18/09/2022
గుజరాత్ రాష్ట్రంలో గల సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC భవనం) మాదే అని క్లైమ్ చేసిన గుజరాత్ వక్ఫ్ బోర్డు.
2015-16లో అబ్దుల్ వదూడ్ జురుల్లా అనే ఆయన ప్రస్తుత మునిసిపల్ కార్పొరేషన్ భవనం అంటే గతంలో ముగ్లిసరాయ్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని కేంద్ర వక్ఫ్ బోర్డు కు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖకు ఉత్తరం రాశాడు. జూరుల్లా ప్రకారం 1857లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుంది అప్పటి వరకు అది హాజ్ యాత్రికుల సత్రంగా వుండేది అని పేర్కొన్నాడు
ఈ పిటిషన్ పై కేంద్ర వక్ఫ్ బోర్డు గుజరాత్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ని చర్య తీసుకోమని ఆదేశించడంతో గుజరాత్ వక్ఫ్ బోర్డ్ 1995 వక్ఫ్ చట్టంలోని 36 ప్రకారం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొగల్ సరాయ్ ఆస్తి ని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించి ఆ భవనానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, అంటే అసలు నగర సర్వే పత్రం, సరాయ్ లేదా ముసాఫిర్ఖానా (ట్రావెలర్స్ ఇన్) మూసివేయడానికి గల కారణాలు, లీజు ఒప్పందం, ఆస్తి పన్ను పత్రం, విద్యుత్ బిల్లుల కాపీలు మొదలైన వాటితో సహా సంబంధిత పత్రాలను 10 రోజులలోపు అందించాలని మున్సిపల్ కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది.
2021లో వక్ఫ్ బోర్డు ఈ SMC భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది. దీనిపై బోర్డ్ వివరణ ఇస్తూ
మొఘల్ చక్రవర్తి షాజెహాన్ హయాంలో, సూరత్ అతని కుమార్తె జహనారా బేగం యొక్క ఆస్తి అని, ఆమె సన్నిహితుడు ఇషాక్‌బైల్ యాజ్దీ అకా హకిఖత్ ఖాన్ క్రీ.శ. 1644లో రూ. 33,081 ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించి దానికి హుమాయున్ సరాయ్ అని పేరు పెట్టారు అని, పశ్చిమ తీరంలో సూరత్ ప్రధాన ఓడరేవుగా ఉన్నందున హజ్ యాత్రికుల కోసం దానిని ఒక సత్రంగా ఉపయోగించేందుకు విరాళంగా ఇచ్చారు అని వక్ఫ్ బోర్డు పేర్కొంది.
ఈ భవనం ఒక ముస్లిం రాజు వక్ఫ్ ఆస్తిగా విరాళంగా ఇచ్చినందున, ఆ ఆస్తి దేని కోసం ఇచ్చారో ఆ ఉద్దేశ్యం మారదు అంటూ బోర్డు ఇస్లామిక్ షరియాను ఉదహరించింది. అంతే కాక 'ఒక సారి ఏదైనా వక్ఫ్ ఆస్తి అయితే, ఎల్లప్పుడూ అది వక్ఫ్ ఆస్తి' అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉటంకించింది.
అయినా దీనిపై యెటువంటి పురోగతి లేకపోవడం తో పిటిషనర్ జురుల్ల గుజరాత్ హైకోర్టు ని ఆశ్రయించాడు. తన వాదనకు మద్దత్తుగా దాదాపు 400 ఏళ్ల నాటి ఈ భవనం 1867 లో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకునే వరకు హజ్ యాత్రికుల కోసం సత్రంగా వాడుకలో ఉందని నిర్ధారించడానికి జరుల్లా 17 పత్రాలను అందించాడు.
అయితే సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ వాదనను వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎనిమిది పత్రాలను అందించింది. ఈ భవనాన్ని 1867లో బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారని, 1961లోనే రెవెన్యూ రికార్డులలో తగు మార్పులు చేశారని వాదించింది.
అంటే ఈ లెక్క ప్రకారం మొత్తం భారత దేశం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించమని కోరే అవకాశం వుందా? ఎందుకంటే ఎవరో ఒక ముఘల్ రాజు ఒక ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ ఆల్లాకు కానుకగా సమర్పించి వుండ వచ్చు కదా? అలా అందరు రాజులూ ప్రకటించి వుండి వుంటే భారత్ మొత్తం వక్ఫ్ ఆస్తి గా గుర్తించ బడాల్సిందే.
#దేశవిభన
#ముందుచూపులేని_మూర్ఖనాయకులు
#దేశాన్ని_సత్రంచేసిన_సెక్యులరిజం
...చాడా శాస్త్రి....