23/04/2025
ప్రధాని మోడీ ఈరోజు ఇండస్ జల ఒప్పందాన్ని రద్దు చేశారు.
అసలు ఇండస్ జల ఒప్పందం అంటే ఏంటో చూద్దాం.1960లో భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఇండస్ జల ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం, ఇండస్ నదీ వ్యవస్థలో ఉన్న మొత్తం జలాల్లో 30 శాతం భారత్‌కు,70 శాతం పాకిస్తాన్‌కు కేటాయించారు.
ముఖ్యంగా పాకిస్తాన్‌కు పశ్చిమ నదులు అయిన ఇండస్, చెనాబ్, జెలం నదులపై ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి ఇవి జీవనాధారంగా మారాయి. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో ఈ నీటి మీదే ఆధారపడి ఉంటుంది ఆ దేశం.అయితే, ఉగ్రదాడుల కారణంగా ఈ ఒప్పందంపై సందేహాలు మొదలయ్యాయి.
2016 లో "ఉరి" దాడి తర్వాత ప్రధాని మోదీ “ రక్తం మరియు నీరు కలిసి ప్రవహించలేవు” అంటూ గట్టిగా స్పందించారు.అప్పటి నుంచి ఈ ఒప్పందం రాజకీయంగా కూడా ప్రాధాన్యత పొందింది. అదే నేడు భారత్ కు ఓ ఆయుధంగా మారబోతుందని అర్థమవుతుంది.
ఇది వరకు రెండు దేశాల మధ్య జరిగే వివాదాల మధ్య ఈ ఒప్పందం కొనసాగుతూ వచ్చినా, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కొనసాగేలా లేదు.నీటిని దౌత్య ఆయుధంగా వినియోగించడం ద్వారా భారత్ తన ఆలోచన విధానాన్ని మార్చిందని చెప్పవచ్చు.మొత్తానికి నీటి యుద్ధం మొదలైనట్టే చెప్పవచ్చు.
Anjaneyulu Goud