
07/03/2023
Rest in peace, Deva Raj anna.
దళిత సమాజానికి బలమైన అండ, ఉన్నత విద్యావంతుడు అయిన అన్న గారు ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్ర విచారకరం, శక్తిమంతమైన స్వరాన్ని కోల్పోయిన మన తెలుగు దళిత సమాజానికి ఆయన హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. దళిత సమాజాన్ని దుక్కంలో ముంచేసి తన విద్యని, పోరాటాన్ని వారసత్వంగా మిగిల్చి వెళ్ళిపోయాడు.
దేవరాజ్ అన్న అగ్ర కుల పీడనని అనుభవించి పట్టుదలతో ఉన్నత విద్య అభ్యసించి అత్యంత ఎత్తుకి ఎదిగిన విద్యావేత్త, దళిత మేధావి. దళిత చైతన్యానికి, దళిత విద్యార్ధులకు మద్దతుగా తన జ్ఞానాన్ని, ప్రతిభని, తన స్తానాన్ని ఉపయోగించడం పట్ల ఎక్కువ శ్రద్ద చూపాడు, అణగారిన వర్గాల హక్కుల కోసం తన పరిధిలో అవిశ్రాంతంగా పోరాడాడు.
దేవరాజ్ అన్న దళిత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా యువ దళిత విద్యార్థులకు మార్గదర్శకత్వం కోసం ఒక ప్రొఫెసర్‌గా ఎన్నో loc విదాలుగా సహకరిస్తూ వచ్చాడు, దళిత విద్యార్ధులు ఎదుర్కొన్న అడ్డంకులను తొలగించడానికి వారి కలలను కొనసాగించడానికి ఎంతగానో సహాయ పడ్డాడు.
దళితుల సమస్యల పట్ల దేవరాజ్ అన్న యొక్క నిబద్ధత తిరుగులేనిది, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని పెంపొందించడానికి అతను దళిత కార్యకర్తలు మరియు సంస్థలతో కలిసి పనిచేయడమే అనేక రకాలుగా ఆర్ధిక సహాయం అందిస్తూ వచ్చాడు.
దేవరాజ్ అన్న యొక్క వారసత్వం అతను సహకరించిన లెక్కలేనన్ని జీవితాల ద్వారా మరియు దళిత చైతన్యం కోసం అతను చేసిన పోరాటం ద్వారా జీవించి ఉంటుంది.
దేవరాజ్ అన్నని కోల్పోవడం దళిత సమాజానికి, సామాజిక న్యాయం కోసం విస్తృత పోరాటం చేస్తున్న వారికి పెద్ద దెబ్బ. ఈ సందర్భంగా దేవరాజ్ అన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము, సామాజిక న్యాయం, సమానమైన హక్కులు కోసం పోరాడడం ద్వారా మేము అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేవరాజ్ అన్న జ్ఞాపకాన్ని గౌరవిస్తూనే ఉంటాము.
With a heavy heart and tears in my eyes, I sign off as your fellow brother in the Dalit community.
~ Vijay Kumar Vangalapudi