03/11/2025
ఇవాళ చీరాలలో ఒక ఫేస్‌బుక్ లో ఒక పోస్టు చూశాను.సీఎం చంద్రబాబు కుమారుడు,టిడిపిలో నెంబర్ టు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను కలిసే అవకాశం తాను కల్పిస్తానంటూ చీరాలలో రాజకీయం చేస్తున్న ఒక మంగళగిరి నాయకుడు ఆ పోస్టులో పేర్కొన్నాడు.ఏమిటిది లోకేష్ గారూ?మిమ్మల్ని కలవాలంటే మధ్యవర్తులు ఉండాలా? మీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ఇలాంటి నాయకులు మీ దృష్టికి రాలేదా? ఇలాంటి వారి వల్ల మీరు గబ్బుపట్టి పోతున్నారు.ఇకనైనా జాగ్రత్త పడండి!