20/06/2026
రూ. 2 కోట్లతో 50 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి
డియాజియో గ్రూప్ — టార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యు.కొత్తపల్లి మండలంలోని 50 అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో సంస్థ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లపాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నారు. దీనికంటే ముందే నియోజకవర్గంలోని మరో 110 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ తో అపోలో సంస్థ ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి Pawan Kalyan Janaina Sena JanaSena Party