10/02/2023
వీర సింహం - మాయా చెట్టు పార్ట్-2 || King Lion and Magical Tree Greedy Gorilla attack Wild stories******* వీర సింహం - మాయా చెట్టు పార్ట్-2 ***************
వీర నెమ్మదిగా మెట్లెక్కి చెట్టు లోపలకు వెళ్ళాడు..
లోపల అదో అందమైన ప్రపంచంలా ఉంది.. చాలా ఆహారం కూడా కనిపించింది. అతనికి ఆహారం తినాలని లేదు..
"నాకు ముందు మా నాన్నను చంపింది ఎవరో తెలుసుకోవాలని ఉంది" అన్నాడు వీర..
"ముందు ఆకలి తీర్చుకో తరువాత అన్నీ తెలుస్తాయి.." అని వినిపించింది.
ఆకలిగా ఉందేమో.. అక్కడ కనిపించిన ఆహారాన్ని వేగంగా తినేసాడు.
తరువాత అక్కడికి ఎగురుకుంటూ బంగారు పక్షి ఒకటి వచ్చింది.. "వీరా.. నేను మాయా పక్షినీ .. నీ తండ్రిని చంపింది ఎవరో చెప్పడానికే నేను వచ్చాను.. "
ఆ మాట వినగానే వీర అదెవరో చెప్పమని చాలా తొందరచేసాడు.
"నీ తండ్రి ధీరని చంపింది నిన్ను చూసుకుంటున్న ఆ గొరిల్లానే.."
"నేను నమ్మను.. గొరిల్లా మామ చాలా మంచిది.. నన్ను బాగా చూసుకుంటుంది.. "
"అది మాయ మాటలతో నిన్ను మోసం చేస్తుంది వీరా.. శాశ్వతంగా ఈ అడవికి రాజు కావాలని దాని ఆశ.. మీ నాన్నను ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కానిపనీ.. అందుకే మీ నాన్న ధీరని.. పులివేషం వేసుకుని వచ్చి.. దొంగచాటుగా చంపేసింది.. ఒకవేళ మీనాన్నను చంపడం ఎవరైనా చూసిన అది పులి మీదకి నెట్టవచ్చని దాని ఎత్తుగడ.. ఇప్పుడు అదను చూసి నిన్ను చంపాలని చూస్తోంది.."
వీరకి గొరిల్లాపై చాలా కోపం వచ్చింది.
"నీకో నిజం చెప్పనా.. అదిప్పుడు అడవిలోని జంతువులన్నింటినీ చాలా కష్టాలు పెడుతోంది. ఈ అడవికి కాబోయే రాజుగా దానిని చంపి నీ వారిని రక్షించుకోవడం నీ బాధ్యత.. " అన్నది.
"కానీ నేను చిన్నవాడిని .. దానిని ఎదిరించడం నా వలన అవుతుందా.."
"ఏం భయపడకు.. నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను.. ఆ శక్తుల వల్ల నీవు ఎంతడి బలవంతుడినైనా ఎదిరించి నెగ్గగలవు.." అని శక్తులు ఇచ్చింది..
"వెళ్లు.. వెళ్లి నీ వారినీ, ఈ అడవిని కాపాడు.." అని చెప్పి ఎగిరిపోయిందా పక్షి.
చెట్టులోంచి బయటకు వచ్చిన వీర కోపంతో ఊగిపోతూ వేగంగా గొరిల్లా స్దావరానికి వెళ్లాడు. అప్పటికే వీర కనిపించకపోవడంతో తిరగొచ్చిన గొరిల్లా కోపంతో ఉంది.. స్దావరానికి వస్తూనే వీర "మా నాన్నను చంపిన నిన్ను వదలను..." అంటూ గొరిల్లాపై దాడికి దిగింది.
వీరకి అసలు నిజం తెలిసిపోయిందని గ్రహించిన గొరిల్లా కూడా పిల్ల వీరనే కదా అనుకుని ప్రతి దాడికి దిగింది. ఈ యుద్దాన్ని చూడటానికి జంతువులన్నీ కూడా అక్కడకు చేరాయి..
(వీర సింహం-గొరిల్లా ఫైట్)
చివరికి వీర చేతిలో గొరిల్లా చావు దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది.
అలా దుష్ట గొరిల్లా బాధలు తప్పిపోవడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి. తమ యువరాజు వీర తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నాయి.