మన సాంప్రదాయాలు

మన సాంప్రదాయాలు I hope u can get information about all our traditions...���

Hi all, I have been nominated for "Bharat Education Excellence Awards - 2025 BEEA 2025"  in the category of "Yuva Achary...
17/09/2025

Hi all, I have been nominated for "Bharat Education Excellence Awards - 2025 BEEA 2025" in the category of "Yuva Acharya Individual Award – For educators with less than 10 years of promising contributions".

So I request my friends, Colleagues, students, and well-wishers,

Please vote for me through the link and support.

Nomination id: NOM-BEEA25-0171
Name: Komakula Ramkumar
College: Shri Vishnu Engineering College for Women
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6RsfPwwgu_ia8c9nbMo-7DEuM_9Ria99eFN3qietiZh9Mgw/viewform?usp=header

Thankyou.

Note: Form should be valid up to Sep 29th 2025 Bharat Education Excellence Award is the most acclaimed accolade in the area of education. It highlights & recognizes the quality and diversity of the Faculty across India who has achieved excellence by their significant contributions towards the educat...

*చాతక పక్షి.....* *అడవులలో ఒక పక్షి ఉంటుంది. దాని పేరు చాతక పక్షి. దానికి స్వాభిమానం, ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎంత దాహం వే...
22/08/2025

*చాతక పక్షి.....*

*అడవులలో ఒక పక్షి ఉంటుంది. దాని పేరు చాతక పక్షి. దానికి స్వాభిమానం, ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎంత దాహం వేసినా వాన చినుకులను తప్ప మరో రకమైన నీళ్లు తాగదు. నీళ్లు దొరక్కపోతే ప్రాణాలు వదిలేస్తుంది కానీ, ఏ ఇంద్రుడంతటి వాడిని తప్ప సామాన్యుడిని యాచించదు. మధ్యలో ఇంద్రుడి ప్రస్తావన ఎందుకంటే, ఇంద్రుడు ఉత్తములైన దాతలకు ప్రతినిధి. పైగా ఆయన మేఘాలకు అధిపతి. ఆయన ఆజ్ఞ అయితేనే అవి వర్షిస్తాయి. కనక చాతక పక్షి దాహం తీర్చగల దాత శచీపతి ఒక్కడే.*

*చాతక పక్షికి చెరువులోని నీళ్లు సరిపడవు. నదుల నీళ్లూ అది వుచ్చుకోదు. బావులలో, కుంటలలో నీళ్లు అసలే ముట్టదు. దాని ముక్కు తలకు మీదుగా నడినెత్తిన ఉంటుంది. అలా తల పైకెత్తి నోరు తెరిచి, ఆకాశం నుంచి పడే వాన చినుకుల్నే తాగుతుంది. నదిలోనో, చెరువులోనో, మరెక్కడో నీళ్లు తాగాలంటే తల వంచి ముక్కుతో నీళ్లు పీల్చుకోవాలి. చాతకపక్షి తల* *కోసి ఇమ్మంటే ఇస్తుంది గానీ తలదించదు.*

*పూర్వకాలంలో స్వాభిమానానికీ, ఆత్మగౌరవం నిలుపుకొనేందుకు సుఖాలను వదులుకొనే వారికీ ఎక్కువ గౌరవం ఉండేది. జీవితధ్యేయం భోగానుభవమూ, దొరికినంత ధనార్జనా, దాంతో అందినంత తినటమూ, తాగటమూ, అందరికంటే ఎక్కువ ఆడంబరంగా జీవించడమూ మాత్రమే అని అనునిత్యం బోధించే వ్యాపార ప్రకటనలు ఉండేవి కావు. అందుచేత నిరాడంబరతా, తృప్తి, భోగ విముఖతా, వైరాగ్యం వంటి లక్షణాలను ప్రజా బాహుళ్యం గౌరవించేది. నమ్మిన ధర్మాన్ని ప్రాణాధికంగా భావించి ఆచరించే మహనీయులను నాటి సమాజం నెత్తిన పెట్టుకొనేది. సర్వసంగ పరిత్యాగులకూ, సార్వభౌములకూ సమానమైన గౌరవాదరాలు ఉండేవి. తృప్త జీవులూ, నిరాడంబరులూ అయిన దాన పరిగ్రహీతలకు దాతలకంటే ఎక్కువ గౌరవం.*

*అలాంటి నిరాడంబర జీవన విధానానికి చాతక పక్షి ప్రతీక. అది ఎవరో విసిరినవి ఏరుకుని తినదు. ఎవరినిబడితే వారిని దేబిరించదు. 'జుట్టెడు కడుపుకై చోరని చోట్లు చొచ్చి, పట్టెడు కూటికై బతిమాలదు. కాసులూ, కంటెలూ, గండపెండేరాల కోసం ఏ ఎండకాగొడుగు పట్టదు. ప్రాచీన కవుల కావ్యాలలో కనిపించేలాంటి చాతక పక్షులు ఇప్పుడు అంతరించిపోయాయేమో గానీ, చాతక పక్షులు అని పిలవబడే వాన కోయిలలు ఈనాటికీ ఆఫ్రికా, ఆసియా అడవులలో కనిపిస్తాయి. ఇవి వాన నీటిని నేరుగా లాగేస్తాయన్న మాట నిజమేకానీ, కేవలం వాన నీటి మీదే బతుకుతాయా అన్నది సందేహాస్పదమే. వాన కోయిలలు వలసపక్షులు. అవి కనిపించాయంటే వానలు కురవబోతున్నాయని సంకేతం.*
*┈┉━❀꧁చాతక పక్షి꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🦇🌼 🙏🕉️🙏 🌼🦇🌼

సేకరణ🙏

🎻🌹🙏చింతలూరులో - ధన్వంతరి స్వామి ఆలయం...!!🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్...
15/08/2025

🎻🌹🙏చింతలూరులో - ధన్వంతరి స్వామి ఆలయం...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌸తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు.

🌿ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది.

🌸విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు.

🌿నాలుగు హస్తాలతో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం.

🌸చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

🌿పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.

🌸ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలో మీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు.

🌷ఇతర ప్రాంతాల్లో…🌷

🌿తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. మహా అయితే, పంచామృతం పోస్తారు.

🌸ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది.

🌿కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం.

🌸కాలికట్ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. మరియు శ్రీ ధన్వంతరి ఆలయం మైసూర్..
వేపనూ, పసుపునూ మానవాళికి పరిచయం చేసిన ఘనత కూడా ధన్వంతరిదేనంటారు. శస్త్రచికిత్స విధానాన్ని శుశ్రుతాదులకు బోధించిన ఆదివైద్య గురువూ ఆయనేనంటారు..స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🙏🌹ఓం నమామి ధన్వంతరమాది దేవమ్!...🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

03/03/2025

*అబ్దుల్ కలాం గారి డైరీలో ఓ పేజీ!*
➖➖➖

ఒక రోజు ఒక పంచె కట్టుకుని భుజాలమీద శాలువ కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు.

అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి "ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడి లా ఉన్న ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా? అదీ ఈ నవీన యుగంలో! మనం చంద్రుడు మీదకు వెళ్ళాం. ఇంకా మీలాంటి వారు రామాయణం, మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు.”

అప్పుడు, ఆ పెద్దమనిషి ఆ యువకుడుని ఇలా అడిగారు,
“బాబూ.. గీత గురించి నీకు ఏమి తెలుసు?” అని.

అప్పుడు, ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు, ఏం జరుగుతుంది/వస్తుంది ఈ భగవద్గీత చదివితే? నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ లో పరిశోధనలు చేస్తున్నాను, నేను ఒక శాస్త్రవేత్తను. ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది.”

ఆ పెద్దమనిషి, ఆ యువకుడి మాటలకు నవ్వుతూండగా..
రెండు పెద్ద కార్లు అక్కడ కు వచ్చి ఆగాయి.
ఒక కారులో నుండి కొంతమంది Black Commandos దిగారు, రెండవ కారు లోంచి ఒక సైనికుడు దిగాడు. ఆ సైనికుడు దిగీ దిగగానే, వినయంగా సెల్యూట్ కొట్టి, కారు వెనుక తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఆ భగవద్గీత పారాయణం చేస్తూన్న పెద్దమనిషి, మెల్లిగా వెళ్ళి కారులో కూర్చున్నారు.
అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి లా ఉన్నారు అనుకుని, కారు దగ్గరకు పరుగెత్తి, ఆ పెద్దమనిషి ని “అయ్యా తమరు ఎవరు?” అని అడిగాడు.

ఆ పెద్దమనిషి చాలా ముందుగా, “నేను విక్రమ్ సారాభాయ్ ని” అన్నారు.

ఆ కుర్రవాడికి 440 వోల్టుల విద్యుత్ఘాతం తగిలినట్టయింది.

ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా...?

ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు.

ఆ తర్వాత కలాం గారు భగవద్గీత, రామాయణం, మహా భారతం పుస్తకాలు చదివారు.

దాని ఫలితంగా ఆయన, అటుపైన మాంసాహారం ముట్టకూడదు, అని ఒట్టు వేసుకున్నారు.
ఇదంతా కలాంగారు తమ ‘ఆత్మ కథ’ లో రాసుకున్నారు. అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు, శాస్త్రాలు.
అంతే కాకుండా ఇవి మన దగ్గర
మన దేశంలో పుట్టడం, భారతీయులకు గర్వకారణం, మరియు గొప్ప వారసత్వ సంపద అని రాశారు.

(అనువాదం:శొంఠి కామేశ్వరరావు)
ఇది చాలాఇష్టంతో చేసిన అనువాదం. ఇలాంటి గొప్పవిషయాలను పదిమందికి పంచండి. 🙏

🎻🌹🙏  శ్రీ నూకాలమ్మవారి ఆలయం (కాండ్రకోట )...!!🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌿పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడల మీదుగా స్వచ...
19/01/2025

🎻🌹🙏 శ్రీ నూకాలమ్మవారి ఆలయం (కాండ్రకోట )...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు.....

🌸వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. ఊరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.

🌿ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు) వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....

🌸 పెద్దాపురం నుంచి 10 కిమీ దూరంలో నూకాలమ్మ వారి ఆలయం కలదు. పెద్దాపురం మరిడమ్మ , కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలు చాల పెద్దవి .

🌿 దగ్గరకు వెళ్లి చూస్తుంటే మనకు తెలియకుండానే నమస్కరిస్తాము అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది .

🌸 పూర్వం కిమ్మీరాసురుడు అనేవాడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు.
తరువాత కాలంలో కాండ్రుడు అనే రాయి పరిపాలించడం వల్ల క్రాండ్రకోట అని పేరు వచ్చింది.

🌿కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడు. అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారు.

🌸అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడు.

🌿ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది.
అమ్మవారి అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు.

🌸ఆ ఆది పరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు

🌿అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు
ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరనిది.

🌸 ఫాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

🌿ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు...స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿సేకరణ 🌸🌿🌸🌿🌸🌿

19/01/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars – they help me earn money to keep making content that you love.

Whenever you see the Stars icon, you can send me Stars.

15/01/2025

Winning an argument is not as important as finding a solution.

People know you for what you have done, not for what you plan to do.

The most beautiful thing about learning something is that nobody can take it away from you.

Never trust your tongue, when your heart is bitter

A bend in the road is not the end of the road; unless you fail to make the turn

In journey of life it’s who you go with is more important than where you go

Every mountain top is within our reach if we just keep climbing


వాదనలో గెలవడం పరిష్కారం కనుగొనడం అంత ముఖ్యం కాదు.

మీరు ఏమి చేశారో దాని ద్వారా ప్రజలు మిమ్మల్ని తెలుసుకుంటారు, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని ద్వారా కాదు.

ఏదైనా నేర్చుకోవడంలో అత్యంత అందమైన విషయం ఏమిటంటే దానిని ఎవరూ మీ నుండి తీసివేయలేరు.

మీ హృదయం చేదుగా ఉన్నప్పుడు మీ నాలుకను ఎప్పుడూ నమ్మవద్దు

మార్గంలో ఒక మలుపు రహదారి ముగింపు కాదు; మీరు మలుపు తీసుకోకపోతే తప్ప

జీవిత ప్రయాణంలో మీరు ఎక్కడికి వెళతారు అనే దాని కంటే మీరు ఎవరితో వెళతారు అనేది చాలా ముఖ్యం

మనం ఎక్కుతూ ఉంటే ప్రతి పర్వత శిఖరం మనకు అందుబాటులో ఉంటుంది
#జీవిత పాఠాలు

🙏 collection 🙏

🙏సేకరణ 🙏

13/01/2025

*చాలా బాగుంది, ఇలా మన భారతదేశంలో ప్రతి స్కూల్లో ఇదేవిధంగా పిల్లల పుట్టినరోజు జరుపుకోవలని ఆ భగవంతున్ని నేను కోరుకుంటున్నాను.. మన పెద్దలు ఇలాగే చేసేవారు..కానీ ఇప్పుడు ఈ తరం వాళ్లు దీపాల ఆర్పి కార్యక్రమం చేస్తున్నారు.. ఇది తప్పు,.*
*మన సాంప్రదాయాన్ని మళ్లీ ఈ విధంగా జరువుకోవలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..*
*జై శ్రీరామ్ 🚩*

*✊🏻 సనాతన ధర్మం వర్ధిల్లాలి..🙏*

సేకరణ 🙏

05/01/2025

🔔 *పరిజ్ఞానం* 🔔

*సుదర్శన చక్రం : దీని పుట్టుకను గురించి మూడుకథలున్నాయి.*

1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండ్రి విశ్వర్కర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజను వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది.

2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల ఖాండవదహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంఢీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి అగ్నికి ఇవ్వబడతాయని కూడ ఒకచోట వ్రాయబడింది.

3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడ మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సమ్హరించేందుకు గాను చక్రన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శనచక్రం అని పిలుస్తాడు.

సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది.

సుదర్శనశక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రుసంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది.

మహాభారతం ఆదిపర్వం 16వ ఆధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది.

శ్రీవైష్ణవ సంప్రదాయంవారు సుదర్శనాన్ని చక్రత్తాళ్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపునాడు జరిగే చక్రస్నానం/అవబృదస్నానం చక్రత్తాళ్వార్ కే చేస్తారు.నిగమాంతమహాదేశికులవారు సుదర్శనం గొప్పతననాన్ని చాటి చెప్పారు. తమిళనాడు – చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుళ్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్రజ్వరంతో బాధపడుతుంటారు. ఆ సందర్భాననిగమాతదేశికులవారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు.

చక్రత్తాళ్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడ భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్ళు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలోచక్రత్తాళ్వార్లు వరహాస్వామివారి కోరలరూపంలో ఉన్నారని విశసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని పదివేళ్ళకు ఉండే నఖాలరూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు.

పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారలో సైతం సుదర్శనం పెరుమాళ్ళుకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాశురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శుక్రుని, సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులయి ఉంటారు. పార్వతి ఏమంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటిశక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు.

సుదర్శనం మహావిష్ణువునకు అయుధంకాగా సుదర్శనానికి పదునారు (16) ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంతదేశికులవారు సుదర్శనాయుధ స్తోత్రాలలో ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలిగిపోతాయని నమ్మకం.

సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు

కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి; కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, శార్ జ్గ, పాశ, సీర, వజ్ర గధ, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రుశంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి.

గజేంద్రమోక్షంలో మకరసంహారం; శిశుపాలవధ, జయద్రధ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రకవాసుదేవ సంహారం మొదలయిన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి.

తమిళనాడు – త్రిప్లికేన్ (తిరువళిక్కేణి) చెన్నైలోని పార్థసారధి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వర్దరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమౌతుంది.
కూరనారాయణా జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శనశతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయ్ మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు ‘ కంఠమాల ‘ అనే జబ్బుతో చాల బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రాథిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయన స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు.

శ్రీనాథకవిసార్వభౌముడు భీమేశ్వరపురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు.

నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసురవధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువయ్ మోళిలోని (4-1-8) పాశురంలో పెరియాళ్వారు జయద్రధ సంహారంలో సుదర్శనపాత్రను అభివర్ణించారు.

కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుక్కుడందై (కుంభకోణం), కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమోగూర్ లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి.

చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు “తతశ్చక్ర మయం సర్వం జగత్ స్థావర గంగమం” అని తెలియ చేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణుస్వరూపం. ఈ అంశాన్ని కూడా మనపెద్దలు ఇలా తెలిపారు.

చక్రాంభోజే సమాసీనం
చక్రాధ్యాయుధ ధారిణం
చక్రరూపం మహావిష్ణుం
చక్ర్ మంత్రేణ చింతయేత్;
సౌలభ్యచూడామణీస్తోత్రం

సుదర్శనవాజ్ఞ్మయం చాల ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాజ్ఞ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాజ్ఞ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించు కుందాం. “సుదర్శనవాద:” అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభా, పరకాలమఠం – మైసూరువారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో “సుదర్శనమీమాంస” అనే బృహత్ గ్రంథం ఉంది.
సుదర్శనోపాసకులయిన కూరనారాయణజీయరుస్వామివారు “సుదర్శన శతకాన్ని” 101 వృథ్వీవృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శనజ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26 మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ సోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలూడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితోపాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంతదేశికులవారు కూడా ఒక సుదర్శనశతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్యగారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారకట్రస్ట్ – బొంబాయివారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాలవిలాస ప్రెస్ లో కూడా భారద్వాజ గోపాలచార్య, శ్రీనివాసగోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికులవారి సుదర్శనశతకం ప్రచురించినట్లు తెలుస్తోంది. సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలు రెండు లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, హేతిపుంగవస్తవ:, సుదర్శనషట్కం, సుదర్శనాష్టకం, సుదర్శనకవచం, షోడశాయుధస్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్యచూడామణిస్తోత్రం, చక్రరాజమంగళం, అపరాధస్తవం మొదలయినవి సుదర్శన స్తోత్రవాజ్ఞ్మయానికి సంబంధించిన రచనలు. ఇవికాక ఇంకా ఉన్నాయి.

సుదర్శన షడక్షరమంత్రం, సుదర్శనా ష్టాక్షరీమంత్రం, సుదర్శన నారసిమ్హ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం (మరోపత్థతి), జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, అస్త్రమంత్రసుదర్శనం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శానమాలామంత్రం, మొదలయినవి మంత్ర శాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్ఠలతో ఆయా మంత్రాలను అనుష్టిస్తే, ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి.
జ్యోతిశ్శాస్త్రరీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం, సుదర్శన కవచం, సుదర్శనశతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలను జపించటం, పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు, సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు.

దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శీసుదర్శన నారసింహమూర్తి ప్రష్టించబడిందని పెద్దలమాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యాభేదనం, వశీకరణం, ఆకర్షణం, సంమోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం, వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి. సర్వపీడానివారణకూ,సర్వఫలప్రదాలకూ సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదనిమహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్రషట్కం (ఆరుచక్రాలు) చెప్పబడింది. అవి కాలచక్రం, పురుషచక్రం, ప్రకృతిచక్రం , మహాచ్చక్రం, అహంకార చక్రం జగచ్చక్రం.

ఏదైనా బాగా జరుగుబాటు వుండె చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటె చక్రం ఆగి పోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనే మన జీవితచక్రంలో చక్రం చోటు చేసుకుంది.

భీజాక్షరసంపుటితమైన మహా సుదర్శన మంత్రాన్ని నియమనిష్ఠలతో గురుముఖత: అభ్యసించి జపిద్దాము, సుదర్శనమంత్రాని పూజిద్దాము. “సర్వ ధర్మే నిధనం శ్రేయ: పరధర్మోభయావహా:” అనే గీతాచార్యుని ఉందేశం అనుష్ఠేయం కదా!

మంగళం చక్రరాజాయ
మహనీయ గుణాబ్దయే
పద్మనాభ కరాంభోజ
పరిస్ఖారాయ మంగళం||
జాలాజ్వాలా విభూషాయ
సహస్రాదిత్య తేజసే
సర్వాఘ హరినే విష్ణో:
చక్రరాజాయ మంగళం||

శాంతాకారం భుజగశయనం – పద్మనాభాం సురేశం
విశ్వాకారం గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం,
లక్ష్మీకాంతం కమలనయనం – యోగిహృద్ద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహారం – సర్వలోకైకనాథం ||

🙏🏻🙏🏻🙏🏻🔔సేకరణ 🔔🙏🏻🙏🏻🙏🏻

*దైవం మానుష రూపేణ**వాసుదేవమితి సర్వం.*   ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా?   *అనన్యాశ్చింతయోమా... యోగక్షేమం వహ...
22/12/2024

*దైవం మానుష రూపేణ*
*వాసుదేవమితి సర్వం.*
ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా?
*అనన్యాశ్చింతయోమా... యోగక్షేమం వహామ్యహం*```
- 9వఅధ్యాయం, 22వ శ్లోకం]
*నన్ను నమ్మి, అహంకారం వదలి, నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను-తనను నమ్ముకున్న భక్తులను ఉద్ధరించడానికి ఆ దేవ దేవుడు ఏ రూపములో అయినా వస్తాడు.*

ఉత్తరభారతం లో కొన్నేళ్ళ క్రితం పేద ఆయుర్వేద వైద్యుడు భార్య కుమార్తె తో కలిసి వుండేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఎప్పుడూ దైవ చింతనలో కాలం గడుపుతూ వుండేవాడు.

ఒకరోజుకు తమ జీవనానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. రేపు ఎలా? అనే ఆలోచన లేదు.

ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు[ఫీజు రూపంలో] రాగానే ఇక ఫీజు తీసుకోడు.
ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు, 80రూ. వచ్చింది. అంతే! తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం!

ఒక రోజు ఆసుపత్రి[చిన్న గది]ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి, డాక్టరు దగ్గరికొచ్చి “నన్ను గుర్తుపట్టారా?” అని అడిగాడు.

“క్షమించాలి,లేదు” అన్నాడు డాక్టరు.

అపుడు ఆయన ఇలా చెప్పాడు..”15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను, ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి 'లోపలికి రండి'అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి… 'మీరు ఏదో దిగులు పడుతున్నారు, ఆరోగ్యం సరిగాలేదా?'అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని 'నాన్నా, ఇక ఇంటికి వెళదాం, రండి' అని పిలిచింది. 'కాసేపు ఆగమ్మా, కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను…’నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక, కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే, నా బాధ గుర్తుకొచ్చింది”అన్నాను.

మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి 'మీరు, మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి’ అన్నారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి? అని అడుగుతుంటే అపుడు అక్కడ ఉన్న మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ, నాదగ్గరకొచ్చి 'ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో, ఆడబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు' అని అంటూ వెళ్ళిపోయాడు.
కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు ‘మాకు సంతానం ఇక కలగదు!’ అని చెప్పిన తరువాత కూడా, మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం, వృత్తిపట్ల మీఅంకిత భావం, మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను,రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం.”

”అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు. దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదంలో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళివయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆఅవకాశం ఇవ్వండి. ఈనెల 24న మా అక్క కూతురి పెళ్ళి. మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను. మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను. ఇది మీరు తీసుకోవాలి” అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు.

*అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు.*

అందులో చివరన ఇలా వ్రాసివుంది… *‘ఈనెల 22న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.*

| *ఓం నమః కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నామో నమః |*

🙏సేకరణ 🙏

🎻🌹🙏ఈరోజు తిరుప్పట్టూరు పరమశివుడు క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం....🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌸యోగశాస్త్రాన్ని రచించిన పతంజలి మహర్షి జీవ...
01/12/2024

🎻🌹🙏ఈరోజు తిరుప్పట్టూరు పరమశివుడు క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం....

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌸యోగశాస్త్రాన్ని రచించిన పతంజలి మహర్షి జీవసమాధి అయిన స్థలాలు కొన్ని ఆలయాలుగా ప్రసిధ్ధిచెందాయి.

🌿వాటిలో ప్రముఖమైనది తిరుప్పిడూరు
అనే తిరుప్పట్టూరు.

🌸పులికాళ్ళ మహర్షిగా పేరుగాంచిన వ్యాఘ్రపాదులవారిచే పూజించబడిన దివ్యక్షేత్రం యిది.

🌿తిరుచ్చి - చెన్నై మార్గంలో తిరుచ్చి సత్రం బస్ స్టాండ్ నుండి 30 కి.మీ దూరంలో వున్న అద్భుతమైన ఊరు.

🌸తిరుప్పట్టూరు దర్శన భాగ్యం కేవలం దైవ యోగం వున్న వారికే కలుగుతుందని అంటారు. ఆవిధంగా తిరుప్పట్టూరు వచ్చే భక్తుల విధివ్రాతలను శుభకరంగా మార్చి వ్రాయాలని పరమశివుడు యిచ్చిన ఆనతి.

🌿ఒకానొక కాలంలో ఆది శేషువుపై అరమూత కన్నులతో శయనించిన మహావిష్ణువు తనలో తాను నవ్వుకుంటూ పరవశించిపోతూ వున్నాడు. పరమానందంతో ఆయన శరీరం బరువెక్కింది.

🌸మహావిష్ణువుని మోస్తున్న ఆదిశేషువుకి మహావిష్ణువు హటాత్తుగా బరువు పెరగడంతో మ్రోయడానికి శ్రమ కలిగినది. మహావిష్ణువుని భరించడం భారంగా తోచినది. మహావిష్ణువు అంత ఆనందభరితుడై వుండడానికి కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యపడ్డాడు ఆదిశేషువు. స్వామినే అడిగాడు.

🌿అందుకు మహావిష్ణువు తన్మయత్వంతో
"ఆదిశేషా.. నా దేహం బరువు ఎక్కడానికి కారణం నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు. చెప్తాను, విను. నేను ఇక్కడనుండే కైలాసంలో మహేశ్వరుని ఆనందతాండవం తిలకించాను. నా మనస్సు ఉప్పొంగిపోయింది. ఆ నాట్యం చూసి ఆనందించేను.

🌸అందువలన నా దేహం మనసు ఆనందంతో
బరువెక్కినది" అని తెలిపాడు. ఆదిశేషువుకి సందేహం తీరినది. కానీ ఆ శివతాండవాన్ని తాను దర్శించాలని ఉవ్విళ్ళూరాడు.

🌿మహేశ్వరుని ఆనందతాండవాన్ని యీ దాసుడు కూడా చూడాలి.

🌸ఆ భాగ్యాన్ని కలుగజేయండని మహావిష్ణువుని వేడుకున్నాడు. అందుకు మహావిష్ణువు తెలిపిన ఆదేశం పాటిస్తూ ఆదిశేషువు కైలాసానికి దిగువన తపస్సు చేయనారంభించాడు.

🌿ఆదిశేషువు సుదీర్ఘకాల తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆదిశేషువు కోరిక తీరే మార్గం తెలిపాడు. "నీవు భూలోకంలో వ్యాఘ్రపురంలో కశ్యప మహర్షికి కద్రువకి పుత్రునిగా పుట్టి పతంజలి అనే పేరుతో పెరిగిన పిదప అనేక ముఖ్య పుణ్యస్ధలాలలో
నా తాండవలీలలు నీవు దర్శించగలవు" అని అభయమిచ్చాడు.

🌸ఆవిధంగా భూలోకంలో జన్మించిన పతంజలి సకల శాస్త్రాలు అధ్యయనం చేసి యోగవిద్యలో పాండిత్యం సంపాదించి
గొప్ప యోగి అయినాడు.

🌿పతంజలి మహర్షికి మిత్రుడు వ్యాఘ్రపాదులు. ఈ ఇరువురు మానవరూపాలలో కనిపించినా పతంజలి మహర్షి నడుముకి కింద భాగం సర్పరూపములో, వ్యాఘ్రపాదులు పేరుకు తగినట్లు ఆయన శరీరం క్రిందిభాగం పులి రూపంలోను వుంటుంది.

🌸ఈ ఇద్దరు ఋషులు దేశమంతా తీర్ధయాత్రలు చేసి వచ్చారు. ఆ సమయంలో వారికి దర్శనం యిచ్చిన ఈశ్వరుడు దక్షిణాదిన గల తిల్లై క్షేత్రంతో కలిపి తొమ్మిది పులియూర్ శైవక్షేత్రాలను దర్శిస్తే వారికి తన తాండవ దర్శనం లభిస్తుందని వరమిచ్చాడు.

🌿పతంజలి, వ్యాఘ్రపాదులు ఇద్దరూ ముందుగా పుష్యమాసంలో పుష్యమి తిధిన తిల్లైగా పేరు పొందిన పులియూరుకి వచ్చారు.వారి వెంట మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు
కింకరులతో, శివగణాలు, గంధర్వులు
అందరూ తిల్లైకి తరలి వచ్చారు.

🌸అక్కడ ఈశ్వరుడు కనకసభాపతిగా ఆనందతాండవాన్ని ప్రదర్శించి అందరిని
ఆనందపరిచాడు.

🌿మునులు ఇద్దరికి ఆనందంతో
కన్నీరు వర్షించగా "ఈశ్వరా..ఈ తాండవాన్ని దర్శించడానికే జన్మించాము. చాలు ..చాలు , మా జన్మ ధన్యమయింది.

🌸మమ్మల్ని యిప్పుడే మీలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించండి" అని వేడుకున్నారు..

🌿"ఎప్పుడైతే కోరికలతో మీరు జన్మ ఎత్తారో అప్పుడే మీరు మాయామోహంలో చిక్కుకున్నారు అని అర్ధం. నా తాండవం చూడాలని కోరుకున్నారు. అది నెరవేరినది.

🌸ఇప్పటికిప్పుడు వెంటనే మోక్షం అసాధ్యం.
నేను చెప్పిన విధంగా మిగతా ఎనిమిది పులియూర్లను దర్శించండి. మీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించండి, వెళ్ళండి.

🌿ఈ ఎనిమిది క్షేత్రాలలో ఒక అద్భుతమైన స్ధలంలో మీ కోరిక నెరవేరుతుందని అనుగ్రహించాడు పరమశివుడు.

🌸ఈ దివ్య మార్గం కేవలం ఒక్క పతంజలి, వ్యాఘ్రపాదులకు మాత్రమే చూపించిన మార్గం కాదు, మానవజన్మ ఎత్తిన వారందరికి వర్తిస్తుంది.

🌿పరమశివుడు చెప్పినట్లుగానే పతంజలి, వ్యాఘ్రపాదుల వారుమిగతా ఎనిమిది స్ధలాలు దర్శించడానికి బయలుదేరేరు. తిల్లై అనే పులియూరు నుండి బయలుదేరి,

🌸తిరుప్పాదిరుప్పు పులియూరు, ఎరుక్కతం పులియూరు, ఓమాం పులియూరు,
సిరుపులియూరు, అత్తిపులియూరు
తప్పళాపులియూరు, పెరుంపులియూరు, గానాట్టంపులియూరు అనే ఎనిమది శైవ క్షేత్రాలను దర్శించారు.

🌿ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధమైన శివతాండవ దర్శనాలతో ఆనందించి పరవశించారు.

🌸లోక శ్రేయస్సు కోసం తమ జీవితాలను వెచ్చించి అంతిమంగా శివైక్యం చెందారు...స్వస్తీ....🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸సేకరణ 🌿🌸🌿🌸🌿🌸

30/11/2024

🎻🌹🙏శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలు...

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸‘రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు.

🌿జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు.

🌸‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు.., అంతేకాదు,

🌷‘మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’-

🌿ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది.

🌸వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి.

🌿'శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో వుంది.

🌸అటువంటి మహాశివుడిని కార్తీకమాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారతమ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు.

🌿కార్తీకంలో ఏరోజు శివపూజ చేయకపోయనాకార్తీక పున్నమి నాడు మూడువందల అరవై వత్తుల గుత్తిని స్వామి ఎదురుగా కానీ తులసి సన్నిథిలోకానీ, మారేడు, రావి చెట్ల దగ్గర కానీ వెలిగిస్తే ఆ సంవత్సరం దీపం వెలిగించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది.

🌸కార్తీక పున్నమినాడు దేవాలయాల్లో శివుని ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.

🌿ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానందభాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే
అని కార్త్తీకంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు.

🌸ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది.

🌿ఉసిరిక దీపదానం కూడా ఈ మాసం లో విశేషంగా చేస్తారు.

🌸ఓం నమః శివాయ నమః అంటూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యరాశి లభిస్తుందంటారు.

🌿శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనామంతో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినా సరే అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్రహిస్తాడు..స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿సేకరణ 🌸🌿🌸🌿🌸🌿

Address

Nanduri Vari Street
Bhimavaram
534201

Website

Alerts

Be the first to know and let us send you an email when మన సాంప్రదాయాలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన సాంప్రదాయాలు:

Share

Category