్యులతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

17/07/2026

ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Address

Vishal Megha Mart
Beeramguda
502032

Website

Alerts

Be the first to know and let us send you an email when SRDNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share